Publish Date:Mar 24, 2023
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రకటించారు. మొత్తం 23 విభాగాలకు గాను వందల సంఖ్యలో జర్నలిస్టులు పోటీ పడగా.. వారి ప్రతిభ, వారు రాసిన కథనాల ఆధారంగా ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేశారు. ఈ పురస్కార గ్రహీతల జాబితాను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాలో తెలుగు వన్ రెండు ప్రతిష్టాత్మక విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. సినిమా విభాగంలో సీనియర్ జర్నలిస్టు బుద్ధి యజ్ఞమూర్తి, అగ్రికల్చర్ విభాగంలో సీనియర్ జర్నలిస్టు ఎస్. కె సలీం ఉత్తమ జర్నలిస్టులుగా పురస్కారాలు గెలుచుకున్నారు.
అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్య పరిచే బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న పాత్రికేయులను ఉగాది పురస్కారాల ద్వారా సత్కరించి, గౌరవించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు అన్నారు. అక్షరాన్నే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఇటువంటి ప్రోత్సాహం ఎంతగానో ఉత్తేజాన్నిస్తుందని చెప్పారు. జర్నలిస్టు సంఘాలంటే పోరాటాలకు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే మూస ధోరణిని దాటి.. జర్నలిస్టులను వృత్తిపరంగా ప్రోత్సాహించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. త్వరలోనే ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/teluguone-bags-2-best-journalist-awards-25-152870.html
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..