తెలంగాణ స్థానిక ఎన్నికలపై తొలగిన సస్పెన్స్!

Publish Date:Nov 18, 2025

Advertisement

తెలంగాణ స్థానిక ఎన్నికలు ఎప్పడు అన్నదానిపై సస్పెన్స్ తొలగిపోయింది. జూబ్లీ ఉప ఎన్నిక విజయంతో మాంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇదే జోరులో, ఇదే జోష్ లో ఉండగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కూడా వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 1 నుంచి 9 వ తేదీ వరకూ జరగనున్న ప్రజాపాలన ఉత్సవాల తరువాత స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి 20 నెలలకు పైగా అయ్యింది. ఈ నేపథ్యంలో వాటి నిర్వహణపై గత ఏడాదిగా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 

ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకోవడంతో ఆ సస్పెన్స్ తొలగినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా పాలన వారోత్సవాలు ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటున్నారు. తొలుత పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత స్వల్ప విరామం అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. 
అధికార పార్టీ తొలుత స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఉండాలని సంకల్పించింది. ఆ కారణంగానే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జాప్యం అయ్యాయని చెప్పక తప్పదు. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకించడంతో అది వీలు కాలేదు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలుత హైకోర్టును, అటు పిమ్మట సుప్రీం కోర్టునూ ఆశ్రయించింది. అయితే.. రెండు చోట్లా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల స్పందన రాలేదు. హైకోర్టు రిజర్వేషన్లలో 50శాతం పరిమితికి కట్టుబడి ఉండాలని సూచించగా, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో  ప్రభుత్వ ప్రతిపాదనకు సంబంధించి ఈ నెల 24న సమీక్షించనుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వర్గాలలో హైకోర్టు ఏం చెబుతుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.  మొత్తం మీద కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం   అనుకూలంగా ఉన్న ప్రజల మూడ్ మారకుండానే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  

By
en-us Political News

  
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.