అవినీతి మరక అంటని ఆణిముత్యం చంద్రబాబు!

Publish Date:Sep 12, 2024

Advertisement

చంద్రబాబు నిప్పు.. ఆ నిప్పుకు చెదలు పట్టాయంటూ ప్రత్యర్థులు ఎంతగా దుష్ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. రెండు దశాబ్దాలకు పైగా చంద్రబాబుపై అవినీతి మరక అంటించాలని ప్రత్యర్థులు శతథా చేసిన ప్రయత్నాలన్నీ వీగిపోయాయి. కోర్టులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేశాయి.

వాస్తవానికి చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని, ఆయన తప్పు చేయరు, ఎవరినీ చేయనీయరు అని ప్రతిపక్ష నేతలే  ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తారంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అయినా రాజకీయ కారణాలలో ఆయనకు అవినీతి మరక అంటించేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి. న్యాయస్థానాలు చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేశాయి.  తాజాగా తెలంగాణ హైకోర్టు ఆయనకు ఐఎంజీ భూముల విషయంలో  క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకీ ఐఎంజీ భూముల వ్యవహారం ఏమిటంటే.. అమెరికాకు చెందిన ఐఎంజీ సంస్థకు  నేఅత్యున్నత క్రీడా సౌకర్యాల కల్పన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2003లో భూములు కేటాయించారు. అయితే ఆ సంస్థ పనులు మొదలు పెట్టడానికి ముందే  చంద్రబాబు ప్రభుత్వం గద్దెదిగింది. 2004 ఎన్నికలలో విజయం సాధించిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. అప్పటి వైఎస్ ప్రభుత్వం ఐఎంజీకి భూములు స్వాధీనం చేయలేదు సరికదా, వాటిని రద్దు చేసింది.    అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఐఎంజీ భూముల కేటాయింపులో అక్రమాలు అంటూ సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై హైకోర్టులో కేసులు వేసారు.  

అంతకు ముందు వైఎస్ విజయమ్మ కూడా చంద్రబాబుపై విచారణ జరిపించాలంటూ కోర్టులో కేసు వేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ కోరారు. అయితే రాజకీయ కక్షలతో ఆధారాలు లేని కేసులు నమోదు చేశారని వ్యాఖ్యానించిన కోర్టు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఆ తరువాత విజయమ్మ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడా విజయమ్మ పిటిషన్ తిరస్కరణకు గురైంది.  
ఆ తరువాత ఐఎంజీ భూముల కేటాయింపులో కుంభకోణం జరిగింది, సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందే అంటూ విజయసాయిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. దానిపై తాజాగా తెలంగాణ హైకోర్టు సీబీఐ విచారణ అవసరం లేదంటూ తీర్పు ఇచ్చింది. ఐఎంజీ భూముల కేటాయింపులో ఎలాంటి కుంభకోణం లేదనీ, ఎలాంటి అవకతవకలూ లేవనీ విస్ఫంష్టంగా తేల్చేసింది.  దీంతో చంద్రబాబు నిజాయితీ మరో సారి రుజువైంది.  

వాస్తవానికి నాలుగుదశాబ్దాలకు పైగా మచ్చలేని చంద్రబాబు రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమే.
ఇంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన వారిపై ఆరోపణలు రావడం.. కేసులు నమోదవడం సహజం. అయితే చంద్రబాబునాయుడు పై జగనమోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప.. అంతకు ముందు కేసులు లేవు. నేర చరిత్ర ఇసుమంతైనా లేని ప్రజాజీవితం ఆయనది. కానీ ఆయనపై లెక్కేలేన్ని కోర్టుల్లో మాత్రం పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి.  కానీ ఏమీ తేల్చలేకపోయాయి. తాజాగా ఐఎంజీ పిటిషన్లోనూ ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది.  

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.