భార్యను బాగా చిరాకు పెట్టే భర్త అలవాట్లు ఇవి.. రిపీట్ అయితే రిలేషన్ ఢమాల్..!

Publish Date:Oct 17, 2025

Advertisement

 

వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధం  సంఘర్షణతో నిండి ఉంటుంది. విభిన్న వ్యక్తిత్వం కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం,  పరిస్థితులకు అలవాటు పడటం అనేది చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది.  ఇద్దరూ కలిసి అన్ని సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లడాన్నే  ప్రేమ,  అర్థవంతమైన బంధం అని అంటారు. కానీ కొన్నిసార్లు ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య  సంబంధాన్ని నాశనం చేసే విధంగా ఏదైనా మాట్లాడతాము. ముఖ్యంగా భర్త మాట్లాడే కొన్ని మాటలు,  చేసే పనులు, అలవాట్లు భార్యను చాలా చిరాకు పెడతాయి.  ఇవి పదే పదే రిపీట్ అయితే  భార్యాభర్తల బంధం నిలబడదని, ఇద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగి విడిపోవడానికి దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంతకీ భార్యను చిరాకు పెట్టే ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. పరిస్థితిని తెలివిగా చక్కబెట్టుకోవచ్చు.  

పోలికలు ప్రధాన సమస్య..

తన భర్త తనను మరొక స్త్రీతో పోల్చినప్పుడు ఏ భార్య కూడా ఇష్టపడదు. కొన్నిసార్లు భర్త అనుకోకుండా  భార్యను పోల్చడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల భర్తలకు భార్యల నుండి   ఎదురుదెబ్బ తగులుతుంది. ముఖ్యంగా బాగా చదువుకుని ఆర్థికంగా సంపాదిస్తూ,  సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే అమ్మాయిలు భర్త తనను ఇతర అమ్మాయిలతో పోల్చడాన్ని అస్సలు రిసీవ్ చేసుకోలేదు.

పదే పదే భార్యను ఇతరులతో పోల్చడం కొనసాగిస్తే అది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. పోలికలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి,  సంబంధాలను దెబ్బతీస్తాయి. కాబట్టి వాటిని నివారించడం మంచిది.

గౌరవం లేకపోవడం..

 గౌరవం లేకపోవడం భార్యను బాధపెడుతుంది. ప్రతి స్త్రీ తన భర్త తన గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటుంది.  కానీ భర్త ఆమెను పదే పదే విస్మరిస్తే, అది ఆమెను బాధపెడుతుంది. మరీ ముఖ్యంగా నలుగురిలో ఆమెకు గౌరవం ఇవ్వకుండా చిన్నతనం చేసి మాట్లాడితే ఏ మహిళా దాన్ని పాజిటివ్ గా తీసుకోదు.

సమయం కేటాయింపు..

ఈ రోజుల్లో అందరివీ బిజీ జీవితాలు అయిపోయాయి.  కుటుంబ సభ్యులతో కూర్చుని తీరికగా నాలుగు మాటలు మాట్లాడటానికి లేదా వారితో సమయం గడపడానికి కూడా సమయం లేకుండా చేస్తాయి. అయితే భార్యాభర్తల విషయంలో ఈ కారణాలు పనికిరావు. భర్త భార్యకు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి.  ఆమెతో మాట్లాడాలి. సంతోషంగా సమయాన్ని స్పెండ్ చేయాలి.  లేకపోతే ఇది ఇద్దరి మధ్య దూరం పెంచి విడిపోవడానికి దారి తీసే అవకాశం ఉంటుంది.

అబద్దాలు చెప్పడం..

చాలామంది భర్తలు అబద్దాలు చెబుతూ భార్యలను పిచ్చివాళ్లను చేస్తుంటారు. భర్త చెప్పేది అబద్దం అని అర్థమైనా చాలా వరకు భార్యలు లైట్ తీసుకుంటారు.  కానీ ఎంతకాలం? పదే పదే అబద్ధం చెప్పే పురుషుడిని స్త్రీలు ఇష్టపడరు. అది వారి భర్త అయినా,  బయటి వాళ్లు అయినా కూడా.  అందుకే భర్త  వీలైనంత తక్కువగా మాత్రమే భార్య దగ్గర అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాలి లేదా అసలు అబద్ధం చెప్పకుండా ఉండటం మేలు.

వినే ప్రవర్తన..

ప్రతి స్త్రీ తనతో ఉండే వ్యక్తి తాను చెప్పేది వినాలని కోరుకుంటుంది.  తను చెప్పేది అతను అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. భార్య చెప్పేది వినకుండా, ఆమె భావాలను పట్టించుకోకుండా వెళ్లిపోయే వ్యక్తితో ఆమె కలిసి ఉండలేదు. కాబట్టి భార్య చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం భర్త తప్పకుండా చేయాల్సిన పని.

                                *రూపశ్రీ.

By
en-us Political News

  
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.