విభజన కాకుండానే రికార్డుల విధ్వంసమా?

Publish Date:Oct 17, 2020

Advertisement

ఏపీ రికార్డులు కూడా ధ్వంసం చేస్తారా?

 

హక్కుల కమిషన్ తీరుపై అభ్యంతరాలు

 

ఏపీలో హక్కుల కమిషన్ నియమించని ఏపీ

 

హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయని జగన్ సర్కార్

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఇంకా విభజన జరగలేదు. కోర్టు ఆదేశాలతో ఒక్క తెలంగాణ రాష్ర్టమే, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ ఇంతవరకూ ఏపీ సర్కారు హక్కుల కమిషన్‌ను నియమించలేదు. ఉద్యోగుల విభజన జరగలేదు. అయినప్పటికీ తెలంగాణ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే, ఏపీ మానవహక్కుల కమిషన్ కొన సాగుతోంది. ఏపీ హక్కుల కమిషన్ కార్యాలయ చిరునామా కూడా, హైదరాబాద్‌లోని గృహకల్ప కార్యాలయంలోనే ఉండటం మరో విచిత్రం. ఇప్పటికీ హక్కుల ఉల్లంఘనపై ఏపీ నుంచి వచ్చే ఫిర్యాదులన్నీ, తెలంగాణ హక్కుల కార్యాలయమే తీసుకోవడం మరో విచిత్రం. ఇన్ని విచిత్రాల నడుమ.. కార్యాలయంలోని అనవసరమైన రికార్డులను ధ్వంసం చేస్తున్నట్లు, తెలంగాణ హక్కుల కమిషన్ పత్రికా ప్రకటన ఇవ్వడం వివాదానికి దారితీస్తోంది.

 

కమిషన్ కార్యాలయ విభజన పూర్తికాకుండానే, రికార్డుల ధ్వంసం చేసేందుకు జారీ చేసిన ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘పాత రికార్డులకు సంబంధించిన తుది ఆదేశాలు మినహా, మిగిలిన రికార్డులను ధ్వంసం చేస్తాం. రికార్డుల ప్రకాక్షళనలో భాగంగా దీనిని చేపడుతున్నాం. అభ్యంతరాలేమైనా ఉంటే, 15 రోజుల్లోగా హెచ్చార్సీ కార్యదర్శిని సంప్రదించాలి’- ఇదీ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తాజాగా ఇచ్చిన పబ్లిక్ నోటిఫికేషన్. పైగా రికార్డుల ప్రక్షాళన రెగ్యులేషన్స్ -2013 ప్రకారం 2003 నుంచి 2017 వరకూ రికార్డులను రీస్టోర్ చేసినట్లు తెలిపింది. ఇదీ.. తెలంగాణ హెచ్చార్సీ ఇచ్చిన పత్రికా ప్రకటన!

 

రికార్డుల ప్రక్షాళన కోసం, దీనిని చేపడుతున్నట్లు ప్రకటించడం వరకూ బాగానే ఉంది. అయితే, ఆ రికార్డుల ధ్వంసంలో ఏపీకి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయా? లేవా అన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడమే, గందరగోళానికి దారితీసింది. ఎందుకంటే ఇప్పటివరకూ.. ఏపీ హక్కుల కమిషన్ కార్యాలయంతోపాటు, ఏపికి సంబంధించిన  రికార్డులు కూడా తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయంలోనే ఉన్నాయి. ఇప్పటిదాకా ఉద్యోగుల విభజన జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులే కొనసాగుతున్నారు.

 

పైగా.. గత 9 నెలల నుంచి ఏపీలో హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులన్నీ, తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయమే స్వీకరిస్తోంది. మరి ఆ ప్రకారంగా.. తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయంలోనే, ఏపీకి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. తాజా నోటిఫికేషన్ అనుసరించి, రికార్డులు ధ్వంసం చేసే వాటిలో.. ఏపీకి సంబంధించిన కేసుల తాలూకు రికార్డులు కూడా ఉంటాయా? ఉండవా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

 

ఇంతవరకూ ఏపీకి హక్కుల కమిషన్  నియమించపోయినప్పటికీ, ఆ రాష్ర్టానికి సంబంధించిన ఫిర్యాదుదారులు,  ఇప్పటికీ హైదరాబాద్ గృహకల్పలో ఉన్న తెలంగాణ హెచ్చారీ కార్యాలయానికే వచ్చి అర్జీలు ఇస్తున్నారు. వాటిని అధికారులు స్వీకరించి, రశీదులు కూడా ఇస్తున్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ కేసు, శిరోముండనం కేసుకు సంబంధించిన ఫిర్యాదులు కూడా, ఈ కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఏపీ మాన వ హక్కుల కమిషన్ కార్యాలయ బోర్డును తొలగించారు. అది మీడియాలో రావడంతో.. ఆంధ్ర ప్రదేశ్-తెలంగాణ హక్కుల కమిషన్ కార్యాలయం పేరిట, రెండు బోర్డులు విడిగా ఏర్పాటుచేశారు. అయితే రెండు రాష్ట్రాల హక్కుల కమిషన్ కార్యాలయాల చిరునామా అదే కావడం ఆశ్చర్యం.

