జీవితాన్ని నిలబెట్టే పురుషార్థాలు.. ఇందులో ఇంత అర్థముందని తెలుసా?

Publish Date:Jan 21, 2026

Advertisement


భారతదేశం చాలా వైవిధ్యభరితమైనది. భారతీయ సంప్రదాయాలలో పురుషార్థాలు చాలా ప్రధానమైనవి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పురుషార్థాలు అని అంటారు. ఈ  నాలుగింటిని అవలంభించడం వల్ల ప్రతి వ్యక్తి ఒత్తిడి నుండి విముక్తి అవుతాడని చెబుతారు. కానీ నేటి ఆధునిక కాలంలో వీటిని అటకెక్కించారు. ఈ నాలుగింటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఇవి వ్యక్తి జీవితంలో ఎంత ముఖ్యమైనవో తెలిసిపోతుంది. వీటి గురించి తెలుసుకుంటే..

ధర్మం..

జీవితంలో కొన్నిసార్లు మనం పారిపోతున్నట్లు అనిపిస్తుంది.  కానీ ఎందుకు అనే విషయం అర్థం కాదు.  ధర్మం అంటే ప్రతి వ్యక్తి తన నిజమైన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడం. ప్రపంచానికి ఒక వ్యక్తి నుండి కావలసింది ఇదే.

ప్రతి వ్యక్తి తనలోకి తాను చూసుకోవాలి. అంటే.. ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఏది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది? రోజువారీ చిన్న చిన్న పనులలో నిజాయితీని పాటించినప్పుడు లభించే సంతృప్తి చాలా గొప్పది.  ఒక్కసారి దీన్ని అనుభవించినప్పుడు ఇక దాన్నుండి పక్కకు పోవాలన్నా పోలేరు.

అర్థం..

డబ్బు లేకుండా జీవితం కష్టమవుతుంది. అర్థ అంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని,  సమాజాన్ని ఆదుకునే శ్రేయస్సు. కానీ డబ్బును సంపాదించడమే అర్థం అనే విషయానికి నిజమైన వివరణ అనుకుంటారు చాలా మంది.  ఈ కారణంగానే జీవితంలో డబ్బు కోసం చాలా పోరాటం చేస్తారు. దానిని ధర్మంతో సమతుల్యం చేసుకోవాలి.

ప్రతి వ్యక్తి తన అవసరాను గుర్తించాలి, తెలివిగా ప్లాన్ చేసుకోవాలి.  కానీ అత్యాశతో ఉండకూడదు.  ఉన్నదాంటో తృప్తి పడటం నేర్చుకోవాలి.

కామ..

కామ అంటే కోరికలు.  ప్రేమ,  ఇంద్రియ సుఖాలు. కోరికలను అణచివేయవద్దని, వాటిని సరైన మార్గంలో నెరవేర్చుకోవాలని అర్థం.  కానీ ధర్మార్థాల  విషయంలో రాజీ పడకూడదు. కామం అంటే కేవలం ఇంద్రియాల గురించే కాదు.. కామం అంటే కోరిక, పని.. ఇందులో చాలా ఉంటాయి.  నేటి కాలంలో కామం అనగానే ఒక బూతు అనుకుంటారు. అది తప్పు.

ప్రతి రోజూ ఒక చిన్న ఆనందం అయినా ఉండేలా చూసుకోవాలి.  ఎవరితోనైనా మాట్లాడాలి. ప్రకృతితో సమయం గడపాలి. కోరికలను బయటకు చెప్పడం కాదు.. బాలెన్సింగ్ గా ఉంచుకోవాలి.

మోక్షం..

మోక్షం  అంటే విముక్తి. అన్ని ఒత్తిడి, భయం,  బంధనాల నుండి విముక్తి. ఒక వ్యక్తి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ధర్మం, అర్థ,  కామాలు సమతుల్యంగా ఉన్నప్పుడు, మోక్షం సహజంగా వస్తుందని చెబుతారు.

మోక్షం వైపు అడుగులు వేయాలంటే ధ్యానం చేయాలి. యోగా చేయాలి, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి.  వర్తమానంలో జీవించాలి.

                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.