పెళ్లైన మరుసటి రోజే నవవధువు ప్రసవం..వరుడికి ఊహించని షాక్.!

Publish Date:Nov 22, 2026

Advertisement

పెళ్లంటే ఎన్నో ఆశలు.. కొత్త జీవితంపై మరెన్నో కలలు. నిన్నటి వరకు అపరిచితులుగా ఉన్న ఇద్దరు.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. కానీ ఆ వరుడి జీవితంలో పెళ్లయిన మరుసటి రోజే ఊహించని విషాదం చోటుచేసుకుంది. చేతిలో చేయి వేసుకుని ఏడడుగులు నడిచిన ఆ నవదంపతుల జీవితంలోకి ఓ పసికందు రాకతో పెను కలకలం రేగింది. 

అయితే ఆ పసికందు అప్పటికే విగతజీవిగా జన్మించడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన వెనుక ఉన్న పరిణామాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాలయంకోట్టై సమీపంలోని అరియకుళం ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడికి, తాళయూత్తు ప్రాంతానికి చెందిన  ఓ యువతితో ఇటీవల వివాహం జరిగింది. 

కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఆ యువకుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కానీ పెళ్లయిన కొన్ని గంటల్లోనే పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. వివాహమైన మరుసటి రోజు ఉదయం నవవధువుకు తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావం మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

మరోవైపు వరుడి ఇంట్లోని బాత్రూమ్‌లో మృతశిశువు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏడు నెలల గర్భంతో ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ పరిణామంతో వరుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తనకు పెళ్లి చేసే సమయంలో వధువు గర్భవతి అన్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దాచిపెట్టారని ఆరోపించాడు. ఏడు నెలల గర్భంతో ఉన్న విషయాన్ని ముందే చెప్పకుండా వివాహం జరిపించి తనను మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

వరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవవధువును విచారిస్తున్నారు. అసలు గర్భధారణ విషయం ఎప్పుడు తెలిసింది? వివాహానికి ముందు ఈ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదు? కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఒకవైపు పెళ్లయిన మరుసటి రోజే నవజాత శిశువు మృతి.. మరోవైపు వివాహానికి ముందే గర్భధారణ విషయాన్ని దాచారంటూ వరుడి ఫిర్యాదు.. వెరసి ఈ ఘటన ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. అయితే శిశువు మృతికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదికతోనే తేలనుంది. పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

మీకు నచ్చవచ్చు: అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్‌లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.!

మీకు నచ్చవచ్చు: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి.!
 

 

[ The bride gave birth the day after the wedding, Tirunelveli Crime News, Pichammal, Venkatesh, Tamil Nadu news,Marriage fraud case]

By
en-us Political News

  
సర్వదర్శనానికి 8 గంటల సమయం.!
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.