ఎవరి తెలంగాణ ఇది?  తెరాస ఎవరిది?

Publish Date:Jun 2, 2021

Advertisement

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు పూర్తయ్యాయి. ఎన్నో ఆశలు, ఆశయాల వేదికగా ఆవిర్భవించిన రాష్ట్రం ఎనిమిదవ  ఆవిర్భావం దినోత్సవం జరుపుకుంటోంది.ఈ సందర్భంగా సంబురాలు జరుగుతున్నాయి. సమస్యలూ ఎదుర్కుంటోంది.  అన్నిటినీ మించి ఇప్పుడు ప్రధానంగా, తెలంగాణ సాధనలో కీలక పాత్రను పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ఓనరెవరు? ఈ పార్టీ ఎవరిదీ? ఈ తెలంగాణ రాష్ట్రం హక్కుదారులెవరు. ఇది బడుగుల రాజ్యం , బడుగుల రాష్ట్రం, బడుగుల పార్టీనా, లేక దొరల రాజ్యం, దొరల రాష్ట్రం, దొరల పార్టీనా? ఎవరి తెలంగాణ ఇది ? తెరాస ఎవరిదీ? అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే అంశం రాజకీయ వర్గాల్లో,సామాన్యజనంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, బడుగు నేత ఈటల రాజేందర్’కు ముఖ్యమంత్రి కేసీఆర్ తమ మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికిన నేపధ్యంలో, ఈప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు, కేసీఆర్, పార్టీలో ఉన్న పాత కాపులు అందరినీ ఏరివేస్తూ వస్తున్న క్రమంలో బడుగు నేత ఈటల రాజేందర్’కు ఇటీవల ఉద్వాసన పలికారు. ఈ నేపధ్యంలో, తెరాస ఎవరిదీ? తెలంగాణ ఎవరిదీ? అన్న ప్రశ్న చర్చకు వస్తోంది. బడుగులం మేము తెరాస ఓనర్లమే ఆనందుకే ఆయనపై వేటుపడింది.  

అయితే ఇది ఈరోజు మొదలైన చర్చకాదు, కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఎప్పుడు అయితే  రాజకీయ అరంగేట్రం చేశారో, అప్పటినుంచే, బయట పడినా పడక పోయినా, పార్టీ భవిష్యత్ స్వరూప, స్వభావాలపై చర్చ మొదలైంది. 2001 జరిగిన పార్టీ ఆవిర్భావ సభ (సింహగర్జన సభ) వేదిక నుంచి కేసీఆర్ తమ కుటుంబ సభ్యులు ఎవరూ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరని, రాజకేయాలోకి రారని చాలా స్పష్టంగా ప్రకటించారు. చివరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాను సైతం పదవువులు ఆశించనని, దళితుని ముఖ్యమంత్రిని చేసి తాను కాపలా కుక్కలా ఉంటానని అన్నారు. అయితే ఆతర్వాత ఏమి జరిగిందో వేరే చెప్పనక్కరలేదు. కొడుకు , కూతురు మాత్రమే కాదు , ముందునుంచి ఉన్న మేనల్లుడు, మరో బంధువు, మరో బంధవు ఇటు పార్టీలో అటు ప్రభుత్వం లోనూ కీలకంగా మారారు. 

అయితే ఇదేమీ అనూహ్యం కాదు. ఇలా కాకుండా ఇంకోలా జరిగుంటే, అది ఆశ్చర్యపోవలసిన విషయం అవుతుంది. కేసీఆర్ మాత్రమే కాదు,రేపు ఈటల సొంత పార్టీ పెట్టినా, అది కూడా చివరాఖరుకు, మరో కుటుంబ పార్టీగానే రూపాంతరం చెడుతుంది. దేశంలో ఉన్న ఏ ప్రాతీయ పార్టీ చరిత్ర తీసుకున్నా, అన్ని పార్టీలదీ ఒకటే చరిత్ర. తెరాస అందుకు భిన్నం కాదు. అందుకే, జలదృశ్యం మారి పోయింది. ఉద్యమ పార్టీగా అవిర్భవించిన తెరాస రూపాంతరం  చెందింది. రాష్ట్ర ఆవిర్భావంతోనే ఉద్యమ అవతారం చాలించింది. ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఎన్నికలలో విజయం సాధించిన వెంటనే, కేసీఆర్ పలికిన తొలి పలుకులు, చేసిన తొలి ప్రకటన ఇదే.. “తెరాస ఇక ఎంతమాత్రం ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ గా పనిచేస్తుంది” అని ప్రకటించారు. నిజంగా కూడా, ఉద్యమ లక్ష్యం  నెరవేరిన తర్వాత, ఉద్యమ పార్టీ అవసరం తీరిపోయిన తర్వాత,  పార్టీ కొత్త అవతారం తీసుకోవడం తప్పుకాదు. అయితే, ఉద్యమ లక్ష్యాలను వదిలేసి, చివరకు, ఫక్తు పదహారణాల , ‘కుటుంబ’ పార్టీగా మారిపోవడం, ఉద్యమానికి ద్రోహం చేయడంతో సమానం. 
ఇప్పుడు, ఈటలకు ఉద్వాసన చెప్పడానికి  కూడా ప్రధాన కారణం అదే. కుటుంబ పాలనను కాదనడమే అయన చేసిన నేరం. కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేయాలన్న, కుటుంబ నిర్ణయాన్ని, పత్యక్షంగా పరోక్షంగా ప్రశ్నించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. అందుకే ఆయన్ని ఆ విధంగా సాగనంపారు. నిజానికి, ఇలా సాగనంపిన వారిలో ఈటల మొదటి వ్యక్తి కాదు, బహుసా చివరి వ్యక్తికూడా కాకపోవచ్చును. 

ఇలా కేసీఆర్ రాజకీయ ‘చతురత’ కు చిత్తయిన వారి జాబితా చాలా పెద్దది. నరేంద్రతో మొదలు పెడితే, కేసీఆర్  కంటే ముందునుంచి తెలంగాణ నిదాదాన్ని వినిపించిన  ఇన్నయ్య, విజయరామ రావు, రవీంద్ర నాయక్ (ఈయనకు కేసీఆర్ ఇచ్చిన బిరుదు, బంజార గాంధీ, అయితే, అదే గాంధీని తెలంగాణ భవన్ మెట్లు ఎక్కనీయ లేదు. చెప్పులతో కొట్టి , చొక్కా చింపి బయటకు గెంటేశారు),నారయణ రెడ్డి, చెరకు  సుధాకర్, సంతోష రెడ్డి, మందాడి సత్యనారాయణ, విజయశాంతి, కొదండ రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంతకు ముగియనంత జాబితా ఉటుంది.   

కాబట్టి, ఇప్పడున్న పార్టీ ఎవరిదో వేరే చెప్పనక్కరలేదు. ఎవరో అన్నట్లుగా  ఇది, ఇతర కుటుంబ పార్టీలలానే, తెరాస కూడా ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ ... కాదు, వద్దనుకుంటే ప్రజల ప్రత్యాన్మాయం పుట్టుకురావాలి ... ఇప్పటికైతే, తెరాస ఒక ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ,, తెలంగాణ కంపెనీ ప్రాపర్టీ ..కాదంటే మరో ఉద్యమమే శరణ్యం.

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.