Publish Date:Feb 15, 2026
ఎవరు ఎవరికి శతృవులో మితృవులో రాజకీయాల్లో చెప్పడం చాలా కష్టం. ఇటు ఏపీ అటు తెలంగాణాలో సొంతింటి బిడ్డలే ఆయా తండ్రి, సోదరులపై విరుచుకుపడుతుంటే.. అసలు సిసలైన ప్రత్యర్ధులకు పెద్దగా పని లేకుండా పోతోంది. ఏపీలో షర్మిళ రూపంలో ఆమె సోదరుడు జగన్‌పై తీవ్రస్థాయిలో.. నిందలూ- నిష్టూరాలు- అపవాదులు- అభిశంసనలు.. చివరికి అధికారం అతడికి సూటు కాలేదనడాలు.. ఇలా లెక్కలేనన్ని మాటలు తూటాల్లా పేలాయి.
ఇప్పుడు తెలంగాణలో కవిత రూపంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ,మాజీ మంత్రి హరీష్‌రావు , మాజీ ఎంపీ సంతోష్ తదితరులకు కవిత సినిమా చూపిస్తున్నారు. తాజాగా వచ్చిన మున్సిపల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలసి తాము పోటీ చేశారు.. వారి ద్వారా గుర్తింపు తెచ్చుకునే యత్నం చేశారు కవిత. ఎందుకంటే ఆమెకు ఇంత వరకూ ఒక పార్టీ లేదు కాబట్టి. విచిత్రమైన విషయమేంటంటే కవిత ద్వారా ఫార్వర్డ్ బ్లాక్ అన్నది ఒకటి ఉందని చాలా మందికి ఇప్పుడే తెలిసింది.
ఇదిలా ఉంటే తాను పార్టీ పెడతానని తెలిసిన వెంటనే ప్రత్యర్దులను పక్కన పెడితే.. బీఆర్ఎస్ నేతలు చాలా మంది తనను ట్రోల్ చేస్తున్నారనీ.. వారందరికీ చెప్పేదేంటంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ముందుంది అసలు సినిమా అంటూ వార్నింగ్ ఇచ్చారు కవిత. సందట్లో సడేమియాలాగా.. కొందరు జాగృతి పార్టీ లీడర్లు ఏమంటున్నారంటే.. కవితక్క వచ్చే రోజుల్లో సృష్టించబోయే ప్రభంజనం ద్వార కేసీఆర్ ఆయన పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని. ఈ మాటలంటున్నపుడు కవిత కూడా ఏమీ అనలేని దుస్థితి.
తాను రాజకీయంగా ఏవో నాలుగు చిలకపలుకులు పలికి పబ్బం గడుపుకోవాలని చూస్తుంటే వీరేంట్రా బాబూ.. నేను ఉత్తుత్తినే అన్న మాటలు నిజం చేసేలా ఉన్నారు??? అని లోలోపల అనిపిస్తున్నదా దాన్ని బయటకు అనలేని సిట్యువేషన్లో పడిపోయారు కవిత. ఆవు ఒక గట్టున నడిస్తే దూడ మరో గట్టున ఎందుకు నడుస్తుంది? ఇదీ అంతే అన్నట్టుగా మారింది పరిస్థితి.
కవితే, తన తండ్రి, ఆయన పార్టీ, ఆయన ఇతర నాయకులపై విరుచుకుపడుతుంటే.. మరి ఆమె సంస్థ కార్యకర్తలు మాత్రం ఊరుకుంటరా? బరాబర్ ఇలాగే మాట్లాతారన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. పాపం ఇవన్నీ విని కవితక్క లోలోన ఎంత రగిలిపోతున్నారో. ఆమె ఒక రాజకీయ అవసరం కోసం తన తండ్రీ సోదరులపై కత్తి కడితే.. దాన్ని సీరియస్ గా తీస్కున్న కార్యకర్తలనే మాటలు ఆమెకు గుండెకోతగా అంచనా వేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-jagruti-39-214118.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.