లోకేష్ సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా ఉండేందుకు ఇష్టపడతారా?
Publish Date:Feb 26, 2026
Advertisement
తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ 14వ సంచికలో తాజా రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘డిన్నర్ డిప్లమసీ’ నడుస్తోందా? అని కంఠంనేని రవిశంకర్ ప్రశ్నించగా, దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, మంత్రి నారా లోకేష్ తాను చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి విందు దౌత్యాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును ఎంతగా ఒత్తిడి చేస్తే పనులు అంత త్వరగా జరుగుతాయని కూడా వ్యాఖ్యానించారు. దీనిపై రవిశంకర్ స్పందిస్తూ ఇది కొత్త కాన్సెప్ట్ అని అన్నారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. లోకేష్ సీఎంగా , పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండేందుకు ఇష్టపడతారా? అని రవిశంకర్ కంఠంనేని ప్రశ్నించారు. మరోవైపు, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని నేరుగా ప్రధానిని అడిగారని పరిస్థితి లేదని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో లోకేష్‌కు ఆ స్థాయి సాన్నిహిత్యం లేదని కూడా తెలిపారు. ప్రజా కార్యక్రమాల్లో లింగం రమేష్, సాన సతీష్, కిలారు రాజేష్ ఎక్కడ ఉన్నారు? అని డోలేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతోందని కంఠంనేని రవిశంకర్ అడిగారు. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో ఈ సాయంత్రం 7 గంటలకు తప్పక వీక్షించండి.
http://www.teluguone.com/news/content/teluguones-vastava-vedika-14th-edition-39-214688.html




