తెలంగాణలో 2.33% క్రైమ్ రేట్ తగ్గింది : డీజీపీ శివధర్ రెడ్డి
Publish Date:Dec 30, 2025
Advertisement
తెలంగాణలో 3 శాతం సైబర్ నేరాలు తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోలీస్తే 2.33% క్రైమ్ రేట్ తగ్గిందని డీజీపీ తెలిపారు. మంగళవారం నాడు 2025 వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. మూడు విడతలు గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా కాపాడామని డీజీపీ అన్నారు. ఈ ఏడాది 2.28 లక్షలు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 4 కేసులో మరణ శిక్షలు ఖరారు అయ్యాయని.. 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పండిందని తెలిపారు. ఫోక్సో కేసుల్లో 144 కేసుల్లో 154 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని.. అందులో ముగ్గురికి మరణ శిక్ష, 48 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డాయని డీజీపీ తెలిపారు.
http://www.teluguone.com/news/content/telangana-crime-rate-36-211787.html