 

నిజానికి, ఏపీకి హక్కుల కమిషన్ నియమించనందున, తమ వద్దకు వచ్చే ఫిర్యాదుల వివరాలను తెలంగాణ హెచ్చార్సీ అధికారులు, ఏపీ ప్రభుత్వానికి పంపించాలి. వాటిని ఏం చేయాలన్న దానిపై వివరణ కోరాలి. కానీ ఈ రెండింటిలో ఏదీ జరిగినట్లు కనిపించడం లేదంటున్నారు. ఏపీ నుంచి వచ్చే ఫిర్యాదులన్నీ కట్ట కట్టి పక్కన పెడుతున్నారు. అయితే, ఇటీవల మాలహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుమార్‌రాజా తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్‌కు ఒక లేఖ రాశారు. మీరు ఏపి నుంచి వస్తున్న అర్జీలు, ఆ ప్రభుత్వానికి పంపిస్తున్నారా? లేదా? ఆవిధంగా ఏపి అర్జీలు కూడా తీసుకోమని మీకేమైనా ఆదేశాలున్నాయా? అని ప్రశ్నిస్తూ రెండుపేజీల లేఖ రాశారు.  ఇదీ ప్రస్తుతం హెచ్చార్సీలో జరుగుతున్న పరిణామాలు.

 

ఉమ్మడి రాష్ట్రంలో నిస్సార్ అహ్మద్ కక్రూ చైర్మన్, కాకుమాను పెద పేరిరెడ్డి, మిరియాల రామారావు కమిషన్ సభ్యులుగా ఉన్నప్పుడే..  2013లో  రెగ్యులేషన్స్ రూపొందించి, జీఓ ఎంఎస్ నెంబర్ 555తో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అందులో .. హెచ్చార్సీ ఎలా పనిచేయాలన్న నిర్దేశం ఉంది. నిజానికి కక్రూ చైర్మన్‌గా ఉన్నప్పటికీ, ఆయన ఎక్కువకాలం సీట్లోనే ఉండేవారు కాదు. తీర్పులు-విచారణలన్నీ, కాకుమాను పెద పేరిరెడ్డి చూసేవారు. ఆ తర్వాత ఆయనే యాక్టింగ్ చైర్మన్ అయ్యారు. అది వేరే విషయం.  రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తెలంగాణ హెచ్చార్సీ కూడా.. ఆ మేరకు రెగ్యులేషన్స్ రూపొందించి, ప్రభుత్వానికి పంపి, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది.  కానీ, ఇప్పటివరకూ అలాంటి చర్యలు చేపట్టకుండానే, రికార్డుల ధ్వంసంపై నోటిఫికేషన్ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు న్యాయవాదుల నుంచి వినిపిస్తున్నాయి. అది కూడా ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హెచ్చార్సీని విభజించకుండా చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

 

నిజానికి, ఒక పిటిషన ర్ వేసిన కేసు మేరకు... ఏపీలో మానస హక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలని, దాని కార్యాలయం కూడా ఏర్పాటుచేయాలని.. హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 31న ఏపీ సర్కారును ఆదేశించింది. అందుకు ఏపీ ప్రభుత్వం రెండు నెలల గడువు కోరింది. అయితే హైకోర్టు మాత్రం నాలుగు నెలల గడువు ఇచ్చింది. అప్పుడు హెచ్చార్సీ ప్రక్రియ పూర్తయిందని తమకు చెప్పాలని ఆదేశించింది. హెచ్చార్సీ లేనందున, ఆ కేసులు కూడా తమ వద్దకు రావడంతో పనిభారం పెరిగిపోయిందని వ్యాఖ్యానించింది. అందుకు స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. మూడు నెలల్లోగా కమిషన్‌ను తిరిగి ఏర్పాటుచేస్తామని చీఫ్ జస్టిస్ సీజే మహేశ్వరి, జస్టిస్ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనానికి చెప్పారు.

 

అయితే.. హైకోర్టు ఆదేశాలను, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి యధావిధిగా బేఖాతరు చేశారు. దీనిపై మళ్లీ అదే పిటిషనర్.. సర్కారుపై కోర్టు ధిక్కరణ కేసు వేశారు.  తొలుత బెజవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని కార్యాలయంగా ఎంచుకున్నట్లు ప్రచారం జరిగింది. అది కూడా ఏ కారణం వల్లనో వెనక్కి పోయింది. ఏపీలో హెచ్చార్సీ ఏర్పాటుచేయమని ఆదేశించి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకూ ఆ ఊసే లేకపోవవడం కచ్చితంగా ధిక్కారమేనని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలు కూడా అమలుచేయకపోతే, ఇక ఎవరికి చెప్పాలన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మండలి చైర్మన్ టీడీపీకి చెందిన వ్యక్తి ఉన్నందున, ఆయన పదవీకాలం ముగిసేవరకూ.. హక్కుల కమిషన్‌ను ఏర్పాటుచేయకూడదన్న భావనతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమయితే వచ్చే ఏడాది కూడా ఏపీలో హక్కుల కమిషన్ ఏర్పాటు కల్లగానే మారడం ఖాయం.

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.