దటీజ్ రేవంత్.. అనుకుంటే సాధించేస్తారంతే!

Publish Date:Dec 6, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా అనుమల రేవంత్ రెడ్డి  గురువారం (డిసెంబర్ 7) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఇందు కోసం ఇప్పటికే  ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నేతలతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలతో పాటు తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులూ కూడా హాజరౌతున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్యతోపాటు మరికొందరు ఉద్యమ కారులు కూడా హాజరుకానున్నారు. అదలా ఉంచితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనీ, అదీ ఈ సారి ఎన్నికలలోనే సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందనీ, మూడు నాలుగు నెలల ముందు ఎవరూ కనీసం ఊహించనైనా ఊహించి ఉండరు.   కానీ అసాధ్యం అనుకున్న దానిని అనితర సాధ్యుడిగా రేవంత్ సాధ్యం చేశారు. చేసి చూపించారు.  ఇందు కోసం కలిసి వచ్చిన అంశాలు ఎన్నైనా ఉండనీ కానీ.. అసలు సూత్రధారి మాత్రం రేవంత్ రెడ్డే  అనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. 

అయితే, మనసు పెట్టి నిబద్దతతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్నే ఉదాహరణగా  చెప్పుకోవచ్చు. రేవంత్ రెడి  అసలు రాజకీయాలలోకి వచ్చిందే ముఖ్యమంత్రి కావాలని అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నిజం అదే . అసలు రాజకీయాలలో ఓనమాలు నేర్చుకొనే సమయంలోనే రేవంత్ ఈ విషయాన్నీ సహచరులకు చెప్పారట. తాను ఏ రోజుకైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని అప్పట్లోనే ధీమాగా చెప్పేవారట. అప్పటి   ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రేవంత్ రెడ్డి లాంటి ఒక నూతన రాజకీయ నేత సీఎం కావాలనుకోవడం అత్యాశే అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్దండులైన నేతలెందరో అప్పుడు రాజకీయాలలో ఉన్నారు. అసలు సహజంగా కొత్తగా రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్సీ అయిన నేత మహా అయితే   తాను మంత్రి కావాలని ఆశిస్తారు. కానీ, రేవంత్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన సమయంలోనే తాను ముఖ్యమంత్రి కావాలని బలంగా నిర్ణయించుకొని రాజకీయాలలో అడుగు పెట్టారు. 

రేవంత్ తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో పొలిటికల్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు కె నాగేశ్వర్ రావు కూడా ఎమ్మెల్సీగా అసెంబ్లీలో ఉన్నారు. రేవంత్, నాగేశ్వర్ ఇద్దరూ అసెంబ్లీలో ఒకే బెంచ్ లో కూర్చొనేవారు. ఆ సమయంలోనే రేవంత్ నాగేశ్వర్ తో తానెప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతాను సార్ అని చెప్పారట. తాజాగా ఎన్నికలకు ముందు రేవంత్ తో నాగేశ్వర్ ఇంటర్వ్యూలోనే ఈ విషయం పంచుకున్నారు. అంటే రేవంత్ ఎంత కాన్ఫిడెన్స్ తో, ఎంత ఆత్మవిశ్వాసంతో  రాజకీయాలలో అడుగు పెట్టారో  అర్ధమౌతుంది. ఆయన ఎదిగిన తీరు చూసినా ఆయన ఏ స్థాయిలో హార్డ్ వర్క్ చేశారన్న విషయం అవగతమౌతుంది.   1969 నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి.. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడిగా విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాదే 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ బరిలో గెలిచి..  ఆ తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును కలిసి తెలుగుదేశం గూటికి చేరారు. అక్కడ నుండే మొదలైంది రేవంత్ రెడ్డి అసలు సిసలైన రాజకీయ ప్రయాణం.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 2014లో రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అతి కొద్ది కాలంలోనే చంద్రబాబుకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. 2004 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజా సమూహాలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడంలో తర్ఫీదు ఇచ్చారు.  2014-17 మధ్య కాలంలో  తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ చంద్రబాబును కలిసి తన పరిస్థితిని వివరించి సామరస్యపూర్వకంగానే 2017 అక్టోబరులో  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏడాదికే అంటే 2018లో  ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎదిగారు.   కేసీఆర్ సర్కార్  కంట్లో నలుసై పోరాటం చేశారు. అందుకే 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచించింది.

ఏకంగా ముగ్గురు మంత్రులు ఒక్క కొడంగల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టి, అక్కడే మకాం వేసి ప్రచారం చేసి  రేవంత్ ను ఓడించారు.  కానీ అనూహ్యంగా 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టారు. అక్కడే రేవంత్ పొలిటికల్ కెరీర్ మరో మలుపు తిరిగింది. అక్కడ కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు పెరిగాయి. రేవంత్ క్యాలిబర్ ఏంటో తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు 2021  జూన్ 26న ఆయనను టీపీసీసీ అధ్యక్ష్యుడిగా ప్రమోట్ చేశారు. 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్.. సరిగ్గా రెండేళ్లలోనే పార్టీని గాడినపెట్టడమే కాదు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  దటీజ్ రేవంత్.

By
en-us Political News

  
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.