భావోద్వేగాల భవన్ మరి

Publish Date:Apr 27, 2023

Advertisement

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయింది. కానీ ఆస్తి విభజన మాత్రం ఇంకా జరగడంలేదు.ఢిల్లీలోనిఆంధ్రాభవన్ మీద మళ్లీ కొత్త పేచీ మొదలైంది. ఆ భవన్ తో తమకు భావోద్వేగాలు ఉన్నాయని, కాబట్టి తమకే వదిలేయాలని తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. 

ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌తో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని, కాబట్టి దానిని తమకు వదిలేయాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. దానిని తమకు ఇచ్చేస్తే పటౌడీ హౌస్‌లో తమకున్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఉమ్మడి స్థిరాస్తులను కేంద్రం పంచిపెట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ భవన్ విజభనకు సంబంధించి నిన్న రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, ఏపీ భవన్‌ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌషిక్ తదితరులు ప్రతినిధులుగా హాజరు కాగా, తెలంగాణ నుంచి రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. అశోకా రోడ్డులో ఉన్న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌ను పూర్తిగా తమకు వదిలేయాలని తెలంగాణ అధికారులు కోరారు. దానితో తెలంగాణ ప్రజలకు విడదీయలేని భావోద్వేగ సంబంధాలు ముడిపడి ఉన్నాయని అన్నారు.కాగా, రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆస్తులను ఏపీ, తెలంగాణకు 52:48 నిష్పత్తిలో పంచారు. ఢిల్లీలోని అశోకా రోడ్డుతోపాటు శ్రీమంత్ మాధవరావు సింధియా మార్గ్‌లో కలిపి ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడిగా 19.733 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం భూమిలో అశోకా రోడ్డులోని ఏపీ-తెలంగాణ భవన్ 8.726 ఎకరాల్లో ఉండగా, దానిలో ఏపీ వాటా 4.3885 ఎకరాలు. దీని విలువ రూ. 1,703.6 కోట్లు. తెలంగాణ వాటా 4.3375 ఎకరాలు కాగా, దాని విలువ రూ. 1,694.4 కోట్లు. ఇక, 0.511 ఎకరాల రోడ్డులో రెండు రాష్ట్రాలకు 0.2555 ఎకరాల చొప్పున ఉంది. దీని విలువ రూ. 160 కోట్లు. తెలంగాణ కింద గోదావరి బ్లాక్‌లో 4.082 ఎకరాలు, ఏపీ కింద శబరి బ్లాక్‌ లో 4.133 ఎకరాలు ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల భవనాలు ఒకే చోట ఉండకుండా పటౌడీ హౌస్‌లోని భూమిని ఏపీ తీసుకుని ఏపీ-తెలంగాణ భవన్‌ను తమకు వదిలేయాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. అందులో భాగంగా 58:42 నిష్పత్తిలో ఏపీకి దక్కాల్సిన భూమికి మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తెలంగాణ అధికారుల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ఏపీ అధికారులు ఈ విషయంపై తమ సీఎం జగన్ మోహన్‌రెడ్డితో చర్చించాక నిర్ణయం చెబుతామని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చేవారం మరోమారు సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు నిర్ణయించారు.దీనిపై ఏపీ పెద్ద మనసుతో స్పందిస్తుందని ఆశిద్దాం..

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.