మోడీ హయాంలో పార్లమెంటు.. ది హౌస్ ఈజ్ ఎడ్జోర్డ్న్

Publish Date:May 9, 2023

Advertisement

కర్నాటక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తారన్నది ..ఎవరిని గెలిపిస్తారన్నది 13న ఫలితాలతో తేలనుంది.  గత మూడేళ్లుగా అవినీతిలో కూరుకుని పోయిన బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోమారు అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సోషల్‌ విూడియా ప్రచారాలను బీజేపీ ఉధృతం చేస్తోంది. దేశంలో వెూడీని అవతారపురుషుడిగా కీర్తిస్తూ..గత పాలకులందరినీ పాపులుగా చిత్రీకరిస్తూ.. బిజెపి సోషల్‌ విూడియా కోడై కూస్తోంది. సోషల్‌ విూడియాలో నిత్యం ప్రధాని నరేంద్ర వెూడీ గురించి గొప్పలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఆయన తుమ్మినా దగ్గినా అదో విజయంగా ప్రచారం సాగుతోంది.

ఆయన అనేక విజయాలు సాధించినట్లు చెబుతున్నారు. వెూడీ వచ్చిన తరవాత దేశం దశదిశ మారిందన్న ప్రచారం విపరీతంగా ఉంటోంది. అలాగే ఆయన మాత్రమే ఈ దేశాన్ని ఉద్దరించాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. భారత్‌ కోసం పుట్టిన వరపుత్రుడని ప్రచారం చేస్తున్నారు. ఏ దేశం వెళ్లినా..ఏ దేశాధినేతతో మాట్లాడినా.. ఏదైనా శంకుస్థాపన చేసినా..ఏ ప్రారంభోత్సవం చేసినా ఆహా ఓహో అంటూ పుంఖానుపుఖాలుగా ప్రచారాలు వస్తున్నాయి. కర్నాటకలో ఇది మరింత శృతి మించింది. నిజానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. గడిచిన 9 ఏళ్లలో  ఏటా సగటున రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఫలితంగా 68 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తీసుకొన్న అప్పుల కన్నా 9 ఏండ్ల వెూడీ  పాలనలో తీసుకొన్న అప్పులే ఎక్కువయ్యాయి. ఎడాపెడా అప్పులు చేసిన ఘనత నరేంద్ర వెూడీదేనన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి.

మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌పై పన్నులు, సెస్సుల రూపంలో ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఎంతసేపు ఆదానీ అంబానీలకు దోచిపెట్టడం, వారిని మరింత సంపన్నులగా తీర్చిదిద్దే పనులు చేపట్టడం మినహా చేస్తున్న ఘనకార్యాలు ఏవీ లేవు. దేశవ్యాప్తంగా బుల్లెట్‌ టైన్‌ ప్రాజెక్టు సహా 18 మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.5 లక్షల కోట్ల అంచనా ఖర్చుతో పునాదిరాళ్లు తమ పేర్లతో వేసుకొన్నారు. వాటికి పెట్టుకొన్న గడువు కూడా తీరిపోయింది. ఒక్క తట్టెడు మట్టి తీసిన పని కూడా జరగ లేదు. రూ.80 లక్షల కోట్ల అప్పుల సంగతి దేవుడెరుగు.. ఏటా రూ.3 లక్షల కోట్లు పెట్రో బాదుడుతోనే వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఏమయ్యాయంటే.. రాష్టాలు వ్యాట్‌ తగ్గించాలని సుద్దులు చెబుతారు. దారుణం గా అప్పులు చేస్తున్న తీరు ఒక వైపు అయితే... జిఎస్టీ పేరుతో  చేస్తున్న బాదుడు   మరోవైపు. అయినా మోడీ హయాంలో  సామాన్యలకు ఉపశమనం కలిగించే పని ఒక్కటంటే ఒక్కటి కూడా చేయడం లేదంటే అతిశయోక్తి కాదు.

ఇలా వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారని అడిగితే.. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను తీర్చేస్తున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో పుంఖానుపుంఖాలుగా ప్రాచరం చేస్తున్నారు. సోషల్‌ విూడియా ప్రచారంలో బిజెపి నేతలు ఆరితేరారు. వెూదీ ప్రభుత్వం చేసిన 80 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఘనకార్యా లేంటో బీజేపీ నేతలు చెప్పగలరా అంటే సమాధానం రాదు. ఇంతకీ ఆ వసూళ్లతో, ఆ అప్పులతో ప్రభుత్వం చేసిన మంచి పని ఏమిటంటే.. యిదీ అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క మంచి పని కనిపించదు.   బ్రహ్మాండంగా దేశాన్ని నడిపిస్తున్నామని చెప్పుకుంటారు కానీ ప్రభుత్వం సాధించిన ఘనతలేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం ఉండదు.

ప్రజాసమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం ముందుకు రాదు.  రైతుల కోసం అంటూ ప్రవేశ పెట్టిన సాగు చట్టాలపై నా పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం ముందుకు రాలేదు.  పార్లమెంటు సమావేశాలు వాయిదాపడటానికే అని సామాన్యులు ఒక నిర్ణయానికి వచ్చేసిన పరిస్థితి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి రైతలను వంచించినా చర్చించరు. జిఎస్టీ పేరుతో పన్నులు బాదుడుపైనా చర్చించరు. నిజానికి వెూడీ అధికారంలోకి వచ్చాక పార్లమెంటులో చర్చ అన్నది పక్కకు పోయింది. ఏ అంశమైనా సోషల్‌ విూడియా ప్రచారం తప్ప చట్ట సభల్లో చర్చకు కేంద్రం అవకాశం యివ్వడం లేదన్నది వాస్తవం. లక్షన్నర కోట్లకు పైగా జిఎస్టీ వసూళ్లు అవెూఘం అంటున్నారు.  

