అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు అంగన్వాడీ సహాయకుల నుంచి టీచర్లుగా పదోన్నతి పొందాలంటే గరిష్ఠ వయసు 45 ఏళ్లుగా ఉండేది.
తాజాగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ నిబంధనను సవరించి, వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచింది. ఈ మార్పునకు సంబంధించిన ఫైలుపై ఆ శాఖ మంత్రి సీతక్క సంతకం చేసి ఆమోదం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలంగాణ వ్యాప్తంగా పని చేస్తున్న 4,322 మంది అంగన్వాడీ సహాయకులకు ప్రయోజనం కల్గునుంది. కాగా ఇటీవల అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-government-25-201184.html
భారతీయ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం అరికట్టేందుకు, అవినీతిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పెద్ద నోట్ల రద్దు అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఒక షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
దీపావళి పండుగ వేళ ఛత్తీస్గఢ్లో అత్యంత హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
ఇటీకాల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులతో పాటు ఉద్యోగుల పని వాతావరణంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పండుగ వేళ నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది.
హైదరాబాద్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి
హైదరాబాద్లో దీపావళి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది.
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!