చెంపదెబ్బ ఘటనపై శివకుమార్ కొత్త స్క్రీన్ ప్లే!

Publish Date:May 16, 2024

Advertisement

తెనాలి ప్రస్తుత ఎమ్మెల్యే, ఘోర పరాజయం పాలవబోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కేవలం ఫైట్ మాస్టరే అని ఇప్పటి వరకూ అనుకుంటూ వచ్చాం కదా.. ఆయన కేవలం ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయితగా కూడా మంచి టాలెండెడ్ అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. 

గొట్టిముక్కల సుధాకర్ అనే తెనాలి ఓటర్ కొట్టిన గాఠ్ఠి చెంపదెబ్బ నుంచి కాస్త కోలుకున్న అన్నాబత్తుని శివకుమార్ ఇప్పుడు కొత్త స్క్రీన్ ప్లేతో జనం ముందుకు వచ్చారు. వాస్తవానికి పోలింగ్ రోజు జరిగిందేమిటంటే, తెనాలి ఐతానగర్లో వున్న పోలింగ్ స్టేషన్‌కి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన భార్యతో కలసి ఓటు వేయడానికి వచ్చారు. డైరెక్ట్.గా పోలింగ్ బూత్ దగ్గరకి వెళ్ళబోయారు. 
అప్పటికే క్యూలో నిరీక్షిస్తున్న గొట్టిముక్కల సుధాకర్ మీరెలా డైరెక్ట్.గా  బూత్ దగ్గరకి వెళ్తారు. మీరు కూడా క్యూలో రావాలి అన్నారు. అంతే, శివకుమార్ శివాలెత్తిపోయారు. గొట్టిముక్కల సుధాకర్ దగరకి వెళ్ళి ఆయన చెంప మీద కొట్టారు. దాంతో గొట్టిముక్కల సుధాకర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. శివకుమార్ కొట్టినదానికంటే డబుల్ కోటాలో రివర్స్ గిఫ్ట్.గా చెంప ఛెళ్ళుమనిపించారు. దాంతో శివకుమార్ అనుచరులు సుధాకర్ మీదపడి చావగొట్టారు. ఆ తర్వాత పోలీసులు సుధాకర్ మీద కేసు పెట్టారు. ఎన్నికల కమిషన్ జోక్యంతో శివకుమార్‌ని హౌస్ అరెస్టు చేశారు.

సుధాకర్‌ని శివకుమార్ చెంపదెబ్బ కొట్టిన సంగతేమోగానీ, శివకుమార్‌ని సుధాకర్ లాగిపెట్టి కొట్టడం హైలైట్ అయింది. ఓటర్ని కొట్టినందుకు శివకుమార్‌కి తిక్క కుదిరిందన్న అభిప్రాయం అంతటా వ్యాపించింది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఈ వార్త దావానలంలా వ్యాపించి, ఓటింగ్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. అసలే ఓటమి బాటలో వున్న శివకుమార్ ఈ ఘటన పుణ్యమా అని ఓటమి కన్ఫమ్ చేసుకున్నారు.

ఓటర్ని కొట్టి, ఓటర్ చేత కొట్టించుకున్న ఘటనలో పరువు పూర్తిగా పోగొట్టుకున్న శివకుమార్ ఇప్పుడు సరికొత్త స్క్రీన్ ప్లేతో రిపేరింగ్ వర్క్ మొదలుపెట్టారు. ‘‘నేను, నా భార్య ఓటు వేయడానికి వెళ్ళాం. అక్కడ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నన్ను దూషించడం మొదలుపెట్టాడు. ఎమ్మెల్యేగా మాల, మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ నన్ను దుర్భాషలాడాడు. వైసీపీపై ద్వేషంతో రగిలిపోయాడు. నా భార్య ముందే నన్ను తిట్టాడు. నేను పోలింగ్ బూత్‌లోకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తిడుతూనే వున్నాడు. తాను కూడా నా సామాజిక వర్గం వాడే అయినప్పటికీ, నువ్వు మన సామాజిక వర్గం వాడినేనా అని తిట్టాడు. పోలింగ్ బూత్ దగ్గర మద్యం మత్తులో అతను చాలామందితో దురుసుగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న ఓటర్లే చెప్పారు’’ అని కొత్త స్టోరీ అల్లి చెబుతున్నారు.

