తెలంగాణలో మూడు దశల్లో ‘స్థానిక’ ఎన్నికలు!

Publish Date:Aug 30, 2024

Advertisement

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు జరిగే తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో వేగం పెంచింది. అందులో భాగంగా ఓటరు జాబితా రూపకల్పన దిశగా చర్యలు ప్రారంభించింది.  

 గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ వినా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారాలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో గురువారం (ఆగస్టు 20) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేసింది.

ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ లిస్టును యథావిధిగా పరిగణనలోనికి తీసుకుని, వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ జాబితాలను తయారు చేసి ముసాయిదాను వచ్చే నెల 6న ప్రచురించాలని ఆదేశించారు.  ఆ తరువాత  మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని సూచించారు. ఈ ముసాయిదా జాబితాలో వార్డు వారీగా లేదా పంచాయతీ వారీగా ఓటర్లను అమర్చడంలో ఏవైనా పొరపాట్లు జరిగితే సెప్టెంబర్ 13 వరకు సంబంధిత మండల పరిషత్ అధికారులకు లేదా జిల్లా పంచాయతీ అధికారులకు రాత పూర్వకంగా తెలపాలని సూచించారు.   ఓటరు జాబితాల తయారీ, వార్డుల వారిగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పొలింగ్ సిబ్బంది శిక్షణ తదితర విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.  

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్‌  పద్ధతిలో  మూడు దశల్లో నిర్వహించనున్నట్లు  ఎస్‌ఈసీ  సి.పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన తరువాత నోటిఫికేషన్‌ వెలువడుతుందన్నారు.   పంచాయతీ ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి  కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలున్నందున ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు.   పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.