అప్పుడు మోడీ.. ఇప్పుడు కేసీఆర్! జనాలను రోడ్లపై నిలబెట్టారని ఆరోపణలు

Publish Date:Nov 19, 2020

Advertisement

గత మూడు రోజులు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా జనాలే కనిపించారు. మీసేవా కేంద్రాల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిచ్చాయి. జీరాక్స్ సెంటర్లు జనాలతో కిటకిటలాడాయి. ఆధార్, కరెంట్ బిలు, బ్యాంక్ అకౌంట్ ఫారాలు పట్టుకుని మహిళలు గంటల తరబడి లైన్లలో నిలబడ్డారు. పసి పిల్లలను చంకలో ఎత్తుకుని మండు టెండుల్లో కొన్ని గంటల పాటు పడిగాపులు పడ్డారు. వృద్ధులు కూడా తమకు ఆరోగ్యం సహకరించకున్నా లైన్లలో నిల్చున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిల్చున్న జనాలు తోపులాడుకున్నారు. కొన్ని చోట్ల  కుమ్ములాటలు కూడా జరిగాయి. కొందరు క్యూలైన్లలోనే సొమ్మసిల్లి పడిపోగా.. గోల్కొండ మీసేవా కేంద్రం దగ్గర ఓ మహిళ ప్రాణమే పోయింది. ఇదంతా సర్కార్ పంపిణి చేసిన వరద సాయం పొందేందుకు గ్రేటర్ ప్రజలు పడిన పాట్లు.

 

హైదరాబాద్ లో గత మూడు రోజులు కనిపించిన దృశ్యాలు చూసిన వారికి మూడేండ్ల కిందటి పరిణామాలు గుర్తుకువస్తున్నాయి. 2017 నవంబర్ అంటే సరిగ్గా ఇదే కాలంలో పెద్ద నోట్లను రద్దు చేసింది మోడీ సర్కార్. అప్పుడు కూడా జనాలు రోజుల తరబడి ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు క్యూ కట్టారు. తాము దాచుకున్న డబ్బులను తీసుకునేందుకు అవస్థలు పడ్డారు. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలు కట్టిన కొందరు అక్కడే కుప్పకూలి చనిపోయారు. నోట్ల రద్దు సమయంలో అనుభవించిన బాధలు ప్రజలకు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు పది వేల రూపాయల వరద సాయం కోసం హైదరాబాద్ నగరంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యిందని చెబుతున్నారు. 

 

వరదలతో ఇబ్బంది పడిన ప్రతీ కుటుంబానికి గడప దగ్గరికే వచ్చి వరద సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. వరద బాధిత కుటుంబాల లెక్కలన్నీ తమ దగ్గర ఉన్నాయని, వారందరికీ సాయం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని నమ్మకం కలిగించారు. అయితే నెల రోజులు దాటినా వరద బాధితులకు సాయం అందలేదు. 5 వందల కోట్ల రూపాయలు వరద సాయంగా పంపిణి చేశామని ప్రభుత్వం ప్రకటిస్తుండగా.. వరద బాధితులు మాత్రం తమకు సాయం అందలేదంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దీంతో సర్కార్ పంపిణి చేసిన నగదు ఎక్కడికి వెళ్లిందో, ఎవరు నొక్కేశారో తెలియడం లేదు. వరద బాధితుల ఆందోళనలు పెరగడంతో దిగొచ్చిన సర్కార్... అందరికి సాయం చేస్తామని మీసేవా కేంద్రాల ద్వారా అప్లయ్ చేసుకోవాలని సూచించింది.‘మీ సేవ’ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే సాయం జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 

 

ప్రభుత్వ ప్రకటనతో వరద సాయం కోసం ప్రజలు ఎగబడ్డారు. వరద బాధితులంతా మీసేవా కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తుదారులకు సోమవారం ఒక్క రోజే రూ.55 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు చెప్పారు. ఎలాంటి పరిశీలన లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి పది వేలు మంజూరవుతున్నాయనే అభిప్రాయం రావడంతో ప్రజలు లక్షల సంఖ్యలోనే క్యూ లైన్లలో నిలబడడం మొదలుపెట్టారు. దీంతో మంగళ, బుధవారాల్లో ‘మీ సేవ’ కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. దరఖాస్తుల వెల్లువ తట్టుకోలేక కంప్యూటర్ సర్వర్ సైతం ఆగిపోయిందంటే జనాలు ఏ రేంజ్ లో వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క రూపాయి దరఖాస్తు ఫారం 20 రూపాయలకు, రూ.45 సర్వీసు చార్జి రూ.150 వరకూ పెరిగింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ అవకతవకలను నిలువరించడంలో విఫలమైంది.

 

వరద సాయం పంపిణీలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు బదులుగా స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నేతలు పంపిణీ చేస్తుండడంతో ఇది టీఆర్ఎస్ ఇస్తున్న సాయం అనే అభిప్రాయాన్ని కలిగించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓట్లకు పంచుతున్న నోట్లు అనే విమర్శలు వెల్లువెత్తాయి. వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓట్ల కోసం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసిందని విపక్ష నేతలు ఆరోపించారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలైన సొమ్మునే ప్రభుత్వం నగదు రూపంలో పంచుతూ తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే.. కరోనా లాక్ డౌన్ సమయంలో నేరుగా అందరి అకౌంట్లలో డబ్బులు వేసినట్లు 10 వేలు కూడా వేస్తే సరిపోయేదని చెబుతున్నారు. ఓట్ల కోసం జనాల ప్రాణాలతో చెలగాటమాడారని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. వరద సాయం కోసం కరోనాను లెక్క చేయకుండా జనాలు గుంపులుగుంపులుగా ఒకచోట చేరారని.. దీని ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తే బాధ్యులు ఎవరిని ఆయన ప్రశ్నించారు. 

 

ఇప్పటికీ ఎంతమందికి వరద సాయం అందిందో, ఇంకా ఎంతమందికి అందాల్సి ఉందో ప్రభుత్వం లెక్కలను వెల్లడించడంలేదు. ఈ ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా అమలు చేయలేకపోయిది. వరదలకు ఇబ్బంది పడని కుటుంబాలకు సైతం స్థానిక అధికార పార్టీ నేతలు నగదు సాయం అందించడంతో నిజమైన బాధితులకు సాయం అందకుండా పోయింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ పథకం అర్ధంతరంగా ఆగిపోవడంతో నిజమైన వరద  బాధితులకు ప్రభుత్వం సాయం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల్లో అధికార పార్టీకి ఇది  ఇబ్బందిగా మారవచ్చని భావిస్తున్నారు. సాయం అందని వరద బాధితులు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. వారంతా గ్రేటర్ ఎన్నికల్లో కారుకు వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.