తన అహంకారంతో జరిగిన సంఘటన మధ్యలోకి శివకుమార్ కులాలని కూడా లాక్కొచ్చారు. తన భార్యని కూడా ఇన్వాల్వ్ చేశారు. మిస్టర్ శివకుమార్.. ఓటర్ని కొట్టి నువ్వు చేసింది పెద్ద తప్పు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం కొత్త స్క్రీన్ ప్లే క్రియేట్ చేయడం, కులాలని, మీ భార్యని ఈ ఇష్యూలోకి లాగడం ఇంకా పెద్ద తప్పు. అర్థమవుతోందా?

By
en-us Political News

  
ఇటీవలికాలంలో విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. హైదరాబాద్ శంషాబాద్ వియానాశ్రయంలో  ఏకంగా ఆరు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ సిబ్బందికి ఎదురయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడు పార్టీల నేతల మధ్యా సయోధ్య చక్కగా కుదిరింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్ని నిర్ణయాలలోనూ సమష్టిగా ముందుకు సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబపరంగానూ, రాజకీయంగానూ పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఆయన కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని స్థాపించినప్పుడు ఆయనకు రాజకీయాలకు అతీతంగా వైఎస్ అభిమానులందరి మద్దతూ లభించింది. ఇటు కుటుంబం కూడా ఆయన వెన్నంటి నడిచింది. ఇలా అన్ని వైపుల నుంచీ, అందరి నుంచీ మద్దతు లభించడం వల్లనే ఆయన తన వైసీపీ పార్టీని ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లూ నడపగలిగారు, 2019 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగలిగారనడంలో సందేహం లేదు.
సీబీఐ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ గా వెంకట సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వెంకట సుబ్బారెడ్డి ఐపీఎస్ ను సీబీఐ డిఐజీగా నియమిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆయన పదవిలో కొనసాగుతారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్​కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రెండు కోట్లు ఇవ్వకుంటే ఖతం చేస్తామని  ఓ గుర్తు తెలియని వ్యక్తి  ముంబయి ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పంపాడు. దీంతో వర్లీ పోలీసులు అతనిపై  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జన్వాడ పార్టీ రేవ్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల బుధవారం పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో మోకిలా పోలీసులు రాజ్ పాకాల, విజయ్ మద్దూరీ పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు.
కడపలో అన్న క్యాంటిన్ లో స్వల్ప ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అన్న క్యాంటిన్ వంటశాల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది.
ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తగలక తప్పదా? 2022-23 సంవత్సరం ఇంధన,విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీలు రూ.8114 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ విద్యుత్ నియంత్రణమండలికి డిస్కమ్ లు ప్రతిపాదించడం తెలిసిందే. చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పడమే కాకుండా, వీలయితే 30శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చినప్పటికీ విస్తరణకు మాత్రం ముహూర్తం ఖరారు కాలేదు. కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన వెళ్లి వచ్చారు. అయినా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది.
మంత్రి కొండాసురేఖపై పరువు నష్టం దావావేసిన నేపథ్యంలో గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.  నాగార్జున కుటుంబంపై కొండాసురేఖ స్టేట్ మెంట్ తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఉందని మాజీ మంత్రి కెటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇటీవలి కాలంలో విమానాల్లో బాంబులు పెట్టామంటూ బెదరింపు కాల్స్ రావడం ఎక్కువైంది. గత కొన్ని రోజులుగా విమానాశ్రయాలకు బాంబు బెదరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా బుధవారం (అక్టోబర్ 30) శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికీ బాంబు బెదరింపు కాల్ వచ్చింది.
ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించిన నారా లోకేశ్... ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో పాల్గొన్నారు. లాస్ వెగాస్ లో జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొన్నలోకేష్ పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను ప‌ట్టిన కుదేలుకు మూడే కాళ్లు అని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో దిట్ట‌. జ‌గ‌న్ మూర్ఖత్వానికి జైజైలు ప‌లికేందుకు వైసీపీ ముఖ్య‌నేత‌లు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. దీనికితోడు వైసీపీ సొంత మీడియా, ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఉండనే ఉంది. ప్ర‌జ‌ల‌ను పిచ్చివాళ్లు అన్న‌ట్లుగా వారు ట్రీట్ చేస్తారు. తామేంచెబితే అది జనం న‌మ్మేస్తార‌ని వారి న‌మ్మ‌కం. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో ప్ర‌జ‌లు విసుగు చెందారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.