చిక్కుల్లో రఘురామ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు

Publish Date:Nov 24, 2022

Advertisement

 వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రఘురామ రాజుకు దెబ్బ మీద దెబ్బ  తగులుతోందని చెప్పక తప్పదు.  గతంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన అరికాళ్ల మీద విపరీతంగా కొట్టారంటూ వచ్చిన ఆరోపణలు గత ఏడాది పెను సంచలనం సృష్టించాయి.  తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కావాలంటూ రఘురామకు తెలంగాణ సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిట్ ఆ నోటీసులలో పేర్కొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని రఘురామ అన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామను విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో మరోసారి రఘురామకృష్ణరాజు మరోసారి వార్తల్లోకి వచ్చారు.

గత ఏడాది మే 14న ఏపీ సీఐడీ అధికారులు రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా రఘురామ వ్యవహరించారనే అభియోగంతో ఆయనను అరెస్ట్ చేశారు. రఘురామపై 124 ఏ, 153 బీ, 505 ఐపీసీ, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజద్రోహం సహా పలు కేసులు పెట్టారు.  అయితే.. తనను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు తీవ్రంగా కొట్టారని రఘురామ ఆరోపించడం తీవ్ర సంచలనంగా మారింది.  పోలీసుల దెబ్బలతో తన కాళ్లు వాచిపోయాయని చెప్పడంతో గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయన శరీరంపై గాయాలు లేవని హైకోర్టుకు చెప్పారు.

ఆ వెంటనే రఘురామ సుప్రీంకోర్టులో వైద్య పరీక్షలపై పిటిషన్ వేశారు. రఘురామను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని, రఘురామ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున వైద్యపరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని అప్పుడు తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు అదేశించింది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక ప్రకారం.. రఘురామ ఎడమకాలి వేలు ఫ్రాక్చర్ అయిందనీ, ఇతర గాయాలు కూడా ఉన్నట్లు తేలింది. రఘురామ బెయిల్ పిటిషన్ పై తీవ్ర వాదోపవాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచీ రఘురామ ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తూనే ఉండడం విశేషం.

రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం, భౌతికంగా కొట్టడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించడం విశేషం. రఘురామ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును హెచ్చార్సీ తప్పుపట్టింది. అప్పటి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, హోం మంత్రిత్వశాఖ చీఫ్ సెక్రటరీకి నోటీసులు కూడా ఇచ్చింది.

ఇప్పుడు తాజాగా  ఎమ్మెల్యేలకు ఎర  కేసు దర్యాప్తులో భాగంగా రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించిందని సమాచారం. ఈ క్రమంలోనే రఘురామను విచారణకు రావాలని తెలంగాణ సిట్ 41ఏ నోటీసు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు ఏపీ సీఐడీ యాక్షన్ వెనుక సీఎం జగన్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా రఘురామకు తెలంగాణ సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అక్కడ సీఎం, ఇక్కడ సీఎం ఇద్దరూ ఒకే తానులో ముక్కల్లాంటి వారే అని.. రఘురామను ఇరుకున పెట్టేందుకు ఇద్దరి సంయుక్త వ్యూహం ఏమైనా ఉందా? అనే సంశయాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.