Publish Date:Jun 30, 2025
ఉభయ తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులు ఎవరో తేలిపోయింది? ఇంతవరకు అనేక కోణాల్లో, అనేక సమీకరణలు ఆధారంగా లెక్కలు కట్టిన కమల దళం చివరకు నాగపూర్ ఎంపిక చేసిన పాత కాపులకే పట్టం కట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్, తెలంగాణకు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లను, బీజీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఇద్దరు నేతలకు ఆధిస్థానం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
నిజానికి.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నాయకులు చాలా మంది పోటీ పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొదలు, పాత, కొత్త నాయకులు చాలా మందే రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు.
ఇక తెలంగాణలో అయితే.. చెప్పనే అక్కర లేదు. ఎంపీలు ఈటల రాజేందర్ , ధర్మపురి అరవింద్, డీకే అరుణ,మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ , బండి సంజయ్ ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ఒక దశలో ఈటల పేరు ఖరారు అయినట్లే ప్రచారం జరిగింది.. అయితే.. చివరి క్షణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బ్యాక్ గ్రౌండ్ ఉన్న పీ మాధవ్, రామచంద్రరావు పేర్లను ఆదిష్ఠానం ఖరారు చేసింది. దీంతో ఇదరి ఎంపిక నాగపూర్ నిర్ణయంగా భావిస్తునారు. నిజనికి ఇద్దరూ కూడా సంఘ్ సిద్దాంత పునాదులపై ఎదిగిన నాయకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ, పీవీ చలపతి రావు కుమారుడు మాధవ్, బీజేపీలో సాధారణ కార్యకర్త మొదలు అనేక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే, రామచంద్ర రావు బాల్యం నుంచి సంఘ్ సంపర్కంలో పెరిగారు ఏబీవీపీ లో క్రియాశీలంగా పనిచేసిన ఆయన బీజేపీలో లీగల్ సెల్ బాధ్యలతో పాటుగా పార్టీ బాధ్యలు నిర్వహించారు.
సోమవారం (జూన్ 30) మధ్యాన్నం 2 గంటల తర్వాత ఏపీలో మాధవ్, తెలంగాణలో రామచంద్ర రావు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోది. అయితే.. ఒక్కరొక్కరే నామినేషన్ వేస్తారా? ఇతరులు కూడా నామినేషన్ వేసే అవకాశ్ ఉందా అనే విషయంలో క్లారిటీ లేదు. తెలంగాణలో మాత్రం ఈటల కూడా నామినేషన్ వేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే రాజాసింగ్ తాను కూడా నామినేషన్ వేస్తానని చెబుతున్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telugu-states-bjp-persidents-selected-39-200936.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?