మూడు జనరేషన్ల బంధం బలంగా ఉండాలంటే ఈ పనులు తప్పక చేయాలి..!

Publish Date:Aug 22, 2025

Advertisement

 


తల్లిదండ్రులు పిల్లలకు గైడ్లు, టీచర్లు, మార్గదర్శకులు. వారు పిల్లలకు ప్రేమపూర్వకమైన, సురక్షితమైన,  ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వడం ద్వారా జీవితాన్ని ఆశాజనకంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు.  అయితే తల్లిదండ్రులకు,  పిల్లలకు మధ్య బంధం జనరేషన్ మారగానే బంధం కూడా మార్పుకు లోనవుతూ ఉంటుంది.  పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు పుట్టిన తరువాత చాలామంది తమ తల్లిదండ్రులకు దూరంగా జరుగుతూ ఉంటారు. ఇది కావాలని చేసేది కాకపోయినా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కూడా మార్పులు జరుగుతాయి. చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు,  అవ్వ తాతలు.. ఇలా మూడు తరాల మధ్య బంధం బలంగా ఉంటే ఆ కుటుంబాలు చాలా గొప్ప సంపదను పోగేసుకున్నట్టే.. అయితే ఇలా మూడు తరాల బంధం బలంగా మారడానికి చేయాల్సిందేమిటి? తెలుసుకుంటే..

 కృతజ్ఞత..

తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే వాటికి మాటల్లో థాంక్స్ చెబితే సరిపోదు. కానీ మానసికంగా బలమైన కుటుంబ సంబంధాలను పెంపొందించడానికి,  భవిష్యత్ తరాలను పోషించడానికి ఇది ఒక మార్గం.  కుటుంబంతో ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు  తల్లిదండ్రులతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం,  కృతజ్ఞతను వ్యక్తం చేయాలి. ఇది చూస్తే మీ పిల్లలు కూడా తమ అవ్వతాతలు ఎంత గొప్పవారు, వారిని గౌరవించాలి అనే విషయాన్ని నేర్చుకుంటారు. ఇది పెద్దవారి పట్ల పిల్లలలో మంచి అభిప్రాయం,  మంచి నడవడికను పెంపొందిస్తుంది.  పిల్లల ముందు ఎట్టి పరిస్థితులలోనూ పెద్దలను దూషించడం,  గేళి చేసి మాట్లాడటం చేయరాదు.  

పిల్లలు వారుకళ్లతో చూసే దాన్నే  నేర్చుకుంటారు. తమ తల్లిదండ్రులు తమ పెద్దలను జాగ్రత్తగా చూసుకోడం, గౌరవించడం వంటివి చేస్తే  పిల్లలు కూడా కరుణ, సున్నితత్వం వంటివి నేర్చుకుంటారు.   పెద్దలను చూసుకోవడం తమ భాద్యత అనే భావాన్ని మనసులో పెంపొందించుకుంటారు. ఇది పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రుల పట్ల మాత్రమే కాకుండా, సమాజంలోని ఇతరుల  పట్ల కూడా పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది.

వృద్ధులకు సేవ చేయడం భారం కాదని.. సేవ అనేది  ప్రేమ, కృతజ్ఞత చూపించే అవకాశం అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది పాఠశాల లేదా పుస్తకాల నుండి పిల్లలకు లభించే గుణం కాదు.. కేవలం తమ చుట్టూ ఉన్న వాతావరణం ద్వారానే సాధ్యమవుతుంది.  మందులు ఇవ్వడం, మాట్లాడటం, సమయం గడపడం వంటివి పిల్లల మనస్సుల్లో లోతైన ముద్ర వేస్తాయి. ఈ కారణంగానే పెద్దలకు ఏదైనా సేవ చేసేటప్పుడు తప్పనిసరిగా పిల్లలను కూడా వెంట ఉంచుకోవడం మంచిది.

తల్లిదండ్రులకు కూడా ప్రేమ అవసరం.  తల్లిదండ్రుల కోసం ఏదైనా చేసినప్పుడు వారు చాలా సంతోషంగా ఉంటారు.చుట్టూ ఉన్న నలుగురికి తమ పిల్లలు తమకు ఏం చేశారు అనే విషయాన్ని చెప్పుకుని మరీ చాలా గర్వంగా ఫీలవుతూ సంతోషిస్తారు.  అందుకే తల్లిదండ్రుల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటే అటు తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడమే కాకుండా.. ఇటు పిల్లలకు కూడా ఒక అభ్యసనం అవుతుంది. ఇది మూడు తరాల బంధాన్ని చాలా ఆరోగ్యంగా,  బలంగా  ఉంచుతుంది.

                                *రూపశ్రీ

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.