దిగ్విజయంగా స్కాట్లాండ్ (UK) లో ప్రప్రథమ తెలుగు అష్టావధానం

Publish Date:Jul 10, 2023

Advertisement

 

ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK) లోని ఎడింబరో లో అంగరంగ వైభవంగా మొట్టమొదటి అష్టావధానం శ్రీ ప్రణవ పీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే నిన్న శ్రీ విజయ్ కుమార్ రాజు పర్రి గారు నిర్వహించారు.  

తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎడింబరో హిందు మందిర్ వేదికయ్యింది. వందలాది తెలుగు ప్రజలు పొరుగు నగరాల నుండి కూడా ఏడింబరో విచ్చేసి ఆసక్తిగా తిలకించడం విశేషం. 

త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ గారు, నిర్వాహకులు విజయ్ కుమార్ రాజు పర్రి గారు, స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి గారు కార్యక్రమాన్ని జ్యొతి ప్రజవల చేసి ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి పృచ్ఛకులుగా తెలుగు భాషను అమితంగా ప్రేమిచే వారు కావడం వలన 12 మంది దివ్యమైన సూర్యులతో ప్రకాశిస్తూ సాగిందీ కార్యక్రమం. 

సమస్యాపూరణం - శ్రీ నాగ ప్రసాద్ మంగళంపల్లి గారు 

దత్తపది - శ్రీ రంజిత్ నాగుబండి గారు

వర్ణన - శ్రీమతి సాయికుమారి దొడ్డ గారు

నిషిద్ధాక్షరి - శ్రీమతి శైలజ గంటి గారు

న్యస్తాక్షరి - శ్రీమతి హిమబిందు జయంతి గారు

ఆశువు - శ్రీ అనంత రామానంద్ గార్లపాటి గారు, శ్రీమతి మమత వుసికల గారు

పురాణ పఠనం - శ్రీ విజయ్ కుమార్ రాజు పర్రి గారు, శ్రీ మిథిలేష్ వద్దిపర్తి గారు, శ్రీ పండరి జైన్ కుమార్ పోలిశెట్టి గారు

అప్రస్తుత ప్రసంగం - శ్రీ సత్యశ్యాం కుమార్ జయంతి గారు, శ్రీ నిరంజన్ నూక గారు 

ఆద్యంతం రసవత్తరముగా సాగిన ఈ కార్యక్రమమునకు విమర్శనాత్మక విశ్లేషణ శ్రీ అయ్యగారి ప్రసాద్ గారు చేశారు. 

కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్ గార్లని నిర్వాహకులు విజయ్ గారు మరియు పృచ్ఛకులు పట్టు శాలువాతో, సన్మాన పత్రంతో, పట్టు బట్టలతో, పూలు పండ్లతో సత్కరించారు. 

ఆద్యంతం రసవత్తరముగా సాగిన ఈ చివరగా నిర్వాహకులు విజయ్ గారు అవధాని గారికి, పృచ్ఛకులకు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలుపగా, వేడుకను మంగళహారతితో ముగించారు. 

సాయంత్రం 'శ్రీ కృష్ణ లీలలు అంశం మీద భక్తి ప్రవచనాలు కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది.  

కార్యక్రమాలను క్రింది లింక్స్‌ని క్లిక్ చేసి వీక్షించండి. 

Ashtavadhanam: https://fb.watch/lGbwVREE9j 

Pravachanalu: https://fb.watch/lGCnvIaqFg

By
en-us Political News

  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.