Publish Date:Nov 22, 2013
కేంద్రం తెలంగాణ ఇచ్చే కార్యక్రమాన్ని ఏదో ఆషామాషీగా చేసిపారేద్దాం.. ఆంధ్రప్రదేశ్‌ని ఈజీగా రెండు ముక్కలు చేసిపారేద్దాం అనుకుని విభజన నిర్ణయాన్ని ప్రకటించింది. నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతగానీ తాను తేనెతుట్టె మీద రాయితో కొట్టానని అర్థం అర్థంకాలేదు. ఇప్పుడు రాష్ట్రాన్ని కేక్ కోసినట్టు కోయడానికి కత్తి పట్టుకుని రెడీ అయిన మంత్రుల బృందానికి రాష్ట్రాన్ని ఎలా కోయాలో తెలియక ఆ కత్తితోనే బుర్రలు గోక్కుంటున్నారు.
రాష్ట్ర విభజన విషయంలో ఏ పాయింట్ గురించి ఆలోచించినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థంకాక టెన్షన్ పడిపోతున్నారు. నెలలు, సంవత్సరాలు ఆలోచించి, ఎంతో కృషి చేస్తే తప్ప సాధ్యం కాని రాష్ట్ర విభజన ప్రక్రియని కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు సింపుల్‌గా పూర్తి చేయడం ఎలాగో తెలియక గందరగోళపడిపోతున్నారు. అందుకే మంత్రుల బృందంలోని సభ్యులు ఈ విభజన గోల తమ నెత్తిన అనవసరంగా పడ్డ బరువుగానే భావిస్తున్నారు. బాధ్యత మొత్తం షిండే, జైరామ్ రమేష్ భుజాల మీద పడేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టు అందరూ తప్పించుకు తిరుగుతున్నారు. మంత్రుల బృందం సమావేశానికి డుమ్మా కొట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మంత్రుల బృందం ఎప్పుడు సమావేశమైనా కొన్ని సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.
దోశ పెనం మీద వుందన్నంత ఈజీగా బిల్లు రెడీ అవుతోందని మంత్రుల బృందం సభ్యులు గంభీరంగా చెబుతున్నప్పటికీ, నిజానికి అంత సీను లేదని తెలుస్తోంది. తమకు వీలుకాకుండా పోయిన ఈ తద్దినాన్ని ఎలా పెట్టాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా వుంటే, తెలంగాణ బిల్లు ఎందాకా వచ్చింది సార్ అని బృందంలో కీలక సభ్యుడు జైరామ్ రమేష్‌ని విలేకరులు అడిగితే, ఆయన ‘గోవిందా.. గోవింద’ అనేసి వెళ్ళపోయారట. పాపం లోపల ఎంత మథనపడి వుండకపోతే ఆయన నోట్లోంచి ఆ మాట బయటపడుతుంది? జైరామ్ రమేష్ చేసిన కామెంట్ చూస్తుంటే తెలంగాణ బిల్లు శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలు లేవన్నట్టే అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోతే ఇక తెలంగాణ పరిస్థితి జైరామ్ రమేష్ చెప్పినట్టు ‘గోవిందా’ అనుకోవడమే అని భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-state-39-27690.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?