టీటీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల..!

Publish Date:Aug 22, 2023

Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 21వ తేదీన తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడన జాబితాను విడుదల చేశారు. దీంతో తెలంగాణలోని మిగిలిన రాజకీయ పార్టీలు టీ కాంగ్రెస్, టీ బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపిక పనిలో ఆయా పార్టీ అధినేతలు నిమగ్నమయ్యారు.  

అలాంటి వేళ.. తెలంగాణ టీడీపీ అభ్యర్థుల ఎంపికకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో ఆగస్ట్ 21వ తేదీన చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్‌తోపాటు రావుల చంద్రశేఖరరెడ్డి భేటీ అయ్యారు. అందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగనున్న అభ్యర్థుల ఎంపికపై వారు ఈ సందర్భంగా కూలంకుషంగా చర్చిస్తున్నారు. 

అయితే తొలి విడతగా కొంత మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేయాలని.. వారిని సైతం ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి విడతగా 36 మంది అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారని సమాచారం. అలాగే మరికొంత మంది అభ్యర్థులతో భేటీ అయి... వారి జాబితాను సైతం మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత వారంత.. దాదాపుగా సైకిల్ దిగి.. కారు పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో పసుపు పార్టీ ప్రాభావం కొంత తగ్గింది. ఇక 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం రెండు సీట్లను మాత్రం గెలుచుకొంది. 

ఆ తర్వాత వారు సైతం కారు పార్టీలోకి జంప్ జిలానీ రాగం ఆలపించడంతో.. తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి నాయకులు లేకపోయినా.. కేడర్ మాత్రం కేసీపీ సిమెంట్‌లాగా చాలా స్ట్రాంగ్‌గా ఉందన్న సంగతి విషయం అందరికీ తెలిసిందే. 

అటువంటి పరిస్థితుల్లో.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్థాపించిన టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ మార్చేశారు. దీంతో బీఆర్ఎస్‌లో తెలంగాణ పదం లేకుండా పోయింది. మరోవైపు 2022, నవంబర్‌లో ఖమ్మంలో టీటీడీపీ శంఖారావం పేరిట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది.  

ఈ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అంతే తెలంగాణలో పసుపు పార్టీ.. రంగు ఏ మాత్రం వెలిసిపోలేదని తెలుగు రాష్ట్ర ప్రజలకు క్లియర్ కట్‌గా అర్థమై పోయింది. అంతే.. ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా.. టీడీపీ మరో సభ నిర్వహించగా.. ఈ సభకు సైతం భారీగా తెలుగు తమ్ముళ్లు పోటెత్తారు. ఈ ఊపు ఉత్సాహంతో ఇంటి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టిందీ టీటీడీపీ. అందులోభాగంగా మొత్తం నియోజకవర్గాల్లోని ప్రతీ మారుమూల ప్రాంతానికి ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు తీసుకు వెళ్లాయి. తీసుకు వెళ్తున్నాయి. 

అందులోభాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు... అలాగే ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లీ మరి వివరిస్తున్నాయి పార్టీ వర్గాలు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో సైతం చైతన్యం విల్లువిరుస్తోంది. అలాగే సైకిల్ పార్టీ శ్రేణుల్లో సైతం నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 

మరోవైపు ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఈ సారి ఎలాగైనా కేసీఆర్ ‌ను గద్దె దింపాలని బీజేపీ అగ్రనాయకత్వం సైతం పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకు వెళ్తోంది. 

అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన నిత్యం  ప్రజల్లోనే ఉంటూ... సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఆయన సారథ్యంలో దౌడు తీయిస్తున్నారు. 

అలాంటి వేళ తెలంగాణలో టీడీపీ సైతం.. ఆయా పార్టీలకు గట్టి పోటీ ఇచ్చి.. సైకిల్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు వచ్చి.. తన సత్తా చాటేందుకు టీడీపీ శ్రేణులు.. పక్కా వ్యూహాంతో కదం తొక్కుతూ ముందుకు సాగుతోన్నాయి.

By
en-us Political News

  
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.