గుడుంబా తయారీని ఉక్కుపాదంతో అణిచివేస్తాం!

Publish Date:May 3, 2020

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా తయారీని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో  సి ఐ, మరో ముగ్గురు కానిస్టేబుళ్లపై కిష్టరం తాండ లో  గుడుంబా తయారీదారులు దాడి చేయగా దాడిలో గాయపడిన ఎక్సైజ్  సి ఐ ని, సిబ్బందిని మంత్రి  జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయం వద్ద పరామర్శించి మీడియాతో మాట్లాడారు.

గుడుంబా తయారు చేస్తున్న వారిని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని అన్నారు. అంతేకాక  పిడి యాక్ట్ తో పాటు ఇతర చట్టాలను కూడా ఉపయోగిస్తామన్నారు.  ప్రణాళికాబద్ధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖల సంయుక్త సహకారంతో గుడుంబాను అణిచివేస్తామన్నారు. గుడుంబా నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత  అని అన్నారు. ప్రజలు  ప్రాణాలు తమకు ముఖ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు గారు   గుడుంబా రహిత  తెలంగాణగా తీర్చిదిదామన్నారు. అయితే కొందరు  లాక్ డౌన్ ను   అదనుగా తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి  బెల్లం ఇతర పదార్థాలు తీసుకువచ్చి ఆక్రమంగా గుడుంబా తయారు చేయడం బాధాకరమన్నారు. అయినప్పటికీ ఇలాంటి తయారీదారులను  అరికడతామని  మంత్రి పునరుద్ఘాటించారు. సిబ్బంది దాడులను ధైర్యంగా ఎదుర్కోవడమే కాక గుడుంబా స్థావరాలను ధ్వంసం చేసి రావడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.

తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు ముఖ్యమని  కరోనా  లాక్ డౌన్ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా ఉద్యోగులకు లక్ష 70 వేల శాని టైజర్లను  రాష్ట్రంలో పంపిణీ చేశామని మంత్రి తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా మందు దొరకనందున కొంతమంది తాగుడుకు బానిసైన వారు దొంగతనంగా గుడుంబా తయారు చేయడం, షాప్ ల లో దొంగతనం గా అమ్మటం వంటివి చేస్తున్నారని అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గుడుంబా రహిత తెలంగాణ గా తీర్చిదిద్దేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి  పునరావాసం కల్పించడం జరిగిందని, దీనివల్ల తండాలలో గుడుంబా తయారు చేసే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటమే కాకుండా, వారు వివిధ జీవనోపాధి పొందారని, ముఖ్యంగా చాలా మంది గుడుంబా తయారీదారులు ఆటోలు, మేకలు ఇతర వ్యాపారాలను చూసుకున్నారని తెలిపారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడం , వ్యవసాయ పనులు పెరిగిపోవటం వల్ల గిరిజన ప్రాంతాలలో గుడుంబా తయారుచేసే సంస్కృతి తగ్గిపోయిందని ఆయన తెలిపారు. అయితే  లాక్ డౌన్ కారణంగా   గుడుంబా  అక్రమంగా తయారు చేయడం  బాధాకరమని మంత్రి తెలిపారు. అయినప్పటికీ తాము ఎలాంటి వారిని వదిలిపెట్టమని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని అసలు సహించమని హెచ్చరించారు. కొంతమంది కెమికల్స్ ను ఉపయోగించి కూడా గుడుంబాను తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ,అలాంటి వారిని కూడా వదలబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాలలో అభివృద్ధిలో  ముందుందని, రాష్ట్రంలో పేద ప్రజలకు అవసరమైన ఆసరా పెన్షన్లు, పాఠశాలలు  ఇతర అన్ని రకాల సేవలు అందిస్తున్నామని ,ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎక్కడైనా  గిడుంబా తయారు చేస్తున్నట్లు అనుమానం వస్తే యువకులు తక్షణమే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని ,అంతకాక మీడియా కూడా గుడుంబా నిర్మూలనలో ముఖ్యమైన పాత్ర పోషించాలని మంత్రి  కోరారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.