సంబంధాలు బలంగా ఉండాలంటే ఇది తప్పనిసరిగా పాటించాలి!

Publish Date:Jul 8, 2026

Advertisement

ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు,  గొడవలు, అతిగా స్పందించడం, జోక్యం చేసుకోవడం వంటివి కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. వీటి వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతుంది. అయితే నేటికాలంలో బంధాలు బలంగా ఉండాలంటే మైక్రో ప్రైవసీ పాటించాలట. ఇంతకీ మైక్రో ప్రైవసీ అంటే ఏంటి? ఇది బంధాలను బలంగా ఉంచడంలో ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే..

మైక్రోప్రైవసీ..

మైక్రో-ప్రైవసీ అనేది నేటికాలంలో సంబంధాల గురించి జాగ్రత్త చేసే ఒక మార్గం. సంబంధంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరమని ఇది చెబుతుంది. ఈ స్పేస్  వ్యక్తికి మానసిక స్వేచ్ఛను అందిస్తుంది , సంబంధం భారంగా మారకుండా నివారిస్తుంది.

ప్రేమ అంటే ప్రతీదాన్నీ నియంత్రించడం కాదని, ఒకరి హద్దులను మరొకరు గౌరవించుకోవడం కూడా అని మైక్రో ప్రైవసీ నొక్కి చెబుతుంది. మైక్రో-ప్రైవసీ సంబంధాలలో ఒక బాలెన్స్ ను క్రియేట్ చేస్తుంది.  దీనివల్ల ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా ఎవరి ఐడెంటిటీ వారికి ఉంటుంది.

మైక్రో ప్రైవసీలో అసలు అర్థం..

మైక్రోప్రైవసీలో ఉండే  ముఖ్యమైన అంశం  భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని  పర్సనల్ ఫీలింగ్స్ ను, పర్సనల్  సమయాన్ని గౌరవించడం. ఎప్పుడూ వారితో టచ్‌లో ఉండటం లేదా ప్రతి కదలికను గమనించడం అనేది  సంబంధాలను బలహీనపరుస్తుంది. దానికి బదులుగా, ఒకరికొకరు కొంత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ, ఒత్తిడి లేకుండా సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. అతిగా డిపెండ్ అవడాన్ని, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ను నియంత్రణలో ఉంచడంలో కూడా మైక్రో ప్రైవసీ సహాయపడుతుంది.

మైక్రో ప్రైవసీ ఎందుకు అవసరం..

మైక్రో ప్రైవసీ  సంబంధాలలో నమ్మకాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరికి  వారి స్వంత సమయం, స్పేస్  ఉన్నప్పుడు, వారు మానసికంగా మరింత ప్రశాంతంగా, బాలెన్స్డ్ గా  ఉంటారు. ఇది సంబంధాలలో అనవసరమైన ఒత్తిడిని తగ్గించి ఎక్కువ కాలం బంధాలు పదిలంగా ఉండేలా చేస్తుంది. మైక్రో ప్రైవసీ పాటించే వ్యక్తులు తమ ఐడెంటిటీని కూడా కోల్పోకుండా ఉంటారు.  ఒకరి ముందు ఒకరు తక్కువ కాదు అనేలా బందాలు ఉంటే.. ఆ బంధాలు ఎన్నేళ్ళైనా పదిలంగా ఉంటాయి.

ఇలా  చేయాలి..

భార్యాభర్తలలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఒంటరిగా సమయం గడపాలని, అభిరుచులను కొనసాగించాలని, లేదా స్నేహితులతో సమయం గడపాలని కోరుకున్నప్పుడు, వారికి అంతరాయం కలిగించకుండా లేదా ప్రశ్నించకుండా వారి ఇష్టాలను గౌరవించడం, వారి అభిరుచులను కొనసాగించడంలో మద్దతు ఇవ్వడం వంటివి మైక్రో ప్రైవసీకి చక్కని ఉదాహరణ.  ఇది ఈ రోజు కొత్తగా  చెప్పాల్సిన విషయమేమీ కాదు.. కానీ కొందరికి అర్థం కావాలంటే కొన్ని ప్రత్యేక మార్గాలలో చెప్పాలి. అందుకే దీన్ని మైక్రో ప్రైవసీ అంటున్నారు.  ఈ మార్గాన్ని పాటిస్తే బంధాలు పదిలంగా ఉంటాయి.

                                 *రూపశ్రీ.

By
en-us Political News

  
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.