తెలంగాణలో డేంజర్ బెల్స్, సంక్షోభంలో విద్యా వ్యవస్థ

Publish Date:Sep 15, 2015

Advertisement



 

ఏళ్ల తరబడి నిరీక్షణ, కోటి ఆశలు, ఎన్నో కలలు, వేలాది ఆకాంక్షలు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు బాగుపడతాయన్న నమ్మకం... తెలంగాణ రాష్ట్రం రానే వచ్చింది, కానీ నాలుగున్నర కోట్ల ప్రజల ఆశలు మాత్రం కలలుగానే మిగిలిపోతున్నాయి. సొంత పాలకుల చేతిలోనూ నిరాశే ఎదురవుతోంది, అవమానాలే మిగులుతున్నాయి. ఒక్కటేమిటి అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి, ఒకపక్క అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన యువత...సరైన విద్య అందక పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతున్నారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభమే కాదు,  విద్యావ్యవస్థ కూడా చిన్నాభిన్నమై... సాయం కోసం రోదిస్తోంది.

తెలంగాణ తెచ్చింది మేమే, తమకు అధికారం ఇస్తే బంగారు తెలంగాణ చేసి చూపిస్తామంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి టీఆర్ఎస్ అధికారంలో వచ్చి ఏడాది దాటిపోతున్నా, హామీల అమలులో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వెనుకబడిపోతోంది.విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ కేజీ టు పీజీ విద్యను అమలు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు... నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అదిగో ఇదిగో...అమలు చేస్తున్నామని చెబుతున్నా, కార్యరూపం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అడుగు ముందుకుపడటం లేదు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా, ఇంతవరకూ యూనివర్సిటీలకు వీసీలను నియమించలేని దుస్థితి, రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు కూడా దాదాపుగా రెగ్యులర్ వీసీలు లేరంటే...విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ వర్సిటీలకు గత జులై నుంచి నేటివరకూ రెగ్యులర్ వీసీ లేరు. మిగతా యూనివర్సిటీల పరిస్థితీ దాదాపు అంతే, శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(హైదరాబాద్), పాలమూరు యూనివర్సిటీ(మహబూబ్ నగర్)లైతే నిధులు, తీవ్ర సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం యూనివర్సిటీలు, కాలేజీల్లో 50శాతం వరకు సిబ్బంది కొరత ఉందని, అది విద్యార్ధుల ప్రతిభా పాటవాలు, ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపుతోందని అంటున్నారు.

తెలంగాణలో చిన్నాభిన్నమైన విద్యావ్యవస్థను గమనించిన పలువురు అధికారులు...ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించారని,పరిస్థితి ఇలానే కొనసాగితే పలు యూనివర్సిటీలు...నాక్(నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్) గుర్తింపును కోల్పోతాయని, దాంతోయూజీసీ గ్రాంట్స్ నిలిచిపోయి, మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని డేంజర్ బెల్స్ మోగించారు. దాంతో ఆలస్యంగానైనా మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం...వీసీల నియామకానికి హడావిడిగా ఓ కమిటీని ఏర్పాటు చేసినా, ఇంకా కార్యరూపం మాత్రం దాల్చలేదు. ఇదిలా ఉంటే, హాస్టల్, మెస్ బిల్లులు అందక ఎస్సీఎస్టీ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,  తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, బతుకమ్మ ఉత్సవాలకు 110 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం...విద్యార్ధుల బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రైవేట్విద్యాసంస్థలు...బ్రాంచ్ ల మీద బ్రాంచ్ లు ఓపెన్ చేస్తూ దూసుకుపోతుండగా, ప్రభుత్వ స్కూళ్లు మాత్రం మూసివేత దిశగా సాగుతున్నాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పైగా డ్రాపవుట్స్ ను తిరిగి స్కూళ్లకు చేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, దాంతో పేదలకు విద్య మరింత దూరమవుతోందని అంటున్నారు.

తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యావ్యవస్థను బాగుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయమని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఎన్నికల హామీల్లో ఒకటైన విద్యావ్యవస్థను గాడిలో పెడుతుందో లేక చేతులెత్తిస్తుందో చూడాలి

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.