కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే చోరీ.. తెలంగాణలో భద్రత జాడేదీ!

Publish Date:Jun 11, 2022

Advertisement

తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఉన్నాయనడానికి తాజా తార్కానం  బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనంలో చోరీ.  హైదరాబాద్ లోని అణువణువుపై నిఘా,  ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా క్షణాల్లో పసిగట్టే అత్యాధునిక పరిజ్ణానంతో  కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణం జరుగుతోంది. అలాంటి భవనంలోనే చోరీ జరగడం, దీనిపై ఈ ప్రజెక్టు మేనేజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాష్ట్రంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు బయటపడింది.  

శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే తెలంగాణ ఆదర్శం అంటూ తన భుజాలను తానే తడుముకుంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమయం దొరికినా దొరకకపోయినా రాష్ట్ర పోలిసింగ్ గొప్పతనాన్ని ఘనంగా చాటుకుంటూ ఉంటారు. తెలంగాణలో అందునా  హైదరాబాద్ లో పోలీసులు స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులకే ఆదర్శంగా నిలుస్తుంటారని గొప్పలు కూడా చెప్పేసుకుంటూ ఉంటారు. అంతటితో ఊరుకోకుండా తెలంగాణ పోలిసింగ్ గొప్పతనాన్ని చాటుకుంటూ జాతీయ స్థాయి పత్రికలు, ఛానెళ్లలో కోట్ల రూపాయల వ్యయంతో ప్రకటనలు కూడా జారీ చేశారు.  

‘తెలంగాణా రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ  అత్యంత అమోఘంగా ఉంది. గడచిన ఆరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ కూడా  శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు. ఆయా  భాగస్వామ్య పక్ష్యాల సమన్వయంతో రాష్ట్రంలో ఎక్కడ కూడా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూడటంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా సఫలమయ్యారు. దానికి అవసరమైన రీతిలో క్రియాశీలక చొరవ ప్రదర్శించారు.  ప్రజల రక్షణ, శాంతి భద్రతలు కాపాడే విషయంలో రాష్ట్ర పోలీస్ విభాగం కమ్యూనిటీ పోలీసింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. హైదరాబాద్ తో పాటుగా  రాష్ట్రంలోని అనేక ప్రధాన నగరాలు, పట్టణాలలో లక్షలాది సి.సి.టి.వి. కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతోమంది నేరస్తులను అరెస్ట్ చేయడానికి వీలైంది.

నేరానికి పాల్పడితే కటకటాలు తప్పవనే సందేశం నేరస్తులకు వెళ్ళేలా చేయడానికి ఇది చాలా ఉపయోగపడింది.  టి.ఎస్. కాప్, హాక్ ఐ, సైబర్ క్రైం డిటెక్షన్ టూల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక అప్లికేషన్లను వినియోగించుకుంటూ, బాధితులకు సత్వర న్యాయం అందించే ప్రయత్నాలు కూడా ఎంతగానో సఫలీకృతమయ్యాయి.’ అన్నది ఆ ప్రకటన సారాశం. 

అయితే ఈ భుజకీర్తులన్నీ.. సొంత డబ్బా కొట్టుకోవడానికేననీ, వాస్తవంలో హైదరాబాద్ లో భద్రత డొల్ల అనీ తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ ఘటన మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించేసింది.  హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు  వాటి అనుసంధానం 24x7 నిఘా వంటి మాటలూ, ప్రకటనలూ ఇవన్నీ కోటలు దాటిన మాటలేననీ, ఆచరణ గడప కూడా దాటలేదనీ నిరూపించే స్థాయిలో నేరాలు, ఘోరాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని, నేరస్తుల అనుపానులు క్షణాల్లో కనుగొని వారిని అరెస్టు చేయడానికీ, అసలు నేరం జరగక ముందే నిరోధించడానికి అవసరమైన అత్యాధునిక పరిజ్ణానంతో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న  కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో శుక్రవారం(నిన్న) రాత్రి 38 బండిల్స్ కాపర్ వైర్ చోరీ సంఘటన మరోసారి సందేహానికి తావు లేని రుజువుగా నిలిచింది.

నగర వ్యాప్తంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో తెలుసుకుని అక్కడ పోలీసులు వాలిపోయేందుకు అనువు అయిన పరిజ్ణానంతో ఏర్పాటు అవుతున్న భవనానికే దొంగలు కన్నం వేసి చోరీ చేసి దర్జాగా జారుకోగలిగారంటే పోలీసులు ఇక నగరం మొత్తంలో నేరాలను  కంట్రోల్ చేస్తామంటే నమ్మేదెలా? అని సామాన్య జనం సైతం ఇప్పుడు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అయినా రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు ఎంత ఘనంగా  ఉన్నాయో చెప్పడానికి గత వారం రోజులుగా నగరంలో జరిగిన వరుస సామూహిక అత్యాచార ఘటనలే చాలు.

అలాగే  జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ రేపు కేసులో నిందితులను రక్షించడానికి పోలీసులు పడిన తాపత్రేయం వారు ఎందు కోసం ఎవరి కోసం పని చేస్తున్నారో తేటతెల్లం చేసేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నేరాలను అరికట్టడంలో ఎంత ‘అప్రమత్త’తతో ఉందో లోకానికి తెలియజేసేసింది.   ఒక వైపు తెలంగాణ సర్కార్ దేశంలోనే శాంతి భద్రతల విషయంలో తెలంగాణ సేఫెస్ట్ ఫేస్ అని చెప్పుకుంటుంటే.. వరుసగా జరుగుతున్న సంఘటనలు మాత్రం బాలికలకు, మహిళలకు మోస్ట్ అన్ సేఫ్ సిటీ హైదరాబాదే అని నిరూపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.