టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేత వల్లభనేనివంశీ అరెస్ట్ కు రంగం సిద్దం
Publish Date:Jul 11, 2024
Advertisement
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని నిందితుడిగా చేర్చారు. ఏ-71 నిందితుడిగా పేర్కొంటూ ఆయనపై కేసు నమోదుచేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల దాడి కేసులో పోలీసులు రిమాండ్ రికార్డు తప్పుల తడకగా ఉంది. ఈ కేసులో పరారీలో ఉన్న 71 నిందితుల్లో 15 మందిని మంగళవారం (జులై 9న) అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన మూల్పూరి ప్రభుకాంత్, ఎర్రగుళ్ల నాగేష్ సహా 15 మందిని రిమాండ్ నిమిత్తం గన్నవరం 12వ అదనపు న్యాయస్థానంలో బుధవారం ప్రవేశపెట్టారు. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి ఎఫ్ఐఆర్లో ఒక పేరు, మరోచోట ఇంకొ పేరును సగం పేరును నమోదు చేశారు. ఊరి పేర్లు తప్పులు ఉన్నట్లు న్యాయమూర్తి గుర్తించారు. నివేదికలోని తప్పులు సవరించిన తర్వాతే నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు సూచించారు. దీంతో బుధవారం రాత్రి 10 గంటలకు తప్పులు సరిచేసిన అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజులు పాటు రిమాండ్ విధించారు.
http://www.teluguone.com/news/content/the-field-is-ready-for-the-arrest-of-ycp-leader-vallabhanenivamshi-25-180519.html





