అసెంబ్లీ వద్ద తొపులాట.. కిందపడిపోయిన హరీష్ రావు.. స్వల్పంగా గాయపడిన కేటీఆర్.!

Publish Date:Sep 7, 2026

Advertisement

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే   తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద నల్ల చొక్కాలు, నల్ల టీషర్టులు ధరించి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్   నేతలు, ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.  ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే ఉద్దేశంతో అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, మాజీ మంత్రి కేటీఆర్, జగదీష్ రెడ్డి తదితరులను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు  బీఆర్ఎస్ నాయకుల మధ్య  తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి కిందపడిపోయారు. కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. తోపులాట, ఉద్రిక్తతల మధ్యే పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. 

ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు హరీశ్ రావును పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి, అక్కడి నుంచి తరలించారు.

పోలీసుల తీరు దారుణంగా ఉందంటూ, అసెంబ్లీ ఎంట్రన్స్ వద్దే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల భూములు, ఇళ్లను నిషేధిత 22ఏ జాబితాలో చేర్చి వేధిస్తున్నారని నిలదీయడానికే తాము నిరసన చేపట్టామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.  

[Tenssion At Telangana assembly, harish rao arrest, ktr, brs leaders arrested, Harish Felldown, KTR Injured, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.