జూన్ 2 సంచలనాలకు వేదిక కానుందా?

Publish Date:May 28, 2025

Advertisement

తెలంగాణ చరిత్రలో జూన్ 2వ తేదీకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆరు దశాబ్దాల పోరాటం ఫలితంగా..  అమరవీరుల త్యాగాల ఫలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన  రోజు, జూన్ 2. అవును తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం జూన్ 2. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచం నలుమూలల ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర అవతరణ వేడుకలను, స్వాతంత్ర దినోత్సవ వేడుకలా ఘనంగా జరుపుకుంటారు.  రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను తలచుకుని, నివాళులు అర్పిస్తారు. అలాగే, ప్రభుత్వ,  ప్రభుత్వేతర సంస్థలు, రాజకీయ పార్టీలు,  ప్రజా సంఘాలు, సాంస్కృతిక సంస్థలు వివిధ, కార్యక్రమాలు నిర్వహిస్తాయి. తెలంగాణ ఇంటింటి పండగ జరుపుకుంటుంది.

ఇదంతా 2014 నుంచి ప్రతి ఏటా జరుగతున్నదే.. కానీ ఈ సంవత్సరం జూన్ 2 న అంతకు మించి ఏదో జరుగుతందని, సంచలన నిర్ణయాలు ఉంటాయని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది కూడా ఏదో ఒకటి, ఆరా కాదు ఏకంగా మూడు సంచలన నిర్ణయాలకు స్కోప్ ఉందనే ప్రచారం జరుగుతోంది. 
అందులో మొదటిది  ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న, ఇప్పటికే ఎన్నో సార్లు పీటల వరకు వచ్చి ఆగిపోయిన రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ. జూన్ మొదటి వారంలో ఉంటుందని ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపధ్యంలో.. మంత్రి వర్గ విస్తరణ జూన్ 2  నే ఉండవచ్చని అంటున్నారు. తెలంగాణకు సంబంధించినంత వరకూ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2కు మించిన మంచి ముహుర్తహం మరొకటి ఉండదు. సో .. అసలంటూ, మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే జూన్ 2 నే ఉంటుందని  ఆశావహులు రెడీ అవుతున్నారు. అలాగే అదే రోజున తెలంగాణ పీసీసీ పూర్ణ కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే.. మంత్రివర్గ విస్తరణ ముహుర్తహం అయినా, పీసీసీ ప్రమాణ స్వీకార ముహూర్తం అయినా  ఈ నెల 30న ఢిల్లీలో జరిగే నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. 

అదలా ఉంటే.. తెలంగాణ సాధనలో ప్రధాన భూమిక పోషించిన  బీఆర్ఎస్ (టీఆర్ఎస్) లో ఏ  రాజకీయ తుపాను. మరింత బలపడి జూన్ 2 న కొత్త టర్న్ తీసుకుంటుందని  అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే తెలంగాణ ఇంటి పార్టీ,  బీఆర్ఎస్ అధికారికంగా రెండుగా చీలడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.  లేఖాస్త్రంతో తిరుగుబాటు జెండా ఎగరేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె  కల్వకుట్ల కవిత  రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే  తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ,  అదే రోజు కవిత సొంత పార్టీ ప్రకటన వచ్చే అవకాశాలున్నాయనీ  పరిశీలకులు భావిస్తున్నారు.  ఇటు పార్టీని అటు కుటుంబాన్ని ఐక్యంగా ఉంచేందుకు కేసీఆర్  నెరపిన  రాయబారం కూడా విఫల కావడంతో..  కవిత పార్టీ పెట్టడం, కాదంటే, పార్టీ ఏర్పాటు దిశగా మరో అడుగు వేయడం  ఖాయమని అంటున్నారు. అఫ్కోర్స్, గులబీ పార్టీలో ఇదే తోలో చీలిక కాదు గతంలోనూ పార్టీ చీలింది.  అయితే ఇప్పడు వస్తున్న చీలిక కేవలం పార్టీలో వస్తున్న చీలిక మాత్రమే కాదు. పార్టీ అధినేత కుటుంబంలో వస్తున్న చీలిక.  అందుకే ఈ చీలిక రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించడం ఖాయమంటున్నారు.  

ఈ నేపథ్యంలోనే కవిత నిజంగా కొత్త పార్టీ పెడతారా? అది కూడా జూన్ 2 నే ఉంటుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.  బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. అందుకే కవిత ఇక ఆ పార్టీలో ఉండాలనుకోవడం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు ఈ క్రమంలోనే కవిత  పార్టీ ఏర్పాటుకు సన్నాహలు ముమ్మరం చేశారని అంటున్నారు. తెలంగాణ జాగృతి వేదికగా వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం కూడా అందులో భాగమేననిచెబుతున్నారు.  జాగృతిని విస్తరిస్తూ పలు కొత్త కమిటీలను కవిత ఏర్పాటు చేశారు. మరో వంక ఇప్పటికే ఆమె పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కవిత అనుచరులే కాదు, బీజేపీ ఎంపీ రఘునందన రావు వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఏర్పాటు విషయంలో ఎలాగైతే.. ఇఫ్స్ అండ్ బట్స్ అంటే అయితే గియితేలు  ఉన్నాయో అలాగే కవిత పార్టీ ప్రకటన ముహుర్తహం విషయంలోనూ ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదన్నది మాత్రం వాస్తవం. మరోవంక, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాయబారాలు నడుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారంగా ప్రచారం జరుగుతోంది 

 ఇక రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ, కవిత కొత్త పార్టీ ప్రకటన కంటే మంరిత సెన్సేషనల్ పొలిటికల్ డెవలప్ మెంట్ ఏమిటంటే..  కాంగ్రెస్ లో బీఆర్ఎస్  విలీనానికి ముహూర్తం ఖరారైందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పెట్టినరెండు ముహుర్తలలో మొదటి ముహూర్తం జూన్ 2. అయితే ఆ దిశగా కదలికలు ఏవీ కనిపించడం లేదు. అయినా, రాజకీయాల్లో ఏ క్షణానికి ఏమి జరుగునో .. ఎవరూ ఊహించలేరు.  

ఈ మూడింటికి తోడు..  జూన్ 2 నే  ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గంట కొడతారని అంటున్నారు. ఇలా .. జూన్ 2 కేవలం తెలంగాణ అవతరణ దినోత్సవం మాత్రమే కాదు.. ఇంకా చాలా సెన్సేషన్స్ కు వేదిక కానుందని అంటున్నారు. అయితే ఈ వ్యుహాగానాల్లో ఏది నిజం అవుతుందో ..ఏది కాదో వేచి చూడవలసిందే. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.