పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెండ్ చేసిన టీజీ సేఫ్: హైదరాబాద్ స్వీట్ షాపులపై తనిఖీలు.!
Publish Date:Oct 29, 2026
Advertisement
హైదరాబాద్ లోని ప్రముఖ స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్ర వాతావరణంలో మిఠాయిలను తయారు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ తనిఖీల్లో దశాబ్దాలుగా నాణ్యతకు, రుచికీ బ్రాండ్ అన్న గుర్తింపు పొందిన జి. పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్‌ను టీజీ సేఫ్ అధికారులు సస్పెండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16 ప్రధాన స్వీట్ షాపులపై టీజీ సేఫ్ ఏకకాలంలో దాడులు చేసింది. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన, కల్తీ, పాడైపోయిన సుమారు 3 వేల 546 కిలోల ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. వీటి మార్కెట్ విలువ 16 లక్షల 86 వేల రూపాయలుగా అంచనా. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని 5 ప్రముఖ సంస్థల లైసెన్సులను రద్దు చేశారు. అలా లైసెన్సులను సస్పెండ్ చేసిన వాటిలో పుల్లారెడ్డి స్వీట్స్ కూడా ఉంది. సనత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్ తయారీ కేంద్రంలో అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. వంటగదిలో కుళ్లిన కూరగాయలు, ఎలుకల వ్యర్థాలు ఉండటంతో పాటు గడువు ముగిసిన పదార్థాలను స్వీట్ల తయారీకి వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తయారీ కేంద్రం నుంచి 15 లక్షల 3వేల రూపాయల విలువైన 3 వేల 133 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసి, పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ రద్దు చేశారు. ఇంకా చార్మినార్‌లోని ఆగ్రా మిఠాయి ఘర్, వనస్థలిపురంలోని స్వీట్ వన్ రుచులు, ఫలక్‌నుమాలోని బాలాజీ శ్రీ కిషన్ మిఠాయి భండార్, కాటేదాన్‌లోని హిరాణి ఫుడ్స్ వంటి సంస్థల లైసెన్స్ లను కూడా టీసీ సేఫ్ అధికారులు సస్పెండ్ చేశారు. ఇవే కాకుండా, ఎలాంటి లైసెన్సులు లేకుండా, అపరిశుభ్రత మధ్య నిర్వహిస్తున్న చాంపపేట్లోని బాలాజీ స్వీట్స్, సికింద్రాబాద్‌లోని మమతా స్వీట్ హౌస్ సహా మరో మూడు దుకాణాలను టీజీ సేఫ్ అధికారులు మూయించేశారు. ఈ తనిఖీల సందర్భంగా వివిధ కేంద్రాల నుంచి మొత్తం 22 ఆహార పదార్థాల నమూనాలను సేకరించిన అధికారులు, వాటిని నాణ్యత పరీక్షల కోసం పంపించారు.
[TG Safe Suspend Lisence Of Pulla Reddy Sweets, Hyderabad Food Safety Raids, Hyderabad, Adulterated Sweets, TG Food Safety Inspections, Telangana, Telugu One]
http://www.teluguone.com/news/content/tg-safe-suspend-lisence-of-pulla-reddy-sweets-24-235747.html
Chandrababu Naidu recieved a letter from Anna Hazare
గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అరెస్టు నుండి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు
అసెంబ్లీలో నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఒకరికొకరు ఎన్నెన్ని మాటలనుకున్నా ఫరవాలేదు. కోపంతో తిట్టుకున్నా బాధలేదు... కానీ వారి ఆవేశం అసెంబ్లీలోని బల్లలు, మైకులపై చూపిస్తేనే ఇబ్బంది. అసెంబ్లీలో తెలంగాణాపై అన్ని పార్టీలు తమ వైఖరులు చెబుతున్న నేపథ్యంలో స్పీకర్ లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్‌కు మైక్ ఇవ్వడం.. ఆయన బంద్‌లవల్ల సరైన ట్రాన్స్పోర్ట్ లేక ప్రతిరోజూ 60మంది ఉద్యోగులను ఐబిఎం కంపెనీ విమానంలో బెంగుళూరు తీసుకెళుతోందని చెప్పారు.
ట్యాంక్ బండ్ పై కూలిన విగ్రహాలను మళ్ళీ ఏర్పాటు చేస్తాననటం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమేనని, విగ్రహాలను ఏర్పాటు చేస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణా మార్చ్ కు పిలుపునిచ్చిన సమయంలో ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేయడం సరికాదని, తెలంగాణా వైతాళికుల విగ్రహాలు పెట్టకుండా ప్రభుత్వం వేరే విగ్రహాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజలను అవమానించడమేనని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా వామపక్షాలు భారత్‌బంద్ పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్న పలువురు కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేలు విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్టాయి. అయితే హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి.
Nine persons were on Sunday killed and five others injured as several houses caved in following a series of cloudbursts in different areas of Uttarakhand’s Rudraprayag district, taking the death toll since Friday to 47. Cloudbursts struck four villages including Kirorimalla, Timli Badma, Dugur Shemla and Simbal on Sunday morning, in which nine persons died and five others were injured. With these deaths, the toll in Rudraprayag district in the last two days went up to 47, whereas, five persons were injured and 23 others still missing.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమంగా అనేక ప్రయోజనాలు పొంది దానికి బదులుగా జగన్ సంస్థల్లో పెట్టు బడులు పెట్టిన ముగ్గురు రెడ్డి పారిశ్రామికవేత్తలను సిబీఐ త్వరలో అరెస్టు చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగు తోంది.
తెలంగాణా ప్రాంతంలో జరుగుతున్నా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముందస్తుదాడి వ్యూహాన్ని అమలు చేస్తోంది. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీకి మద్దతునిస్తున్న ప్రజాసంఘాలు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను తరిమికొట్టాలని పిలుపునిచ్చాయి.
మాజీ నక్సలైట్ జడల నాగరాజు ఆచూకీ చాలాకాలంగా తెలియడంలేదు. రెండున్న నెలల క్రితం అతను అదృశ్యమయ్యాడు. గతంలో పోలీసులకు కోవర్ట్ గా పనిచేసిన నక్సలైట్ నాగరాజు మావోయిస్టులపై కోలుకోలేని దెబ్బకు కారణమయ్యాడు.
డప జిల్లాలో సుమారు రూ.100 కోట్లు విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూముల ఆక్రమణపై 1995 తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సభాసంఘం జిల్లా అంతా పర్యటించి ఏఏ ప్రాంతలో వాక్ఫ్ భూములను ఎవరూ ఎంత ఆక్రమించుకున్నారో పరిశీలించింది.