చివరకు మనం పైసా పైసా కూడబెట్టుకుని చెమటోడ్చి సంపాదించిన డబ్బులతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌, జీవిత బీమా చేయించుకున్నా..జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు. దీనిపై చర్చించడం లేదు. ఇకపోతే సామాన్యుల సొంతింటి కల నెరవేరడం లేదు. నిర్మాణరంగం కుదేలయ్యింది. వ్యవసాయరంగం కుదేలయ్యింది. ఆర్థికరంగం అంతకుమించి కుదేలయ్యింది. అయినా అదీ చర్చించరు. ఉద్యోగ ఉపాధి రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిపైనా సోషల్‌ విూడయాలో ప్రచారం జరగదు. ఎడాపెడా పెట్రో ధరలు పెంచుతూ పోతున్నా.. దాని వల్ల కలుగుతున్న విపరిణామాలను చర్చించరు. గ్యాస్‌ ధరలు సామాన్యులకు భారంగా మారినా చర్చ చేయరు. అభూత కల్పనలను జోడించి చేస్తున్న చర్చల వల్ల బిజెపిని, వెూడీ అతిగా చూపిస్తూ భారత్‌ బ్రహ్మాండం అంటూ చూపుతున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు. తిండిపెట్టి, దేశయువతకు ఉద్యోగ,ఉపాధి కల్పించి, రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా వ్యవసాయాన్ని చేసే ఆలోచన ఏదీ వెూడీ బృందానికి లేదు. ప్రస్తుతం పెంచిన పన్నులతో వచ్చిన డబ్బును గత పాలకులు చేసిన అపðలు తీర్చేందుకు వాడుతున్నా మంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నది.

ఈ నకిలీ వార్తలను దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరేలా బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ప్రధానిగా నరేంద్రవెూదీ 2014లో అధికారంలోకి రాకముందు కేంద్రం చేసిన మొత్తం అపð రూ.55.87 లక్షల కోట్లు. ఈ లెక్కన ప్రతి నెల వెూదీ ప్రభుత్వం తీసుకొన్న సగటు రుణం రూ.83,341 కోట్లు. 2014లో కేంద్రానికి వచ్చిన ఆదాయంలో పెట్రోల్‌, డీజిల్‌పై వచ్చిన పన్నుల వాటా 5.4 శాతంగా ఉండగా, 2020-21 నాటికి అది 12.2 శాతానికి పెరింగింది. నేడు ఒక్క వంటగ్యాస్‌ సిలిండర్‌కు పెడుతున్న ఖర్చుతో వెూదీ మొదటిసారి ప్రధాని అయినపðడు రెండు సిలిండర్లు వచ్చేవి. చమురు ధరల పెంపుతో కేంద్రం ఏటా రూ.3 లక్షల కోట్లను ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా..పట్టించుకోద్దన్న సూత్రాన్ని అవలంబిస్తున్నారు. ఎదురుదాడి చేస్తున్నారు. రాష్టాల్లో అభివృద్ది అంతా తమ చలువేనని చాటుకుంటున్నారు. సిగ్గూఎగ్గూ లేకుండా ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. దీనికి చరమగీతం పాడకుంటే నష్టపోయేది ప్రజలే. ప్రజలు దీనిని నిరసించాలి. ఎక్కడిక్కడ నిలదీయాలి. సోషల్‌ విూడియా విష ప్రచారాలను పసిగట్టాలి. ఎక్కడి కక్కడే ఎదురుదాడి ప్రారంభించాలి. తిప్పికొట్టాలి. అప్పుడే ప్రజలు విజయం సాధిస్తారు.

By
en-us Political News

  
మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
కూటమి రెండేళ్ల పాలనపై ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు.
గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది.
రాజకీయ ముసుగు వేసుకుని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వికృత ధోరణిని తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే ముందు, తమ ఇళ్లలో కూడా మహిళలు, తల్లులు, చెల్లెళ్లు ఉన్నారనే కనీస విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.
నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది.
తన రాజీనామాను ఆయన శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను స్వయంగా కలిసి అందజేశారు. ఆ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు.
ఢిల్లీలో ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ షిండే అధికారిక నివాసంలో రహస్యంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమావేశంలో విలీన వ్యూహాన్ని ఖరారు చేసుకున్న అనంతరం.. వీరంతా కలిసి, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ వర్తమాన రాజకీయ పరిణామాలపై లోతైన విశ్లేషణను అందిస్తూ సాగిన వాస్తవ వేదిక చర్చా..
ఆంధ్రప్రదేశ్ ఖనిజ మరియు గనుల సంపదకు సంబంధించిన తాజా రాజకీయ, ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తూ, మీ రిక్వెస్ట్ మేరకు రూపొందించిన ప్రత్యేక వ్యాసం కింద ఇవ్వబడింది.
మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచి, మొత్తం 815 స్థానాలకు చేర్చాలనేది ప్రాథమిక ప్రతిపాదన. అయితే.. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది.
మెట్రో ఫేజ్ 1 టేకోవర్.. దానికి సంబంధించిన రీఫైనాన్సింగ్ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మెట్రో మొదటి దశను నిర్వహించిన ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాల కారణంగా ఫేజ్ 2 విస్తరణకు ముందుకు రాకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను తన అధీనంలోకి తీసుకుంది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.