అందరికీ థ్యాంక్స్.. సీఎంగా ఎంపికయ్యాక రేవంత్ తొలి ట్వీట్

Publish Date:Dec 5, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రిగా అధిష్ఠానం తన పేరు ప్రకటించిన తరువాత  రేవంత్ రెడ్డి తొలిసారి Xవేదికగా  స్పందించారు. తనను సీఎంగా ఎంపిక చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావు థాక్రేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  , ఇటీవల వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. మ్యాజిక్‌ ఫిగర్‌కు మించి స్థానాలు కట్టబెట్టారు. అనంతరం సుదీర్ఘంగా చర్చలు జరిపిన కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. శుక్రవారం (డిసెంబర్ 7) రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించిన క్షణం నుంచీ రేవంత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టడాన్ని తొలుత గట్టిగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంగా రేవంత్ ఎంపికను స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.మీడియాతో మాట్లాడిన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సోదరుడు రేవంత్ కు శుభాకాంక్షలు అని చెప్పారు. 
ఇలా ఉండగా..   తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలూ వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  రేవంత్ రెడ్డిని అభినందించారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్ పై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలను నేరవేర్చాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. పరిపాలనలో ప్రత్యేకమైన ముద్ర వేసి తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని కోరారు. 

ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.  2017, అక్టోబర్ లో  కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ సల్వ కాలంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ,పార్టీ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అయ్యారు.  ఆ తర్వాత 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా ఆ తర్వాత 2019 జరిగిన లోక్ సభ ఎన్నికల్లో   మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతినిధ్యం వహిస్తున్నప్పటికీ   ప్రశ్నించే గొంతుక ను గెలిపించుకోండంటూ ప్రజల మన్ననలు పొంది విజయం సాధించారు.  

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ప్రజా సమస్యలపై అధికార బీఆర్ఎస్ అక్రమాలు, అవినీతిపై నిరంతర పోరాటం చేశారు. అలాగే తెలంగాణ ఆవిర్భావం నుంచీ వరుస పరాజయాలతో ఉనికి మాత్రంగా మిగిలిన రాష్ట్ర కాంగ్రెస్ లో నూతనోత్సాహం నింపి  పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చారు. పార్టీ విజయం సాధించిన తరువాత ఎటువంటి ప్రతిష్ఠంభనకూ తావు లేకుండా రేవంత్ సీఎంగా ఏకగ్రీవంగా గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ఎన్నుకుంటారనే అంతా భావించారు. అయితే అయితే పార్టీ విజయం సాధించిన తరువాత అగ్రపీఠం కోసం సీనియర్ల మంటూ కొందరు పట్టుబట్టడంతో రెండు రోజుల పాటు సీఎం ప్రకటనపై అధిష్ఠానం తాత్సారం చేసింది.

తాత్సారం అయితే చేసింది కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే అన్న స్పష్టమైన సంతాకేలను మాత్రం ఇచ్చింది. సీఎం పీఠం కోసం పట్టుబడుతున్న నేతలను హస్తిన పిలిపించుకుని క్లాస్ పీకింది. పరిస్థితిని విడమరచి చెప్పి వారిని ఒప్పించింది. చివరికి వారిద్దరినీ పక్కన పెట్టుకునే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హస్తినలోనే తెలంగాణ సీఎం రేవంత్ అంటూ విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో గురువారం ఉదయం 10.15 గంటలకు రేవంత్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎట్టకేలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ.. ఆ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.