పొత్తు పొడిచిందా?.. మన పని గోవిందా.. వైసీపీలో గుబులు

Publish Date:Oct 20, 2022

Advertisement

నిన్నటి వరకూ పార్టీ టికెట్ మాకే అన్న ధీమాతో ఉన్న వైసీపీ మంత్రులూ, ఎమ్మెల్యేలూ   ఇప్పుడు ఆ ధీమాను కోల్పోయారని  ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సాధారణంగా ఎన్నికల ముందు అధికార పార్టీ సిట్టింగులు మరో సారి టికెట్ మాదే అన్న ధీమాతో ఉంటారు. అయితే విచిత్రంగా వైసీపీలో మాత్రం సిట్టింగులలో ఆ ధీమా కనపడటంలేదు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం పాలనా వైఫల్యాలతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంది.  

ప్రభుత్వ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాల్సిన సీఎం జగన్ మాత్రం ప్రభుత్వ గ్రాఫ్ పడిపోవడానికి ఎమ్మెల్యేల పనితీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను క్రమం తప్పకుండా బటన్లు నొక్కుతూ లక్షలకు లక్షల సొమ్ము లబ్ధిదారుల ఖాతాలోకి బదలీ చేస్తుంటే.. తనపై ఆగ్రహం ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఆగ్రహం అంటూ ఏమైనా ఉంటే అది ఎమ్మెల్యేల పని తీరు వల్లేనని ఆయన వర్క్ షాపుల్లోనూ, సమావేశాల్లోనూ కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.

ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేలైనా, మంత్రలైనా ప్రజాక్షేత్రంలో అభిమానాన్ని చూరగొటేనే పార్టీ టికెట్ అని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. అందుకే ఎక్కడా లేని విధంగా అధికారంలో ఉండి కూడా వైసీపీ నాయకులలో ఓటమి భయం కనిపిస్తోంది. జగన్ తీరుతో ఇప్పటికే భవిష్యత్ ఏమిటా అన్న ఆందోళనలో ఉన్న వైసీపీ నేతలకు తాజాగా తెలుగుదేశం, జనసేన పొత్తుపై వస్తున్న వార్తలు మరింత ఆందోళనలోకి నెట్టాయి.

తెలుగుదేశం, జనసేన పార్టీలే వేర్వేరుగా పోటీ చేస్తేనే విజయావకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయని సర్వేల నివేదికలు వెల్లడిస్తుంటే.. ఇప్పుడా రెండు పార్టీలూ కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఇక ఆశలు వదిలేసుకోవలసిందే అని పార్టీ శ్రేణులే చెబుతున్న పరిస్థితి. తెలుగుదేశం, జనసేన పొత్తు వార్తల నేపథ్యంలో జగన్ పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో సరికొత్త ఫార్ములాతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి బరిలోకి దిగితే.. ఒక లెక్క.. వేర్వేరుగా పోటీకి దిగితే మరో లెక్క అని ఆయన చెబుతున్నారని అంటున్నారు. ఆ ఇరు పార్టీలూ కలిసి ముందుకు సాగితే.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలో పార్టీ టికెట్లు అత్యధిక శాతం బీసీలకే కేటాయించేందుకు నిర్ణయించుకున్న జగన్ అక్కడ వైసీపీ సిట్టింగులకు ప్రజాబాహుల్యంలో ఆదరణ ఉన్నా కూడా వారిని మార్చి బీసీలనే పోటీకి నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారంటున్నారు. అందుకే ఇప్పటికే తయారైన అభ్యర్థుల జాబితాకు తోడుగా రెండో జాబితా కూడా తయారౌతోందని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలోప్రధానంగాకాపు సామాజిక బలమైన నాయకులు ఉన్న స్థానాలలో కూడా అధికారంలో ఉండి కూడా వైసీపీ మంత్రులూ, నాయకులకూ నేల కింద భూమి కదిలిపోతున్నట్లుగా అనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి వారిలో ఎక్కడ లేనీ టెన్షన్ కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నిక లొస్తున్నాయంటే విపక్ష నేతలలో టెన్షన్ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం విచిత్రంగా ఆ టెన్షన్ అధికార పార్టీ నాయకులలో కనిపిస్తోంది.

