Publish Date:Apr 27, 2024
పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బార్లు, రెస్టారెంట్లలో అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది. బిఆర్ఎస్ హాయంలో యదేచ్చగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని ముచ్చెమటలు పట్టిస్తోంది.
బేగంపేటలోని ప్రముఖ ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ఎక్సైజ్ అధికారులు రద్దు చేశారు. లైసెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బార్ లో నిబంధనలకు విరుద్ధంగా యువతుల చేత ఆశ్లీల నృత్యాలు చేయించడం, యువకులను రెచ్చగొట్టడం, చెవులు చిల్లులు పడే డీజే శబ్దాల హోరులో మద్యం తాగుతూ చిందులు వేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఆ సందర్భంగా బార్ నిర్వాహకులతో పాటు మొత్తం 107 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 30 మంది యువతులు, 60 మంది యువకులు, 17 మంది నిర్వాహకులు ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసును బేగంపేట పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన బేగంపేట పోలీసులు బార్ లో అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా బార్ ను నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. ఆధారాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదికను ఇచ్చారు. ఈ క్రమంలో ఊర్వశి బార్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/termination-of-license-of-urvashi-bar-and-restaurant-25-174638.html
ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు. బిఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన పని లేదు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కెసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఆ పార్టీలో పని చేసే కార్యకర్తలకు సముచిత గుర్తింపు లభిస్తుంది. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన తొలి పార్టీ దేశంలో తెలుగుదేశమే. అలాగే మరణించిన తెలుగుదేశం కార్యకర్తల పిల్లల బాధ్యత పార్టీయే తీసుకుని వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్న పార్టీ కూడా తెలుగుదేశమే.
ఏపీలో సీఎం చంద్రబాబు సీ ప్లేన్‌లో విజయవాడ లోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వెళ్లారు. అసలీ సీ ప్లేన్ అంటే ఏమిటన్న ఆసక్తి రాష్ట్ర ప్రజలలో ఉంది. తీరా చంద్రబాబు ఈ సీప్లేన్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించి.. ఆ సీప్లేన్ లో ప్రయాణించిన తరువాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సీప్లేన్ పై చర్చ మొదలైంది.
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 24 మంది దుర్మరణం చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో స్టేషన్ రద్దీగా ఉంది
వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పని చేసిన కురసాల కన్నబాబు వైపీపీని వీడనున్నరని గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా వైసీపీ అద్యక్షుడిగా ఉన్న కురసాల కన్నబాబు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటమే కాకుండా పార్టీ క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడం లేదు.
ఏపీలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం కూటమి సీప్లేన్ సర్వీస్ కు శ్రీకారం చుట్టింది. ఈ సర్వీస్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం (నవంబర్ 9)న ప్రారంభించారు. ఆ సందర్భంగా విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి సీప్లేన్‌ను ప్రారంభించి అందులో ప్రయాణించి శ్రీశైలం చేరుకున్నారు.
ఏపీలో 59 మందితో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదలైంది. ఈ సారి బీజేపీకి చెందిన ఇద్దరికి ఈ జాబితాలో చోటు దక్కింది. అలాగే 15 మంది జనసేన నేతలకు అవకాశం లభించింది. గత ఎన్నికలలో సీట్లు త్యాగం చేసిన నేతలు, మీడియాలో తెలుగుదేశం భావజాలాన్ని బలంగా వ్యక్తం చేసిన వారికి, అలాగే విపక్షంలో ఉండగా అప్పటి అధికార వైసీపీ దాడులను ఎదుర్కొన్న వారికి ఈ సారి జాబితాలో స్థానం కల్పించారు.
ఎపిలో శ్రీకాళహస్తిలో హల్ చల్ చేసిన అఘోరీ తాజాగా నంద్యాలజిల్లా పాణ్యం మండలం బలపనూరులో మరోసారి కనిపించారు. ఎపిలో వరుసగా శైవక్షేత్రాలను దర్శించుకుంటున్న అఘోరీ శనివారం నంద్యాల రోడ్డుపై బైఠాయించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక దఫా జాబితా వచ్చిన సంగతి తెలిసిందే. రెండో జాబితాను 59 మందితో ఎపి ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కూడా ఉన్నారు. ఆయనకు కేబినేట్ ర్యాంకు దక్కింది.
జాఫర్ బాయ్ కొడుకు ఫజల్ బాబా డ్రగ్స్ కు అలవాటయ్యాడు. ఆందోళన చెందిన జాఫర్ భాయ్ కొడుకును ప్రతీరోజు చితకబాదేవాడు. ఫజల్ బాబా తల్లి జాఫర్ భాయ్ ను వెంటపెట్టుకుని ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేతిలో చావు దెబ్బతిన్న వైసీపీ ఖేల్ ఇక ఖతం కాబోతోందా? ఏపీలో ఐదేళ్లు అరాచక పాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డి.. త్వరలో తన దుకాణం మూసేయనున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేగంగా వేస్తున్నది.
గత వైసీపీ ప్రభుత్వ హాయంలో మాదకద్రవ్యాలకు ఎపి హబ్ గా మారిందని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. విశాఖ సీ పోర్ట్ ని లో 25 కిలోల గంజాయి కంటైనర్ సిబిఐ స్వాధీనం చేసుకున్నప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదని పవన్ కళ్యాణ్ కేంద్ర హోమంత్రి అమిత్ షాకు ట్వీట్ చేశారు
చిన్న స్థాయి నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు, సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు.