షర్మిల పొలిటికల్ కెరీర్ కు పరిక్షా సమయం!

Publish Date:Jan 20, 2024

Advertisement

పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నది నినాదం. అయితే ఇప్పుడు ఇది వైసీపీలోని క్యాప్టివ్ నేతలు, అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎంపీలకు సరిగ్గా వర్తిస్తుంది. ఛీ అన్నా, తూ అన్నా జగన్ పార్టీ చూరుపట్టుకు వేళాడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్న పలువురికి ఇప్పుడు కాంగ్రెస్ పర్ ఫెక్ట్ డెస్టినేషన్ లా కనిపిస్తోంది. 

జగన్ వ్యూహాత్మకంగా గత నాలుగున్నరేళ్లలోనూ పార్టీలో గుర్తింపు, ప్రాముఖ్యత ఉండాలంటే విపక్షాలను మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అగ్ర నేతలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాల్సిందే అన్న పరిస్థితి కల్పించారు. దీంతో జగన్ ప్రాపకం సంపాదించడానికో, పదవుల కోసమో పలువురు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు విపక్షాలపై మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ పై అనుచితంగా నోరు పారేసుకున్నారు. సభ్య సమాజం అంగీకరించని భాషలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలను సైతం లేవనెత్తి దుర్భాషలాడారు.అలాంటి వారిలో అత్యధికులకు ఇప్పుడు జగన్ వచ్చే ఎన్నికలలో పోటీకి పార్టీ టికెట్లు నిరాకరించారు, లేదా నియోజకవర్గం మార్చేశారు. ఇలాంటి వారి సంఖ్య ఇప్పటికే 58 దాటింది. రానున్న రోజులలో ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో జగన్ ను నమ్ముకుని విపక్షాలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న వారు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. వైసీపీలో ఉండలేక, పార్టీ మరదామంటే చేర్చుకునే వారు లేక రోడ్డున పడ్డట్లుగా మిగిలిపోయారు. 

పోనీ పోటీకే దూరంగా ఉందామా అంటే రాజకీయ జీవితానికి  చేజేతులా చరమగీతం లిఖించుకున్నట్లు అవుతుందన్న భయం. అందుకే ఇష్టం లేకపోయినా జగన్ చెప్పినట్లు నియోజకవర్గం మారి ఓటమి తథ్యమని తెలిసీ పోటీకి రెడీ అవుతున్నారు. టికెట్ దక్కని వారు ఇంత కాలం నమ్మి మోసపోయాం, మరో సారి మోసపోదాం అన్నట్లుగా మౌనంగా ఉంటున్నారు. అదే సమయంలో విపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అంశాల వారీ విమర్శలకు మాత్రమే పరిమితమైన వారు మాత్రం జగన్ ఆదేశాలను ధిక్కరించి బయటకు వచ్చేశారు. వచ్చేస్తున్నారు. అలా ఇప్పటికే బయటక వచ్చేసిన వారిని మినహాయిస్తే.. ఉండలేక, బయటకు రాలేక ఊగిసలాడుతున్న వారికి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో కొత్త ఆశలు చిగురించినట్లైంది. ఇప్పుడు వారి చూపు కాంగ్రెస్ వైపు ఉంది. ఆదివారం ఆమె పార్టీ రాష్ట్ర సారథిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇక కాంగ్రెస్ అటువంటి వారికి తలుపులు బార్లా తెరుస్తుందా? అన్న సంశయాలు ఎవరి నుంచీ వ్యక్తం కావడం లేదు. ఇందుకు కారణం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గత ఎన్నికలలో ఏపీలో  పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ కూడా నోటాతో పోటీ పడింది. అంతే కాదు వరుసగా రెండు ఎన్నికలలో రాష్ట్రంలో జీరో స్థానాలతో అట్టడుగున నిలిచింది. అంటే ఆ పార్టీకి ఏపీలో ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఇంత కంటే పతనమయ్యే చాన్సూ లేదు.  కానీ షర్మిల పరిస్థితి అలా కాదు. కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేతపట్టి ఆ పార్టీ పుంజుకునేలా చేయడంపైనే ఆమె రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది.  

ఇప్పటికే తెలంగాణలో షర్మిల సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి విఫలమయ్యారు. సుదీర్ఘ  పాదయాత్ర చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె అక్కడ పోటీ నుంచి తన పార్టీని దూరంగా ఉంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక వేళ ఆ ఎన్నికలలో షర్మిల పార్టీ పోటీ చేసి విఫలమై ఉంటే.. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో  చేరి ఏపీలో సారథ్య బాధ్యతలు చేపట్టినా ప్రయోజనం ఉండేది కాదు.  తెలంగాణలో పోటీ నుంచి విరమించుకోవడం ద్వారా ఆమె తన రాజకీయ భవిష్యత్ ను కాపాడుకున్నారు. ఇక నుంచి ఆమె రాజకీయ పురోగతి అంతా ఏపీలో కాంగ్రెస్ ను ఆమె ఎలా నడిపించారు అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది.  కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇలా షర్మిల పార్టీలో చేరగానే అలా ఏపీ సారథ్యం అప్పగించడం ద్వారా అమెపై అపారమైన విశ్వాసాన్ని ఉంచింది. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి షర్మిల చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీలో  ఆమె ఎదుర్కోవలసింది, పోరాడాల్సింది తోడబుట్టిన జగన్ మోహనరెడ్డితో, ఆయన పార్టీ వైసీపీతో.  ఇందు కోసం షర్మిల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చని చెబుతున్నారు. అందులో మొదటిది తాను స్వయంగా కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడం. షర్మిల ముందున్న టాస్క్ఆషామాషీది ఏమీ కాదు. అతి స్వల్ప సమయం అంటే మహాఅయితే రెండు మూడు నెలలలో ఆమె ఏపీలో తన మార్క్ చూపాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేకపోయినా.. కొన్ని స్థానాలలో గెలిపించుకోవలసి ఉంటుంది. ఇందు కోసం ఆమె తీసుకునే ప్రతి నిర్ణయానికీ అధిష్ఠానం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదు.  
పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరికి టికెట్లు కేటాయించాలి వంటి అంశాలలో షర్మిలకు కాంగ్రెస్ హై కమాండ్ పూర్తి స్వేచ్ఛను ఇస్తుందనడంలో సందేహం లేదు. సో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్నది పూర్తిగా ఆమె తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే షర్మిల కాంగ్రెస్ ఏపీ సారథిగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఏ మేరకు కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్నదానిపైనే షర్మిల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అందుకే వచ్చే ఎన్నికలు షర్మిలకు నిజమైన పరీక్షగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.