ఎవరి జీవితమూ వృథా కాదు

Publish Date:Oct 28, 2020

Advertisement

 

అది ఒక కొండ మీద ఉన్న గ్రామం. ఆ గ్రామంలో నీరు కరువుగా ఉండేది. గ్రామంలో ఉన్న పేదలు కాస్తోకూస్తో ఉన్న నీటితో సరిపెట్టుకుంటుంటే, ధనికులు మాత్రం కొండ దిగువన ఉన్న చెరువు నుంచి నీటిని కావడితో తెప్పించుకునేవారు. అలా ఓ పెద్దాయన తన యజమాని కోసం రోజూ కావడితో నీటిని మోసుకు వెళ్లేవాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా...  ఒకరోజు కావడిలో ఉన్న రెండు కుండలలో ఒకదానికి పగులు వచ్చింది. కానీ దాన్ని పెద్దాయన అవతలికి పడేయకుండా, ఎప్పటిలాగా దానిలో నీటిని నింపి కొండమీదకు తీసుకువెళ్లసాగాడు. రోజూ ఆ కుండ నిండా నీటిని నింపడం, కొండ మీద ఉన్న యజమాని ఇంటికి చేరుకునేసరికి దానిలో ఉన్న సగం నీరు వృథాగా నేలపాలవడం జరుగుతూనే ఉండేది.

 

‘నీ వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ!’ అని ఒక రోజు పగులు ఉన్న కుండని ఆడిపోసుకుంది మంచి కుండ. దానికి ఏం సమాధానం చెప్పాలో పగిలిన కుండకి అర్థం కాలేదు. ‘నిజంగానే తనకి ఉన్న పగులు వల్ల ఆ పెద్దాయన శ్రమంతా వృధా అయిపోతోంది కదా’ అనుకుంది. ఆ రోజు మొదలు- మంచి కుండ, పగులు ఉన్న కుండని రోజూ దెప్పిపొడవడం.. పగులు ఉన్న కుండ మారుమాట్లాడలేక దిగాలుగా ఉండిపోవడం జరుగుతూనే వస్తోంది.

 

‘నన్ను అవతల పడేయండి. నా వల్ల మీ శ్రమంతా వృథా అయిపోతోంది. యజమానికి తగినంత నీరుని కూడా ఇవ్వలేకపోతున్నారు,’ అంటూ తనని మోస్తున్న పెద్దాయనతో ఒక రోజు మొరపెట్టుకొంది పగులు ఉన్న కుండ. కుండ నేరుగా తనతో మాట్లాడటం చూసి పెద్దాయన ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అటు మీదట చిరునవ్వుతో... ‘నిన్ను అవతల పడేయటం మాట అటుంచు. ముందు నీ దిగులుని పోగొట్టే ఉపాయం ఒకటి చెబుతా విను. ఇవాళ కొండ మీదకి ఎక్కే దారిలో అటూఇటూ విరగబూసిన పూలను కాస్త గమనించు. వాటి అందం చూసి నీ మనసులో ఉన్న ఆందోళన అంతా మాయమైపోవడం ఖాయం!’ అన్నాడు.

 

పగులు ఉన్న కుండ ఆ రోజు నిజంగానే దారికి ఇరువైపులా ఉన్నా పూలబాటను గమనించింది. నిజంగానే ఆ అందమైన రంగురంగుల పూలని చూసి దాని మనసులో దిగులు మాయమైంది. సాయంత్రం కాగానే పెద్దాయన పగిలిన కుండతో- ‘నేను చెప్పినట్లుగా దారిలో ఉన్న పూల చెట్లను గమనించావా?’ అని అడిగాడు. దానికి పగిలిన కుండ - ‘ఓ! గమనించాను. కానీ నా సంగతేంటి? మీరు నన్ను ఎప్పుడు అవతల పడేస్తున్నారు?’ అని అడిగింది.

 

‘నిన్ను అవతల పడేసే ప్రశ్నే లేదు! ఎందుకంటే ఆ దారిలో ఉన్న పూలచెట్లన్నీ నీ చలవే. కాస్త కాస్తగా నీ నుంచి జారే నీటితో ఆ దారంతా అందమైన పూల మొక్కలు పెరిగాయి. అవి ఇప్పుడు ఆ బాటన పోయే ప్రతివారికీ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మరి ముందు ముందు కూడా ఆ మొక్కలకి నీళ్లు అవసరం కదా! నిన్నెలా వదులుకోగలను. పొద్దుగూకులా కష్టపడే నా మనసుకి తృప్తిని అందించేంది ఆ పూల మొక్కలే సుమా!’ అంటూ చెప్పుకొచ్చాడు పెద్దాయన. ఆ మాటలకి పగిలిన కుండ మనసులో ఉన్న కాస్తో కూస్తో దిగులు కాస్తా ఆవిరైపోయింది. ప్రపంచంలో ఎవరి జీవితమూ నిరుపయోగం కాదనీ, తమ లోటుపాట్లను గుర్తించినట్లే సామర్థ్యాలను కూడా గుర్తుంచుకోవాలనీ తెలిసివచ్చింది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

..Nirjara

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.