నేరాల్లోనూ నెంబర్ వన్

Publish Date:Aug 29, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం .. అన్నిట్లోనూ తెలంగాణ రాష్ట్రమే ఫస్ట్ ...ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు తెరాస నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రతి రోజు పలికే పలుకులే ఇవీ. ఈ పలుకుల్లో ఎంత  నిజముంది, ఏమిటీ అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ విషయాన్ని అలావుంచి, అసలు విషయంలోకి వస్తే, రాష్ట్రంలో  నేరాల సంఖ్య దినదిన ప్రవర్థమానంగా, దిగ్విజయంగా ముందుకు దూసుకు పోతోంది. దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా, ఎక్కడ ఏ ఉగ్రవాద ఘాతుకం జరిగినా దాని మూలాలు హైదరాబాద్’లో తేలడం మొదటి నుంచి ఉన్నదే.. అయితే ఇప్పడు, ఇదీ అదీ అని కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయినా, అంతర్జాతీయా కాసినో కుంభ కోణమే అయినా, ఇంకో ఆర్థిక నేరం అరాచకం ఏదైనా అన్నిని మూలాలు హైదరాబాద్’ లోనే తేలుతున్నాయి. 

అదలా ఉంటే, గడచినా మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, ఎవరో కాదు, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. ఎన్సీఆర్బీ నివేదిక  ప్రకారం రాష్ట్రంలో 2020లో 1 లక్షా 47 వేల 504 నేరాలు నమొదయితే, 2021లో  1 లక్షా ,58 వేల 809 నేరాలు నమోదయ్యాయి.

హత్యలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాపులు, వృద్ధులపై దాడులు, సూసైడ్స్‌‌‌‌ పెరిగాయని ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ వెల్లడించింది. గతేడాది 21,315 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 7,447 మంది మృతి చెందారు. రోజూ 20 మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో గతేడాది 10,171 మంది సూసైడ్ చేసుకోగా అందులో కుటుంబ కలహాలు, అనారోగ్యంతో సూసైడ్‌‌‌‌ చేసుకున్న వారి సంఖ్య 4,464. ఇందులో 45 నుంచి-60 ఏండ్ల వారే ఎక్కువ‌యంతగా ఉన్నారు.

ఆత్మహ‌‌య త్యల్లో దేశంలోనే మొద‌ేసుటిస్థానంలో మ‌ ో హారాష్ట్ర నిల‌ంచ వ‌ గ గా త‌ జ మిళ‌152నాడు, ఎంపీ, బెంగాల్‌‌‌‌, క‌్మ ర్నాట‌యల క, తెలంగాణ  త‌్థార్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2020లో 802 హత్యలు జరిగితే 2021లో ఆ సంఖ్య 1,026కు పెరిగింది. ఇక కిడ్నాపులు 2,056 నుంచి 2,760కు పెరిగాయి. మహళలపై దాడుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020లో 17,791గా నమోదైతే.. 2021లో అది 20,865కు చేరింది. చిన్నారులపై దాడులు కూడా 4,200 నుంచి 5,667కు పెరిగాయి.
సో .. ముఖ్యమంత్రి మొదలు తెరాస చోటామోటా నాయకులవరకు, ప్రతి ఒక్కరూ, ప్రతి రోజు ‘మేమే నెంబర్ వన్’ అని చెప్పుకోవడం తప్పు కాదని, అనుకోవచ్చునో ఏమూ ..

By
en-us Political News

  
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.