తెలంగాణలో ఇక ‘స్థానిక ’ పోరు

Publish Date:Aug 10, 2024

Advertisement

తెలంగాణలో స్థానిక పోరుకు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు జోరందుకుంది. పంచాయతీ ఎన్నికలలో అత్యం కీలకమైన వార్డుల విభజనపై ప్రభుత్వం దృష్టి సారించింది. 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి.  ఇందుకు సంబంధించి  జిల్లా ప్రాజెక్టు మేనేజరు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు హైదరాబాద్‌లో శిక్షణ కూడా నిర్వహించారు. శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రైనర్లతో జిల్లాలోని ఎంపీడీవో, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం (ఆగస్టు 8) ఒక రోజు శిక్షణ నిర్వహించారు.

ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా వార్డుల విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌ ఎన్నికల ఓటరు జాబితాను అందించాలని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్నికల సంఘం నుంచి నియోజకవర్గం, మండలాలు, గ్రామాల వారీగా ఓటరు జాబితా రాగానే వార్డుల వారీగా విభజన చేపట్టనుంది. వార్డుల విభజనకు సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాల పై మాస్టర్‌ ట్రైనర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఒకే కుటుంబం అంతా ఒకే వార్డు పరిధిలో ఉండేలా విభజన చేయాలని  ప్రభుత్వం ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో ఒక కుటుంబంలో ఓటర్లు రెండు, మూడు వార్డుల్లో ఉండడం, కొన్ని చోట్ల ఇతర గ్రామాల్లోనూ ఓటరుగా నమోదు అయి ఉండ డం లాంటివి గుర్తించిన నేపథ్యంలో ఒక కుటుంబానికి చెందిన ఓటర్లను అంతా ఒక వార్డు పరిధిలోకే వచ్చేలా విభజన చేయనున్నారు.

ఈ క్రమంలో గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకొని జాబితా తయారు చేయా లని సర్కార్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓటరు లిస్ట్‌లో కుటుంబ సభ్యులం తా ఒకే వరుస క్రమంలో ఉం డేలా చూసుకో వాలని  కూడా ప్రభుత్వం సూచించింది. ఇందు కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను   సిద్ధం చేసింది. ఆ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వార్డుల విభజన చేయనున్నారు.  వార్డుల విభజనకు ప్రభుత్వం ఎలాంటి గడువు విధించలేదు.  

గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పం చి ఎన్నికలను మూడు విడతలుగా ప్రభుత్వం నిర్వహిం చనుంది. ఒకే సారి ఎన్నికలు నిర్వహిం చేందుకు సిబ్బంది సరిపడకపోవ డంతో మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహిస్తుంటారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు, 2564 వార్డులకు ఎన్నికలు జరుగు తాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది కేటాయింపుపై ఎన్నికల సంఘం గతంలోనే మార్గద ర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. ఒక్కో వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల ప్రాతిపదికన పోలింగ్‌ కేంద్రాలకు ప్రిసై డింగ్‌ అధికారి, పోలింగ్‌ అధికారులను కేటాయించనున్నారు. 200 ఓట్ల లోపు ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారి, 200-400 ఓట్లు ఉన్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 650 పైన ఓట్లు ఉన్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. 650 ఓట్లు పైన ఉన్న గ్రామాల్లో రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం గత ఏడాది డిసెంబరులో సూచించింది.  

ఈ ఏడాది ఫిబ్రవరి 1తో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పదవీకాలం పూర్తి అయ్యే లోపే ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది.  అయితే గత ఏడాది డిసెంబర్ లో  అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం  అధికారంలోకి రావడం, దీంతో సమయాభావం కారణంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత జాప్యం అనివార్యం అయ్యింది.  

By
en-us Political News

  
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.