పార్టీ టికెట్ వస్తుందా? వచ్చినా గెలుస్తామా? అన్న బెంగా, భయం వారి ప్రతి మాటలోనూ, ప్రతి చేష్టలోనూ కనిపిస్తోంది. ఈ టెన్షన్, ఆ భయం కారణందగానే ఇటీవల వారసుల టికెట్ల విషయమై మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ మాకే దిక్కులేదు ఇక వారసుల్ని గెలిపించుకోగలమా అని వ్యాఖ్యానించారు. అసలు ఎమ్మెల్యేలూ, మంత్రులకు ఈ మూడున్నరేళ్లలో నియోజకవర్గ ప్రజలలో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఒక్క పని కూడా చేసిపెట్టలేని ఆశక్తత, ఒక్క పింఛన్, ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేని నిస్సహాయత, కనీసం నియోజకవర్గంలోని రోడ్లకు గుంతలు కూడా పూడ్పించలేకపోయిన అసమర్థత వారిని నియోజవకర్గానికి దూరం చేశాయనే చెప్పాలి. అందుకే ఇప్పుడు గడపగడపకూ అంటు జనం వద్దకు వెళుతుంటే వారు నిర్మొహమాటంగా మొహం మీదనే తలుపులు వేసే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనాగ్రహ సెగలను తట్టుకోలేక గడపగడపకూను మమ అనిపిస్తే సీఎం కన్నెర్ర చేస్తున్నారు. ఈ పరిస్థితిల్లో వైసీపీ నాయకులూ, మంత్రులూ  నానా అగచాట్లూ పడుతున్నారు.  ఉన్న ఇబ్బందులు చాలవన్నట్లు తాజాగా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు వారి ఇబ్బందులను రెట్టింపు చేశాయి.  ప్రజాసమస్యలపై కలిసి పోరాడుతాం అంటూ తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటనతో పార్టీ టికెట్ దక్కినా గెలవడం సాధ్యం కాదన్న నిర్వేదం వారిలో కనబడుతోంది. ఆ విషయాన్ని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పటికే ప్రజాగ్రహ జ్వాలలలో ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట మసకబారిందన్న అంచనాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేనల కలయిక పార్టీ పరిస్థితిని మరింత దయనీయ స్థితికి చేర్చిందని వైసీపీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఇప్పటి దాకా 175 కి 175 సీట్లు మనకే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన వైసీపీ అధినాయకత్వం  ఇప్పుడు తెలుగుదేవం, జనసేన జుగల్ బందీ వార్తలతో బెంబేలెత్తుతోంది. ఇరు పార్టీలూ పొత్త కుదుర్చుకుని ముందుకు సాగితే.. వైసీపీకి కష్టమే అన్న భావన పరిశీలకులలోనే కాదు.. పార్టీలో కూడా గట్టిగా వ్యక్తమౌతోంది. దీంతో ఇప్పటి వరకూ ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో కాపుల ఓట్లపై ఆశలు పెట్టుకుని పార్టీ టికెట్ల విషయంలో కూడా కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తూ వచ్చిన వైసీపీ అధినేత ఇప్పుడు వ్యూహం మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఆయన ఇప్పుడు బీసీలకు అత్యధిక టికెట్లు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం, జనసేనల కలయిన ద్వారా పార్టీకి జరిగే నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు వైసీపీలోని కీలక నేతలే ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు.

ఇదే ఇప్పటి వరకూ తమకు డోకా లేదని భావిస్తూ వస్తున్న సిట్టింగ్ లకు గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టికెట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక ముందు మరో లెక్క అని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలన్న విషయంపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టిన జగన్ రెండు జాబితాలను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఓ జాబితా, వేర్వేరుగా పోటీలో దిగితే మరో జాబితా అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  

By
en-us Political News

  
అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు.
లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమరావతికి చట్టపరమైన రక్షణ దిశగా అత్యంత కీలక ముందడుగు పడినట్లైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, విస్తృత చర్చ అనంతరం మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును సభ ఆమోదించింది. సభలో ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది.
హిట్ అండ్ రన్ నేరాల కంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన పార్టీగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దుయ్యబట్టారు. అలవోకగా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైసీపీ పేరు చెప్పకుండానే ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.
గతంలో అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక రంగు మార్చి మూడు రాజధానులన్నారని దుయ్యబట్టారు. జగన్ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవన్నారు.
జగన్ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది. 2014-19 మధ్యకాలంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి, తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ, చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా మంగళవారం ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు.
జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.