Publish Date:Jul 24, 2022
పెరట్లో చెవి కమ్మ దొరికితే నాదంటే నాదని కోడళ్లు తిట్టుకున్నారు. అత్తగారు వెళ్లి ఇదెవరిదో వాళ్లు ఇవాళ కమ్మటి వంట చేస్తే నేనే తేలుస్తానన్నది. అంతే అత్తగారు పక్కింటి కలగూరగంప కబుర్లకు వెళ్లింది, కోడళ్లు తమ బంగారాన్ని కాపాడుకోవడానికి వచ్చీ రాని వంట చేయడంలో తల మునకలయ్యారు. ఆనక తిండి ఎలా గున్నా అవస్థ మాత్రం పెద్ద కోడలిదే. అదుగో అలా ఉంది ఉద్ధవ్, షిండేల సంగతి. అసలు శివసేన అంటేనే మొన్నటి దాకా ఉద్దవ్ థాక్రే నాయకత్వంలోనిదే. ఇపుడు షిండే రాజకీయ హడావుడితో ఆయన దుకాణం కూడా శివసేనగా మారింది. దీంతో పార్టీ గుర్తు తమకే ఉండాలన్న పోరు తోడికోడళ్ల రగడలానే మారింది. మహా రాష్ట్రకే కాదు యావత్ భారతా వనికి వీరి గోడు మంచి కాలక్షేపంగా మారింది. ఎన్నికల కమిషన్ ముందు ఇరు వర్గాలూ పార్టీ, సింబల్ తమకు ఎందుకు ఇవ్వాలన్నది వివరిస్తూ సంబంధిత పత్రాలు అధికారుల ముందు పెట్టారు. ఇక వారే తేల్చవలె.
షిండే 40 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ థాక్రేను ఎదిరించి వేరు కుంపటి పెట్టడం అధికారంలోకి వచ్చేయడం జరిగి నెల రోజులు అయింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంతటి సంక్షోభం శివసేన ఎప్పుడూ ఎదుర్కొనలేదు. జూన్ 30న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. బిజెపి మద్దతుతో షిండే ముఖ్యమంత్రిగా , ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి అందరికీ తెలిసిందే. అధికారం చేజిక్కించుకోవడం అయిపోయింది. కానీ పార్టీ గుర్తు విషయంలో గోల ఆరంభమయింది. అసలు శివసేన పార్టీ అంటేనే థాక్రే వారిది కనుక పార్టీ, సింబల్ రెండూ మాకే చెందుతాయని ఉద్ధవ్ థాక్రే గొంతు చించు కుంటున్నారు.
కానీ మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 44 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌సభ ఎంపీలు తన వేపు వచ్చేరు గనుక శివసేన మాదే అవుతుందని షిండే గొడవ పెట్టుకున్నారు. అధికారం పోయి, ప్రజల మద్దతు, ఎమ్మెల్యేలను కోల్పోయిన థాక్రేకు శివసేన అసలు పార్టీ సింబల్ ఇవ్వడం న్యాయం కాదని షిండే వాదన. అందు వల్ల ఎన్నికల కమిషన్‌పై ఇద్దరూ ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇంతకు ముందు థాక్రే వర్గాన్ని రద్దు చేయాలని, పార్టీ సింబల్‌ను తమకు కేటాయించాలని మహా అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌ను షిండే కోరారు. కానీ ఆ విషయంలో నిర్ణయం అప్పుడే తీసుకోవద్దంటూ ఇటీవల స్పీకర్‌కు సుప్రీం కోర్టు చెప్పింది.
ఇదిలా ఉండగా, ముంబై కార్పొరేషన్ ఎన్నికలతో పాటు అనేక ప్రాంతీయ సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ కారణంగా పార్టీ సింబల్ విషయంలో ఇరు వర్గాలు త్వరపడుతున్నాయి. ఇసి కి పార్టీ పేరు, గుర్తు విషయంలో తమ వాదనలు వినాలని కోరుతూ ఇరువర్గాలు ఇప్పటికే అభ్యర్ధనలు అందజేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/thakrey-and-shinde-goes-for-oarty-symbol-25-140445.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.