అందుకే ఆయన సిబిఐ దత్తపుత్రుడు

Publish Date:Jun 21, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తె, హర్షరెడ్డి  పారిస్‌లోని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. వచ్చే నెల (జులై) 2న జరిగే కాన్వొకేషన్‌’లో ఆమె డిగ్రీ పుచ్చుకోనున్నారు. ఒక తండ్రిగా కుమార్తె కాన్వొకేషన్‌ కార్యక్రమానికి హాజరై, అ వేడుకను చూడాలని అనుకోవడం సహజం. అదీగాక, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి అదేమీ పెద్ద విషయం కాదు.

కానీ, జగన్మోహన్ రెడ్డి విషయంలో అది పెద్ద సమస్యే. ఎందుకంటే, ఆయన ముఖ్యమంత్రి మాత్రమే కాదు, అక్రమ ఆస్తుల కేసులో ఆయన విచారణ ఎదుర్కుంటున్నారు. న్యాయ పరి భాషలో చెప్పలంటే ఆయన నిందితుడు. అది కూడా ఒకటి రెండు కాదు, అంత కంటే ఎక్కువ కేసుల్లోనే ఆయన ఎ1 నిందితుడు.  అవును, అయన ముఖ్యమంత్రి అయితే కావచ్చును, కానీ, ఆయన అక్రమ ఆస్తుల కేసులో బెయిల్ మీద బయట ఉన్న నిందితుడు. కాబట్టి అయన కదలికలకు షరతులు వర్తిస్తాయి. అయన ఏమి చేయాలో చేయకూడదు,అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి.

అందుకే ఆయన విదేశాలకు వెళ్ళాలంటే న్యాయస్థానం ముందస్తు అనుమతి అవసరం. ఆయన తమకు ఇష్టమైనప్పుడు, ఇష్టమైన దేశానికి వెళ్లేందుకు వీలులేదు. ఆయన దేశం గడప దాటాలంటే న్యాయస్థానం అనుమతి ఇస్తేనే  గానీ  ఆయన దేశం గడప దాటలేరు.  ముఖ్యమంత్రి కావడానికి చాలా ముందుగానే, ఆయన అక్రమాస్తుల కేసులో నిందితుడిగా 16 నెలలు జైలులో ఉండి షరతులతో కూడిన  బెయిల్ మీద బయట కొచ్చారు.

ఆ బెయిల్ షరతుల్లో పాస్ పోర్టును కోర్టు అధీనంలో ఉంచడం కూడా ఒకటి. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదు. అందుకే ఎప్పుడు విదేశాలకు వెళ్లాల్సి వచ్చినా ఆయన కోర్టు అనుమతి తీసుకుంటారు. దేశం విడిచి ఫ్రాన్స్ కాదు, పక్కనున్న పాకిస్థాన్ వెళ్ళాలన్నా, న్యాయస్థానం అనుమతి అవసరం. అందుకే ఆయన తమ కుమార్తె కాలేజ్‌ స్నాతకోత్సవానికి వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వీలుగా.. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతును సడలించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈనెల 28 నుంచి వారం పాటు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని జగన్‌ కోర్టును కోరారు. 

అయితే, పారిస్‌ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌ వేసిన పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు.పారిస్‌ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. వివిధ కారణాలు చెప్పి జగన్‌ విదేశాలకు వెళ్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జగన్‌ పారిస్ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ సారి ఏదో కారణం చెప్పి విచారణను ఆలస్యం చేయిస్తున్నారని ఆయన పారిస్ పర్యటనకు వెళ్లనివ్వొద్దని కోర్టులో సీబీఐ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. 

అయితే, సిబిఐ అభ్యంతరం చెప్పినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి లభిస్తుందని వైసేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరిన ప్రతి సారీ, సిబిఐ అభ్యంతరం చెపుతూనే వుంది , సిబిఐ కోర్టు అనుమతి ఇస్తూనే ఉందని వైసీపే నాయకులు అంటున్నారు. అయితే, జగన్ రెడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దగా విదేశీ పర్యటనలకు వెళ్ళలేదు. ఓ సారి జెరూసలెం.. మరోసారి అమెరికా… వెళ్లారు. రెండు సార్లూ విహారయాత్రలకు వెళ్లారు.

మొత్తం మీద నాలుగైదు సార్లు మాత్రమే వెళ్లారు. అయితే ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్లాలని పిటిషన్ పెట్టుకున్నా కోర్టు అనుమతి ఇస్తోంది. సీబీఐ మాత్రం పర్మిషన్ ఇవ్వవొద్దని కౌంటర్ వేస్తూనే ఉంది. కేసుల విచారణ ఆలస్యమవుతోందని వాదిస్తూనే ఉంది. అయితే కోర్టులో ఆ వాదనలు నిలబడటం లేదు. జగన్‌కు పర్మిషన్ లభిస్తోంది. ఈ సారి కూడా జగన్ కు ప్యారిస్ వెళ్లేందుకు అనుమతి లభిస్తుందని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. అదో పెద్ద ఇష్యూనా అన్నట్లు నవ్వేస్తున్నారు.  అందుకే నేమో కొందరు జగన్ రెడీ సిబిఐ దత్తపుత్రుడు .. అంటారు. ఇలా అయన అడిగిందే తడవుగా  వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు ఇవ్వడం మొదలు, విదేశీ పర్యటనలకు అనువుగా షరతులను సడలించడం వరకు, ఆయన కోరికలు అన్నింటినీ నెరవేస్తునందువలనే కావచ్చు ... కొందరు ఆయన్ని సిబిఐ దత్తపుత్రుడు అంటారు ..

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.