మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి

Publish Date:Feb 13, 2026

Advertisement

 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. పట్టణ ఓటర్లు కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా వచ్చాయి.

కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ సత్తా

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. మొత్తం 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో సీపీఐ 22 సీట్లు సాధించి కాంగ్రెస్‌తో సమానంగా నిలిచింది. కాంగ్రెస్ కూడా 22 డివిజన్లలో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ 7 స్థానాలు గెలుచుకోగా,సీపీఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 5 స్థానాలను దక్కించుకున్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని సాంబశివరావు సీపీఐకి చెందినవారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టి గెలిచిన ఆయన చొరవతోనే కొత్తగూడెం నగరపాలక సంస్థగా రూపుదిద్దుకుంది. ఆ కార్పొరేషన్‌కు జరిగిన తొలి ఎన్నికల్లోనే సీపీఐ కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు సాధించడం రాజకీయంగా విశేషంగా మారింది.

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కాంగ్రెస్ హవా

నల్గొండ జిల్లాలో మున్సిపల్ పీఠాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండ మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులను హస్తం పార్టీ గెలుచుకుంది. అలాగే సూర్యాపేట జిల్లాలోని హుజుర్‌నగర్, కోదాడ, నేరేడుచర్లలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. అయితే తిరుమలగిరిలో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది.

మొత్తంగా తెలంగాణ పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీఆర్ఎస్‌కు కొన్ని ప్రాంతాల్లో పరిమిత విజయాలు దక్కినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. ఈ ఫలితాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా తుది ఫలితాలు

మున్సిపల్ పీఠాలు:

కాంగ్రెస్ – 64

బీఆర్ఎస్ – 15

హంగ్ – 36

ఇతరులు – 1

బీజేపీ – 0

మొత్తం వార్డులు:

కాంగ్రెస్ – 1346

బీఆర్ఎస్ – 723

బీజేపీ – 261

ఇతరులు – 252

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.