కాలాన్ని ఆదా చేసే కళ ఇదిగో!

Publish Date:Feb 6, 2025

Advertisement

మనిషి జీవితంలో విజయం అనేది స్థాయిని పెంచుతుంది.  సమాజంలో పేరు, ప్రతిష్టలు, గౌరవం మొదలైనవి సంపాదించి పెడుతుంది. విజయం గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. అయితే విజయం సాధించిన వ్యక్తికి మాత్రం కష్టం అంటే ఏమిటి?? కష్టం ఎలా ఉంటుంది?? కష్టం తరువాత విజయం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?? విజయ సూత్రం ఏంటి?? ఇలాంటి విషయాలు తెలిసి ఉంటాయి. 

ఒక విజేతను "మీ విజయరహస్యం ఏమిటి?" అని ప్రశ్నించినప్పుడు  "నేను జీవితంలో  విజయాలు సాధించడానికి కారణం నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే హాజరు కావటమే” అని అన్నాడట!

మనిషి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నా, ఎంత కష్టపడేతత్వం ఉన్నా చేసే పని ఇంకా మిగిలుందే అని కాలాన్ని పట్టుకుని ఆపలేడు. నిరంతర ప్రవాహిని లాగా కాలం అలా సాగిపోతూ ఉంటుంది. అయితే చేసే పనిపట్ల అవగాహన పెంచుకుంటే కాలాన్ని ఆదా చేయవచ్చు. నిర్ణీత సమయంలో పని పూర్తి కావాలంటే ఆ పనిని వేగంగా, సమర్థవంతంగా చేయడం ఒకటే మార్గం. చేసే పని గురించి అవగాహన పెంచుకుంటే సమయాన్ని ఆదా చేసే కళ తెలుస్తుంది. సమయాన్ని ఆదా చేయడం కూడా ఒక కళనా అని అనిపిస్తుందేమో!! 

కాలాన్ని ఆదా చేయడమనే కళ!!

మనం నిత్యం చేయవలసిన పనులను అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో రూపొందించుకోవాలి. ఈ ప్రక్రియనే కాలాన్ని ఆదాచేసే కళ అంటారు. క్రమపద్ధతిలో రూపొందించుకోవడం అంటే ప్రతిరోజూ చెయ్యాల్సిన పనులను సమయ ప్రణాళిక వేసుకుని ఒక పట్టిక రూపొందించుకోవడం. అయితే ఇలా రూపాందించుకోవటంతోనే సమేక్మ్ ఆదా అయిపోదు. రూపొందించుకున్న ప్రణాళికను ఆచరణలో పెట్టాలి. ఆచరించినప్పుడే సరైన ఫలితం. దక్కుతుంది. 

 “నిన్న జరిగిన దానిని గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఈ రోజు కూడా వృధా చేసుకోవటం నిరర్ధకం. నిన్నటికంటే ఈరోజు మనిషిలో ఆలోచనాపరంగా బుద్ధి వికాసం కలగాలి. అలా కలగకపోతే  మన జీవితంలో మరొక రోజు వ్యర్ధమవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. ఈరోజు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎంత గొప్పగా, ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటాం అనేది మన ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది.  గడిచి పోయిన క్షణాలు తిరిగిరావు, అలాంటప్పుడు గడిచిపోయిన కాలంలో ఎలాంటి బాధపెట్టే విషయాలు ఉన్నా వాటిని తలచుకుంటూ బాధపడకూడదు.

 ఏపుగా పెరిగిన పైరుని కోయకపోతే దాని పరమార్ధం దెబ్బ తింటుంది. అలాగే వికసించిన పూలను కోసుకోకపోతే వాటి ప్రయోజనమే దెబ్బ తింటుంది. అదే విధంగా వయస్సులో ఉన్నప్పుడే కష్టపడాలి. ఎందుకంటే ఆలస్యమయితే కాలం మన చేతిలో ఉండదు. గడిచిపోయే ప్రతి నిమిషం తన విలువను గుర్తుచేసే సందర్భాలు భవిష్యత్తులో అప్పుడప్పుడూ ఎదురవుతాయి. ఆ సందర్భాలలో " అయ్యో!! అప్పుడు ఆ కాలాన్ని అలా వృధా చేయకపోతే ఇప్పుడు ఇలా కలలను కోల్పోయి ఉండను కదా!!" అనుకునేలా ఉంటుంది మనసు పరిస్థితి. ఈ సెకను, ఈ నిమిషం, ఈ రోజు నాది. నేను ఏ పనినైనా చేయగలను అనుకునేవాడిదే ఈ ప్రపంచం. కాలానికి ఎదురుపడి ప్రయాణం చేసేవాడే విజేత. ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది అనే విషయం మర్చిపోకూడదు. కాలాన్ని సరిగా అర్ధం చేసుకున్నవాడే జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలడు. 

మనం నిమిషాల గురించి జాగ్రత్త పడితే గంటలు అవే జాగ్రత్త పడతాయి. రూపాయలను పొదుపుచేస్తే వేలు అయినట్టు, కాలం ఆ విధంగానే పొదుపు అవుతుంది. కాలాన్ని దుర్వినియోగం చేసుకునే వారు ఎప్పుడూ పరాజితులుగా మిగిలిపోతారు. మరికొందరు పరాజయానికి, కాలం వృధా అవ్వడానికి సాకులు వెతికి వాటిని చూపిస్తుంటారు. వాటివల్ల ఇతరులను నమ్మించగలరేమో కానీ అలా తనని తాను మభ్యపెట్టుకోవడం తనని తాను మోసం చేసుకోవడం అవుతుంది. దానివల్ల ఇతరులకంటే అలా సాకులు చెప్పేవారికే నష్టం. అందుకే   ప్రతి ఒక్కరూ కూడా కాలాన్ని ఆదా చేసే కళ నేర్చుకుంటే జీవితంలో విజేతలుగా గుర్తించబడతారు.

                                       ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.