మోడీ నాయకత్వంలో భవిష్యత్‌ వైపు దేశం పరుగులు!

Publish Date:Apr 20, 2026

Advertisement

 

భారత రాజకీయ యవనికపై నరేంద్ర మోదీ ప్రస్థానం ఒక విశిష్ట అధ్యాయం. సాధారణంగా రాజకీయ నాయకులు అనగానే తక్షణ ఓటు బ్యాంకు రాజకీయాలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు ఓటములు, దైనందిన వార్తల్లో ఎలా నిలవాలి అనే అంశాలపైనే  ఆలోచిస్తుంటారు. అయితే మోదీ శైలి వీటికి భిన్నంగా ఉంటుంది.  ఆయన కేవలం వచ్చే ఐదేళ్ల పదవీ కాలం గురించి కాకుండా, రాబోయే ఐదు దశాబ్దాల పాటు భారతదేశం ప్రపంచ పటంలో ఎలా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ప్రధాని మోదీ రాజకీయ చదరంగంలో ఎప్పుడూ ప్రత్యర్థుల కంటే పది అడుగులు ముందే ఉంటారు. ఆయన నాయకత్వంలో రెండు ప్రధాన కోణాలు కనిపిస్తాయి. ఒకటి  ప్రాక్టివ్  నాయకత్వం, అంటే దేశానికి అవసరమైన కఠినమైన సంస్కరణలను ముందుగానే ఊహించి అమలు చేయడం. రెండవది  రియాక్టివ్  అవగాహన.  అంటే ప్రత్యర్థుల ఎత్తుగడలను నిశితంగా గమనిస్తూ, వారు వేసే అడుగులను ముందే పసిగట్టి సమర్థవంతమైన ప్రతివ్యూహాలను సిద్ధం చేయడం. ఈ అరుదైన వ్యూహరచనే ఆయనను సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా నిలబెడుతోంది.

గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన  కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి,  చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల కల్పన , తయారీ రంగం బలోపేతం వంటి అంశాలపై మోదీ ప్ర  ప్రత్యేక దృష్టి సారించారు.

 విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ విజయవంతం కావడానికి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వ విధానాలే కారణమని ఆర్థిక వేత్తలు అంటున్నారు. కేవలం తక్షణ ఉపశమనం కలిగించే పథకాల కంటే, దేశ భవిష్యత్తును మార్చే పునాదులపైనే ఆయన ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు.

సహజంగానే ఏ నాయకత్వానికైనా విమర్శలు అనివార్యం మోడీ వ్యతిరేకులు తరచూ ఆర్థిక విధానాలు, అంతర్గత రాజకీయాలు లేదా విదేశాంగ విధానంపై విరుచుకుపడుతుంటారు. అయితే, ఈ విమర్శలు చాలావరకు తాత్కాలిక సమస్యల చుట్టూ తిరుగుతుంటాయని, మోదీ మాత్రం శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వేస్తారని ఆయన మద్దతుదారులు వాదిస్తారు. విమర్శకులు ఈ రోజు గురించి ఆలోచిస్తే, మోదీ రేపటి భారతాన్ని నిర్మిస్తున్నారని వారి వాదన. భారతదేశం ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక ప్రభావమంతమైన శక్తిగా ఎదుగుతోంది. జియోపాలిటికల్ గా భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

రాబోయే కాలంలో భారత్ ను ఒక సురక్షితమైన, ఆర్థికంగా తిరుగులేని దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతుందని అంచనా. ఈ ప్రయాణం చివరకు భారతదేశాన్ని ‘విశ్వగురు’ స్థానంలో నిలబెడుతుందని విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.ముగింపుగా చూస్తే, మోదీ నాయకత్వాన్ని కేవలం ఎన్నికల గెలుపోటముల కోణంలో చూడలేం. అనుకూల వర్గం ఆయనను ఒక దార్శనికుడిగా కొనియాడుతుంటే, విమర్శకులు భిన్నంగా స్పందిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ, మోదీ తీసుకునే ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక బలమైన పునాది అని ఆయన అనుచరులు బలంగా నమ్ముతున్నారు. ఆయన రాజకీయాలు కేవలం ఈనాటి వార్తల కోసం కాదు, రాబోయే తరాల శ్రేయస్సు కోసం ఉద్దేశించినవని స్పష్టమవుతోంది.

-సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.