రాజ్ భవన్ లో గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొంటారు. గురువారం సాయంత్రం 8.30 నిముషాలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి బుధవారం ఒక ప్రకటన వెలువడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరౌతారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమిళిసై జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేస్తారు. కాగా జూన్ 2 (గురువారం) తమిళసై జన్మదినం కావడం విశేషం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, గవర్నర్ జన్మదినం ఒకే రోజు కావడంతో రాజ్ భవన్ లో రెండు సంబరాలూ వేడుకగా జరుగుతాయని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం, రాజ భవన్ విభేదాల నేపథ్యంలో రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమానికి కేసీఆర్ కానీ, ప్రభుత్వం తరఫున కానీ ఎవరైనా హాజరౌతారా అన్న అనుమానాలు పొడసూపుతున్నాయి.
ఇటీవలి కాలంలో గవర్నర్ పర్యటనల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని తమిళిసై స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో గురువారం రాజ్ భవన్ లో జరిగే తెలంగాణ డే కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం హాజరు ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా గురువారం ఉదయం పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. కాగా తెలంగాణ ఫార్మేషన్ డే కార్యక్రమం కారణంగా హైదరాబాద్ లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు.
ఉదయం 7.30 గంటల నుంచి 11 గంటల వరకూ తాజ్ ఐల్యాండ్, చపెల్ రోడ్ టీ జంక్షన్, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, బషీర్ బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఎఆర్ పెట్రోల్ పంప్, ఆదర్శ్ నగర్ లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-formation-day-celebrations-in-raj-bhawan-25-136830.html
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.