బీజేపీని తెలుగువారు నమ్మడం లేదు!

Publish Date:May 15, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరించిందన్న భావన తెలుగువారిలో మరీ ముఖ్యంగా ఆంధ్రులలో చాలా బలంగా ఉంది. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహరించిన తీరు.. ఉద్దేశపూర్వకంగా ఏపీకి, ఏపీ ప్రయోజనాలకూ భంగం వాటిల్లే విధంగానే ఉందన్నది ఆంధ్రుల నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తున్నది.

2019 ఎన్నికలలో ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటులో కూడా బీజేపీ విజయం సాధించకపోవడమే కాకుండా, పోటీ చేసిన ఏ స్థానంలోనూ కనీసం డిపాజిట్ కూడా దిక్కించుకోలేకపోయింది. ఆ తరువాత ఏపీలో జరిగిన రెండు ఉప ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీకి అప్పుడు కూడా కనీసం డిపాజిట్ దక్కలేదు. ఇక ఇప్పుడు తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కూడా బీజేపీకి తెలుగువారి ఆగ్రహ జ్వాల సెగ గట్టిగానే తాకింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారు అధికంగా ఉన్న ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. బీజేపీకి ఓటు వేయవద్దంటూ తెలుగువారు స్వచ్ఛందంగా ప్రచారం చేసినట్లు అక్కడి పరిశీలకులు చెబుతున్నారు.

2018లో జరిగిన కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేయవద్దంటూ తెలుగుదేశం పార్టీ ఆ రాష్ట్రంలో గట్టిగా ప్రచారం చేసింది. అయితే తాజా ఎన్నికలలో మాత్రం తెలుగుదేశ పార్టీయే కాదు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ప్రాంతీయ  పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. చివరాఖరికి బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న బీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయలేదు. ఆ రాష్ట్రంలో బీడీఎస్ కు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ఎక్కడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. ఆ విషయాన్ని జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయంగా చెప్పి బీఆర్ఎస్ అధినేతపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.

ఇక కర్నాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉంటే ఎనిమిది జిల్లాల్లోని 49 స్థానాలలో బీజేపీ కేవలం ఆరు అంటే ఆరు స్థానాలలోనే విజయం సాధించడమే తెలుగు ప్రజలు బీజేపీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీ, తెలంగాణ  సరిహద్దు జిల్లాలు సహా దాదాపుగా ఎనిమిది జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. దీనిని బట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారని తేలుతోంది.   సరిహద్దు జిల్లాలైన కోలార్ , యాద్గిర్, చిక్ బళ్లాపూర్ బళ్లారి జిల్లాలో బీజేపీకి కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా దక్కలేదు.  ఇక మొత్తంగా తెలుగు వారి ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న జిల్లాలు కర్నాటకలో రమారమి 10 వరకూ ఉంటాయి. ఆ పది  జిల్లాలలోనూ కలిపి బీజేపీ గులుచుకున్నవి 9 స్థానాలు మాత్రమే. 

By
en-us Political News

  
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.