జగన్ ఇలాకాలో చరిత్రలో నిలిచిపోయేలా పసుపు పండుగ

Publish Date:May 15, 2025

Advertisement

జగన్ ఇలాకా కడప జిల్లాలో పసుపు దళం పార్టీ పండుగ చేసుకోనుండటం హాట్ టాపిక్‌గా మారింది. కడపలో టీడీపీ మహానాడు మూడు రోజుల  పాటు నిర్వహించడానికి నిర్ణయించింది.  2024 అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి మహానాడుకు కడప వేదిక అవ్వడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించేందుకు ప్లాన్ చేయడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లకు రంగం సిద్దమవుతోంది.

తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి మహానాడును ప్రత్యేకంగా ప్లాన్ చేసింది టీడీపీ అధిష్టానం. ఈసారి మహానాడు విశేషం ఏంటంటే  టీడీపీ చరిత్రలో ఎన్నడూ నిర్వహించని చోట మహానాడు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహానాడుకు కడప జిల్లాను ఎంచుకుంది టీడీపీ.  ఇప్పుటికే ఏర్పాట్లను మొదలుపెట్టేసింది.  వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాకాలో పసుపు పండగను ఘనంగా నిర్వహించేందుకు యాక్షన్‌లోకి దిగింది. గతంలో ఎన్నడూ కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు. కానీ ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ...మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో మహానాడుని నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మహానాడు నిర్వహిస్తారనే ప్రచారం కూడా నడించింది. కానీ జిల్లా నాయకుల సూచనలతో కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. పార్టీ ఏపీలో  బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. గెలిచిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు ఇదే కావడంతో అత్యంత ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఒక వైపు అమరావతి పున:నిర్మాణ పనులు మొదలుపెట్టి, అభివృద్ధి పనులకు వరసగా శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ఎటు చూసినా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా టీడీపీకి అంతా కలసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఈసారి గతానికి భిన్నంగా గొప్పగా మహనాడు నిర్వహించాలని భావిస్తున్నారు.

మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు వసతి, రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు. పార్టీ సిద్దాంతాలు, నాలుగు దశాబ్దాల ప్రయాణంలో సాధించిన విజయాలు, నేడు ప్రభుత్వ విజయాలు మహానాడులో విస్తృతంగా చర్చించనున్నారు.  మొదటి రోజు పార్టీ పరమైన అంశాలపై, రెండోరోజు  ప్రభుత్వ పరంగా అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. మూడో రోజు లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు దాదాపు పది లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమవో ఈ నెల 18, 19, 20వ తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహిస్తారు. 22, 23 వ తేదీల్లో పార్లమెంటు వారీగా మినీ మహానాడు జరుగుతుందంటున్నారు. 

 నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా మహానాడు వేడుక నిర్వహించడానికి యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. ఇక జగన్ జిల్లాలో మహానాడు నిర్వహించడం ద్వారా రాజకీయంగా గట్టి సంకేతాలు ఇవ్వాలనే ప్లాన్‌లో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ జిల్లాలో పట్టభద్రల ఎమ్మెల్సీ స్ధానాన్ని గెలుచుకోవడం,తర్వాత జరిగి సార్వత్రిక ఎన్నికల్లో  కూటమి జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు స్థానాలు గెలుచుకుని జగన్ సొంత జిల్లాలో సత్తాను చాటింది. ఇలాంటి తరుణంలో మహానాడు నిర్వహించడం ద్వారా రాయలసీమలో పార్టీని మరింత బలోపేతం చేయాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

సీమకు సాగు నీళ్లిచ్చింది, ఫ్యాక్షన్ ను అంతం చేసింది టీడీపీనే. పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, హార్టికల్చర్ సాగుతో సీమ సీను మారిపోయింది.  ఈ నేపథ్యంలోనే చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పట్టుదలతో ఉన్నారు. మొదటిసారి కడపలో నిర్వహిస్తున్న మహానాడుతో రాయలసీమ పార్టీ శ్రేణులో నూతనోత్సాహం నెలకొంది. 

పులివెందులలో మహానాడు ఎందుకు నిర్వహించడంలేదు అంటే అన్ని ప్రాంతాల నుంచి జనాలు వచ్చేందుకు సువిశాలమైన ప్రాంగణం అక్కడ దొరకలేదు  అంటున్నారు. కడప నుంచి సౌండ్ చేస్తే అది జిల్లా మొత్తమే కాదు ఏపీ అంతటా రీసౌండ్ ఇచ్చేలా చేయాలనే కడపను ఎంచుకున్నారని అంటున్నారు. మరి కడపలో టీడీపీ మహానాడు ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి

By
en-us Political News

  
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.