తెలంగాణ పోలీసుల ఆరోగ్య భద్రత పథకం రద్దు.. ఎందుకంటే?

Publish Date:Jul 1, 2026

Advertisement

తెలంగాణ పోలీసు సిబ్బందికి దశాబ్దాలుగా కొండంత అండగా నిలిచిన  ఆరోగ్య భద్రత నగదు రహిత   వైద్య చికిత్స పథకం రద్దైంది. బుధవారం (జులై1 )నుంచి ఈ పథకాన్ని  నిలిపివేస్తున్నట్లు డిజిపి, ఆరోగ్య భద్రత పథకం చైర్మన్ అయిన సీవీ ఆనంద్  సర్క్యులర్ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్తగా  ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడమే దీనికి ప్రధాన కారణం. ఈ కొత్త విధానం ప్రకారం, జూన్ నెలకు సంబంధించిన జీతాల నుండి ఉద్యోగుల బేసిక్ పే,  పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుండి 1.5 శాతం చందాను రికవరీ చేయాలని ప్రభుత్వం జీవో 79 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా, జూలై 1న చెల్లించే జూన్ జీతాల నుండి పాత ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించిన నెలవారీ చందా వసూళ్లను నిలిపివేశారు.

గత కొంతకాలంగా ఆరోగ్య భద్రత పథకం   నిధుల కొరతతో సతమతమౌతోంది. ఈ పథకం కింద ప్రతి నెలా దాదాపు 3వేల వైద్య బిల్లులు వస్తుండటంతో.. పాత నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుండి ఎలాంటి అదనపు రీఇంబర్స్‌మెంట్లు వచ్చే అవకాశం లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే, నెట్‌వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30,  అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు  ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ కొత్త ఇహెచ్‌సిటి   విధానంలో ఉద్యోగుల నుండి వసూలు చేసే 1.5 శాతం చందా మొత్తాన్ని వైద్య, ప్రజారోగ్య అవసరాల కోసం కేటాయించిన ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. ఒకే కుటుంబంలో డూప్లికేషన్ లేదా ఒకే వ్యక్తి నుండి రెండుసార్లు చందాలు కట్ కాకుండా ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిబంధనలను విధించింది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా, లేదా ఒకరు ఉద్యోగి అయి మరొకరు పెన్షనర్ అయినా, లేక ఒకే పెన్షనర్ సర్వీస్,  ఫ్యామిలీ పెన్షన్లు రెండూ పొందుతున్నా... కేవలం ఒక్కరి నుండి మాత్రమే ఈ చందా  సేకరిస్తారు. 1999లో ప్రారంభమై, పోలీస్ శాఖలో అత్యంత ఆదరణ పొందిన ఈ క్యాష్‌లెస్ హెల్త్‌కార్డ్ వ్యవస్థ  రద్దు కావడం పట్ల పోలీసు సిబ్బందిలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
2026 శ్రీ కృష్ణ జన్మాష్టమి తేదీ, పవిత్ర నిశిత పూజ ముహూర్తం, ఉపవాస పారణ సమయం మరియు లడ్డూ గోపాలుడి పూజా విధానం గురించిన సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో 5000 ఆలయాల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం మరియు టీటీడీ శ్రీకారం చుట్టాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాల పునరుద్ధరణ మరియు ధర్మప్రచార ప్రాజెక్ట్ సమగ్ర వివరాలు తెలుసుకోండి.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.