పెళ్లి చేసుకోబోయే వారికి ముఖ్యమైన చిట్కాలు.. ఇలా చేస్తే మీ బంధం పదిలం..!

Publish Date:Aug 21, 2025

Advertisement

 

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన,  ముఖ్యమైన సంబంధం. ఇది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక కూడా. వివాహం జరిగిన మొదట్లో  కొత్త అలవాట్లు, కొత్త బాధ్యతలు,  బంధంలో అంచనాలు వంటి అనేక  పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య కానీ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఆ సంబంధాన్ని బలంగా, సంతోషంగా,  దీర్ఘకాలం కొనసాగించవచ్చు. వివాహం తర్వాత సంబంధాన్ని బలోపేతం చేయడానికి అత్యంత ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకుంటే..

 కమ్యూనికేషన్..

కొత్తగా పెళ్లైన వారు  సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఒకరితో ఒకరు స్పష్టంగా,  నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు ఓపెన్ గా  మాట్లాడాలి.  మనసులో ఏవైనా సందేహాలు, సందిగ్ధాలు, అనుమానాలు ఉంటే వాటిని ఓపెన్ గా మాట్లాడి పరిష్కరించుకోవాలి. లేకపోతే ఇది మనసులో పెద్ద అగాధాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది.   చిన్న చిన్న విషయాలను కూడా పంచుకోవడం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది.

 గౌరవం..

పెళ్లి చేసుకుంటే ఇద్దరూ తమ ఇష్టాలను కోల్పోయి ఇద్దరికి కలిపి కొన్ని ఉమ్మడి ఇష్టాలు పెట్టుకోవాలని కాదు.. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కొన్ని వదులుకోవాలనే విదంగా ఇంట్లో పరిస్థితులు,  ఒత్తిడులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా తప్పు..   వివాహం తర్వాత కూడా ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలి.  ఒకరి కెరీర్ లక్ష్యాలను మరొకరు ప్రోత్సహించాలి.  ఎవరి గుర్తింపు వారికి ఉండనివ్వాలి.

ప్రాధాన్యత..

వివాహం తర్వాత అత్తమామలు,  తల్లిదండ్రులిద్దరికీ సమ ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యం. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కలిసి తీసుకోవాలి. కుటుంబం, బంధువులు,  భాగస్వామి మధ్య సమన్వయం సంబంధంలో సామరస్యాన్ని తెస్తుంది.

డబ్బు విషయాలు..

వివాహం తర్వాత బాధ్యతలు ఖర్చులు రెండూ పెరుగుతాయి.  ఖర్చులు, పొదుపులను కలిపి ప్లాన్ చేసుకోవాలి. డబ్బు విషయాలను బహిరంగంగా చర్చించడం ముఖ్యం. అలాగే డబ్బు విషయాలలో ఒకరి మాటే నెగ్గాలి అనే మనస్తత్వం ఉండకూడదు.  డబ్బు కారణంగా గొడవలు పెరిగే పరిస్థితులు ఉంటే.. ఆ డబ్బు గురించి కొన్ని రోజులు మాట్లాడకుండా వదిలేయడం మంచిది.  డబ్బు  ఎప్పుడూ భార్యాభర్తలను విడదీసే అంశం కాకూడదు.

పర్సనల్ స్పేస్..

ప్రతి వ్యక్తికి తమకంటూ స్పేస్ లేదా కొంత స్వేచ్ఛ అవసరం. నువ్వు నా సొంతం అయిపోయావు అనే మెంటాలిటీని మితిమీరి  ప్రదర్శించకూడదు. భాగస్వామి  తమ స్వంత ఇష్టాల ప్రకారం జీవించగలిగేలా వారికి కొంత స్పేస్ ఇవ్వాలి. అన్నీ తాము కంట్రోల్ చేయాలని చూడకూడదు.  అధిక నియంత్రణ సంబంధాన్ని దెబ్బతీస్తుంది.

సెలబ్రేట్స్..

పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రమోషన్లు లేదా చిన్న విజయాలను కూడా కలిసి జరుపుకోవాలి. ఇది సంబంధాన్ని తాజాగా,  ప్రేమగా ఉంచుతుంది.

కలిసికట్టుగా..

ఏ సమస్యనైనా "ఇద్దరు"గానే పరిష్కరించుకోవడం మంచిది. ఒకరినొకరు నిందించుకోవడం, వాదనలు చేసుకోవడం మానుకోవాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు కొద్దిసేపు సైలెంట్ గా ఉండి.. ఆ తర్వాత ఇద్దరూ ఒక చోట కూర్చుని ఇద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది?  ఎవరు ఎవరి వల్ల బాధపడ్డారు? తప్పు ఎవరిది?  వంటి విషయాలను నిజాయితీగా,  ఓపెన్ గా మాట్లాడుకుంటే సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది. అయితే.. తప్పును ఒప్పుకోకుండా ఇగో ప్రదర్శించడం వంటివి చేస్తే బంధం నిలబడటం కష్టం అవుతుంది.  బంధంలో ఇగో ఎప్పుడూ ఉండరాదు.


                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.