సంగీత దర్శకుడు జెవి రాఘవులు అస్తమయం
Publish Date:Jun 7, 2013
Advertisement
జననీ జన్మ భూమిశ్చ లాంటి దేశభక్తి గీతాలు.. చినుకు చినుకుగా లాంటి విరహగీతాలు. ఇంట్లో రామయ్య వీదిలో కృష్ణయ్య లాంటి హుషారెత్తించే పాటలు.. ఈ జీవన తరంగాలలో లాంటి వేదాంత గీతాలు.. ఆయన స్వరం చేయని పాటలేదు.. ఆస్వరం పాడని పాటా లేదు.. ఆయన సుమధుర సుస్వర సంగీత దర్శకుడు జెవి రాఘవులు.. ఎన్నో మరపురాని మథుర గీతాలను అందించిన రాఘవులుగారు ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.. తెలుగు సినిమాకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఈ సంగీత ప్రవాహానికి నివాళులర్పిద్దాం.. ఘంటసాల ప్రియశిష్యుడిగా ప్రస్థాన్నాన్ని ప్రారంభించిన ఆయన ఎన్నో మరుపురాని గీతాలతో గాయకుడిగా మరెన్నో విజయవంతమైన చిత్రాలతో సంగీత దర్శకునిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.. దాదాపు 112 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు..
నాటకాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తరువాత రేడియోలో పాటలు పాడేవారు.. ఒకసారి రికార్డింగ్‌లో ఆయన పాట విన్న ఘంటసాల గారు ఆయన్ను తన శిష్యునిగా స్వీకరించి ఆయన సినీ ప్రయాణానిరి బాటలు వేశారు..
ఘంటసాల పిలుపు అందుకున్న రాఘవులు గారు మరో ఆలోచన లేకుండా కనీసం ఇంట్లో తన తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా మద్రాసు ట్రైన్ ఎక్కేశారు.. ఘంటసాల గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరారు..
ఘంటసాల గారు స్వరపరిచిన ఎన్నో సినిమాల్లో రాఘవులు గారు పాటలు పాడారు.. వాటిలో లవకుశ, జగదేకవీరుని కథ, పరమానందయ్య శిష్యుల కథ లాంటి సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలతో జెవి రాఘవులుకు గాయకునిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది..
కేవలం ఘంటసాల గారితోనే కాదు.. కెవి మహదేవన్, ఎమ్ ఎస్ విశ్వనాధన్ సంగీత దర్శకుల సినిమాలలో కూడా చాలా పాటలు పాడారు.. సంగీత దర్శకునిగా మారకముందే వందల సంఖ్యలో పాటలు పాడారు..
కెవి మహాదేవన్ సంగీతం అందించిన ప్రేమ్‌నగర్ సినిమాలో కూడా ఓ పాట కంపోజ్ చేశారు రాఘవులు.. వ్యక్తిగత కారణాలతో ఓ పాట చేయకుండానే మహదేవన్‌గారు తప్పుకోవడంతో ఆ సినిమాలోని ఎవరి కోసం పాటను రాఘవులుగారు కంపోజ్ చేశారు..
1970లో ఘంటసాలగారి మరణంతో తప్పని పరిస్థితుల్లో ద్రోహి సినిమాతో పూర్తి స్థాయి సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు రాఘవులు.. తరువాత ఎక్కువగా దాసరి, కోడి రామకృష్ణ లాంటి దర్శకుల సినిమాలకు పని చేశారు..
అప్పట్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలందరి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వీరి కాంభినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్స్ కూడా వచ్చాయి..
సినీ రంగం చైన్నైలో ఉన్నన్ని నాళ్లు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందిన రాఘవులు గారికి ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చాకా అవకాశాలు తగ్గిపోయాయి.. దీంతో ఆయన తన సొంత ఊరు రాజమండ్రిలో స్థిరపడిపోయారు.. వందకు పైగా సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన రాఘవులు గారు చివరి దశలో ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు..
ఇలా తెలుగు కళామతల్లికి పాటల పట్టం కట్టిన జెవి రాఘవులు గారు.. ఈ లోకాన్ని విడిచినా ఆయన పాటలతో ఎప్పుడూ మనతో ఉంటారు.. మరోసారి ఆ సంగీత సాగరానికి నివాళులర్పిద్దాం
http://www.teluguone.com/news/content/telugu-music-director-j-v-raghavulu-passes-away-32-23409.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





